E-Paper
Advertisement

ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు.. ఇద్దరు కార్మికులు మృతి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన

ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు.. ఇద్దరు కార్మికులు మృతి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన
Advertisement

Pharma Company Blast: తెలుగు రాష్ట్రాల్లోని  ఫార్మా కంపెనీల్లో పేలుళ్లు కంటిన్యూ అవుతున్నాయి. కనీసం మూడు నెలలకు ఒక ఘటన జరుగుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. వెంటనే వాటిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. అసలు ఏం జరిగింది?

 

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన

Advertisement

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. పోచంపల్లి మండలం దొంతిగూడెం గ్రామంలో ఉన్న హజే ఫార్మా కంపెనీలో ఈ ఘటన జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి కంపెనీలోని రియాక్టర్ పేలిపోయింది. దీంతో పరిశ్రమలో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. క్షణాల వ్యవధిలో మంటలు పరిశ్రమ అంతటా వ్యాపించాయి. ఆ మంటల్లో చిక్కుకున్నారు పలువురు కార్మికులు.

 

హజే ఫార్మా కంపెనీలోని రియాక్ట్ పేలుడు, పలువురు కార్మికులు మృతి

Advertisement

వారి హాహాకారాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గాయపడిన రాజశేఖర్, నాగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఆరుగురు గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఘటన గురించి తెలియగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు.

అసలు ఘటన ఎలా జరిగింది?

రాత్రి వేళ షిఫ్టులో ఎక్కువ సంఖ్యలో కార్మికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో ఈ ప్రమాదం జరగడంతో భారీగా ప్రాణనష్టం జరిగినట్టు చెబుతున్నారు. రియాక్టర్‌లో సాల్వెంట్ నింపే ప్రక్రియలో ఒత్తిడి అమాంతంగా పెరగడంతో ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయినట్టు పలువురు కార్మికులు చెబుతున్నారు. ఘటన సమయంలో ఆ ప్రాంతంలో దాదాపు 10 నుంచి 20 కార్మికులు ఉంటారని చెబుతున్నారు.

రియాక్టర్ పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూసేసరికి పరిశ్రమ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఎట్టకేలకు ఫైర్‌ ఇంజిన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ పరిశ్రమలో గడిచిన మూడు నెలల్లో ఇది రెండో ప్రమాదం. అయినా కార్మికుల భద్రతను కంపెనీ యాజమాన్యం గాలికి వదిలేసిందని అంటున్నారు కార్మికులు.

ALSO READ: రాయదుర్గం భూముల వివాదం.. పిటిషనర్లకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్

ఫార్మా కంపెనీలో ఘటన గురించి తెలియగానే కార్మికుల కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే పలువురు కార్మికులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం కన్నీరు మున్నీరు అవుతున్నారు. కంపెనీ నిర్లక్ష్యం వల్ల తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Related News

రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలనేది కాంగ్రెస్ గుడ్డి ఆరాటం: రాంచందర్ రావు!

హైదరాబాద్‌లో చిన్నారుల కిడ్నాప్ యత్నం.. చితకబాదిన స్థానికలు!

ట్రెయినీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్ మంజూరు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై.. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

రేవంత్, కేటీఆర్ ఆస్తుల చిట్టాల డ్రామా.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

రాహుల్ గాంధీ పిరికి వ్యక్తి.. అప్రజాస్వామికవాది.. కేటీఆర్ ఘాటు విమర్శలు

రాజన్న గుడికి కాంక్రీటా?.. భక్తుల విశ్వాసాలను దెబ్బతీయొద్దు.. కల్వకుంట్ల కవిత ఫైర్

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్ట్!

Big Stories

Advertisement
×