E-Paper
Advertisement

విమానంలో ఆక్సిజన్ మాస్క్.. నిజంగా ప్రాణాలను కాపాడుతుందా?

విమానంలో ఆక్సిజన్ మాస్క్.. నిజంగా ప్రాణాలను కాపాడుతుందా?
Advertisement

Airplane Oxygen Masks: విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా మీ ముందుకు ఆక్సిజన్ మాస్క్‌ లు పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో వణికిపోతారు. మాస్క్ పెట్టుకుని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. అయితే, గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఈ మాస్కుల గురించి షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ ఆక్సిజన్ మాస్క్ లు అసలు ప్రయాణికుల ప్రాణాలనే కాపాడవంటున్నారు. అయితే ఈ ప్రచారంలో నిజం ఎంత అంటే?

ఆక్సిజన్ మాస్కులు ఎందుకు?

విమానం సాధారణంగా చాలా ఎత్తులో ప్రయాణిస్తుంది. ఆ ఎత్తులో గాలిలో ఆక్సిజన్ శాతం భూమి ఉన్నట్టే ఉన్నప్పటికీ, గాలి పీడనం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల శరీరానికి అవసరమైనంత ఆక్సిజన్ లభించదు. ప్రయాణికులు సురక్షితంగా ఉండేందుకు విమానం లోపల క్యాబిన్‌ ను ప్రత్యేక పీడనంతో మెయింటెయిన్ చేస్తారు. ఏదైనా కారణంగా క్యాబిన్‌ లో పీడనం అకస్మాత్తుగా తగ్గితే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి సమయంలోనే ప్రయాణికుల ముందు ఉన్న ఆక్సిజన్ మాస్కులు ఆటోమేటిక్‌గా బయటకు వస్తాయి. వాటి ప్రధాన ఉద్దేశం హైపోక్సియా నుంచి ప్రయాణికులను రక్షించడం. శరీరానికి, ముఖ్యంగా మెదడుకు తగినంత ఆక్సిజన్ అందకపోతే హైపోక్సియా ఏర్పడుతుంది. ఎక్కువ ఎత్తులో క్యాబిన్ పీడనం తగ్గినప్పుడు ఈ సమస్య చాలా వేగంగా ప్రభావం చూపిస్తుంది. తల తిరగడం, అయోమయం కలుగుతుంది.

మాస్క్ పెట్టుకుంటే ఏ మవుతుంది?   

Advertisement

ఆక్సిజన్ మాస్క్‌ ను ధరించడం వల్ల ప్రయాణికుడికి అవసరమైన అదనపు ఆక్సిజన్ అందుతుంది. దీంతో మెదడు, శరీరం ఆక్సిజన్ కొరత లేకుంఆ ఉంటుంది. ఇదే సమయంలో పైలట్లు విమానాన్ని అత్యవసరంగా తక్కువ, సురక్షితమైన ఎత్తుకు దింపుతారు.

వైరల్ ప్రచారంలో నిజం ఎంత?

ఆక్సిజన్ మాస్కులు ప్రయాణికులను ప్రశాంతంగా చనిపోయేలా చేస్తాయి తప్ప, కాపాడవు అనే ప్రచారంలో నిజం ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్తవానికి ఆక్సిజన్ మాస్కులు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు రూపొందించిన సేఫ్టీ పరికరాలు. హైపోక్సియా కారణంగా స్పృహ కోల్పోకుండా ఉండేందుకు ఇవి ప్రయాణికులకు సాయపడుతాయి. అందుకే, విమానంలో భద్రతా సూచనలు ఇచ్చేటప్పుడు, ముందుగా మాస్క్‌ ను ధరించిన తర్వాతే పిల్లలు, ఇతరులకు సాయం చేయాలని సూచిస్తారు. అయితే, సోషల్ మీడియాలో భయాన్ని కలిగించే వార్తల్లో చాలా వరకు నిజం లేదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా విమాన భద్రత లాంటి విషయాల్లో అధికారిక సమాచారం, విమానయాన భద్రతా సంస్థల గైడ్ లైన్స్ ను మాత్రమే నమ్మాలంటున్నారు.

Advertisement

సో, ఇకపై విమానంలో ఆక్సిజన్ మాస్క్‌ లను ప్రమాదానికి సంకేతంగా మాత్రమే భావించి భయపడాల్సిన అవసరం లేదు. క్యాబిన్‌లో ఆక్సిజన్ ప్రెజర్ తగ్గిన అత్యవసర పరిస్థితిలో మీ ప్రాణాలను కాపాడేందుకు పనిచేసే కీలక భద్రతా వ్యవస్థలో భాగంగా గుర్తించాలి. అంతేతప్ప, వైరల్ వార్తల పట్ల తప్పుడు ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదు.

Read Also: రోజంతా కొండపై కూర్చుంటాడు.. నెలకు రూ.8.5 లక్షలు సంపాదిస్తాడు?

Tags

Related News

రెండు రైళ్లు ఫుల్.. ప్రయాణికుల డిమాండ్‌తో మూడో వందే భారత్‌కు రంగం సిద్ధం!

నడిరోడ్డు మీద ఆగిన కారు, బయట భారీ ట్రాఫిక్.. పోలీసుల ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్!

సముద్ర గర్భంలో బోయింగ్ విమానాలు.. కూలిపోలేదు, కావాలనే ముంచేశారు.. ఎందుకంటే?

మెజిస్టిక్.. కర్ణాటకలో తెలుగు సినిమాలు మాత్రమే ఆడే ఆ థియేటర్‌ను ఎందుకు కూల్చేశారు?

గోల్కొండలో ‘రహస్య సొరంగం’.. ఆర్మీ సీక్రెట్ తవ్వకాలు.. రంగంలోకి ఆర్కియాలజీ నిపుణులు!

పాకిస్థాన్ గాడిదలను.. ఎగబడి కొంటున్న చైనా.. ఎందుకో తెలిస్తే షాకే!

దేశంలో విచిత్రమైన ఊర్లు.. బండ బూతులే వీటి పేర్లు.. అలా ఎలా పెట్టార్రా అయ్యా!

Big Stories

Advertisement
×