Indian Railways: ప్రయాణీకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో కోస్ట్ రైల్వే (E Co R) తగిన చర్యలు తీసుకుంటున్నది. రద్దీని తగ్గించడానికి కొన్ని రైళ్లలో అదనపు కోచ్‌లను పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో పలు సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పనున్నాయి.
ఏ రైళ్లకు అదనపు కోచ్ లు పెరుగుతాయంటే?
⦿ విశాఖపట్నం-గుణుపూర్ ప్యాసింజర్
విశాఖపట్నం-గుణుపూర్ ప్యాసింజర్ రైలుకు ప్రయాణీకుల నుంచి భారీగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో విశాఖపట్నం-గుణుపూర్ ప్యాసింజర్(రైలు నెం. 58506)కు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు (నెం. 58505- గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్)కు ఒక స్లీపర్ క్లాస్ కోచ్ ను ఏర్పాటు చేస్తారు. ఆగస్టు 1 నుంచి 31 వరకు కోచ్ ల సంఖ్య పెరగనుంది.
⦿ విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్
విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ కు కూడా ప్రయాణీకుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ రైలు(నెం. 58501)కు ఓ స్లీపర్ క్లాస్ కోచ్‌ను ఏర్పాటు చేయనున్నారు. తిరుగు ప్రయాణంలో (రైలు నెం. 58502) కిరండూల్-విశాఖపట్నం ప్యాసింజర్ కు ఓ స్లీపర్ కోచ్ ను యాడ్ చేయనున్నారు. ఈ అదనపు కోచ్ లు ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈ కోచ్ లు అందుబాటులో ఉంటాయి.
⦿ భువనేశ్వర్-జునాగఢ్ ఎక్స్ ప్రెస్
భువనేశ్వర్-జునాగఢ్ ఎక్స్ ప్రెస్ కు ఆగస్టు 2 నుండి 11 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను, తిరుగు ప్రయాణంలో 20838 జునాగఢ్-భువనేశ్వర్ ఎక్స్ ప్రెస్‌కు ఆగస్టు 2 నుండి 11 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను యాడ్ చేయనున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సాన్‌దీప్ వెల్లడించారు.
Read Also: విశాఖకు వెళ్లే పలు రైళ్లు క్యాన్సిల్, మీరు వెళ్లే ట్రైన్స్ ఉన్నాయేమో చూడండి!
⦿ సంబల్పూర్-నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్
ఆగస్టు 1 నుంచి 31 వరకు సంబల్పూర్-నాందేడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ (రైలు నెం.20809)కు ఒక థర్డ్ AC, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌లను యాడ్ చేయనున్నారు. తిరుగు ప్రయాణంలో రైలు నెం.20810 నాందేడ్ – సంబల్పూర్ సూపర్-ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ కు ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఒక థర్డ్ AC, ఒక స్లీపర్ క్లాస్ కోచ్ ను యాడ్ చేయనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులు ఇక ఆహ్లాదకరంగా ప్రయాణం చెయ్యొచ్చన్నారు.
Read Also: నీటితో నడిచే రైలు.. ప్రయోగం సక్సెస్.. పరుగులు తీసే తొలి మార్గం ఇదే!