Karthika Deepam 2 serial today Episode: జాబ్ కోసం సూరజ్ దగ్గరకు వెళ్లిన జ్యోత్స్నను తనను తాను పరిచయం చేసుకోమని సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకోమని సూరజ్ చెబితే.. పరిచయం చేసుకుంటానని.. పుట్టింటి వాళ్లు మోసం చేస్తే అత్తింట్లో గౌరవంగా బతికే ఒక తల్లికి కూతురును.. మనసిచ్చినవాడు మనువాడే టైంకు మెడలో కట్టాల్సిన తాళిని ఒడిలో పడేసి మోసి చేసిన వ్యక్తిని ప్రేమించిన అమాయకురాలిని.. రోడ్డున పడిన కుటుంబం కోసం నానా కష్టాలు పడుతున్న ఒక అభాగ్యురాలిని అంటూ జ్యోత్స్న చెప్పుకుంటే..
సూరజ్ ఇంతకు మించి పరిచయం చేసుకోవడానికి నీకేం లేదా అంటే చదివిన చదువు మీకిన్న రెస్యూమ్‌లో రాసి ఉంది. ఈ పోస్టుకు న్యాయం చేయగలను అన్న నమ్మకం నాకుంది అని చెప్పగానే.. సూరజ్ మాత్రం యువర్ రిజెక్టెడ్ అంటాడు. రీజన్ అడుగుతుంది జ్యోత్స్న. సూరజ్ చెప్పడు.. తనకు రీజన్ తెలియాలని జ్యోత్స్న అడిగితే.. చెప్పనని వెంటనే వెళ్లిపోమ్మని గెంటేసేదాకా తీసుకెళ్లొ్ద్దని సూరజ్ చెప్తే.. ఇదంతా జరుగుతుందని తనకు ముందే తెలుసని.. నువ్వు టీవీలా ఇక్కడ కూర్చున్నా నన్ను రిజెక్ట్ చేసింది ఎవరో వారినైనా కారణం చెప్పమను అంటూ వెళ్లిపోతుంది జ్యోత్స్న.
ఆరు బయట కూర్చున్న దశరథ బాధపడుతుంటే దీప కాఫీ తీసుకెళ్లి ఇస్తుంది. తనకు కాఫీ వద్దని అలాగే నువ్వు పిలిచే నాన్న అన్న పిలుపు కూడా వద్దమ్మా అంటూ ఎమోషనల్ అవుతాడు దశరథ. తన కోసం శివనారాయణ పడుతున్న తపన తలుచుకుని బాధపడతాడు. తండ్రి నుంచి బాధ్యతలు తీసుకుని ఆయనకు రెస్ట్ ఇవ్వాల్సిన సమయంలో ఆయన మా కోసం కష్టపడతానంటున్నాడు అంటూ బాధపడతాడు దశరథ. చేతకాని కొడుకులా మిగిలిపోతున్నాను అంటూ చివరికి నాకు పుట్టకపోయినా తాను వెళ్లిపోయే అవకాశం ఉన్నా జ్యోత్స్న కూడా మా కోసం నిలబడింది.
నాకు మా నాన్న చెప్పింది చేయడం తప్పా నాకు ఏం తెలియదురా అంటూ ఏడుస్తుంటాడు. జీవితం ఇలాగే ఉండిపోతుందా నాన్నా అని దీప అడిగితే.. ఉండిపోతుందేమోనని భయంగా ఉందమ్మా.. నువ్వెందుకు సుమిత్రను కాపాడాలి..? నిన్ను జ్యోత్స్న ఇంటికి ఎందుకు తీసుకురావాలి..? నువ్వు నా కూతురువి అని కార్తీకే ఎందుకు చెప్పాలి..? ఇవన్నీ జరక్కపోయి ఉంటే బాగుండేది అమ్మా.. జ్యోత్స్న నా కూతురు కాదు దాని వల్ల నాకు ఏ బాధ లేదు.. నువ్వు నా కన్నకూతురువి..నీవల్లే నాకు ఈ బాధంతా అంటూ చెప్తుంటే.. దీప ఏడుస్తుంది. దీపను కార్తీ్‌క్ ఓదారుస్తూ.. అక్కడి నుంచి తీసుకెళ్తాడు.
సూరజ్ ఆఫీసులోంచి బయటకు వెళ్తున్న జ్యోత్స్నకు మాలిని ఎదురవుతుంది. ఇద్దరి మధ్య మాటల యుద్దం మొదలవుతుంది. నిన్ను నా కొడుకు రిజెక్ట్ చేశాడంట ఎందుకంటే నువ్వు వాడి దృష్టిలో వాడి నాన్న చావుకు కారణమైన సుమిత్ర కూతురువి మాత్రమే అంటూ ఇప్పటికైనా మీ తాతను క్షమాపణ చెప్పమని అడుగుతుంది. దీంతో జ్యోత్స్న కోపంగా అక్కడే ఆగిపో అత్త మా తాత మీకెప్పుడూ క్షమాపణ చెప్పడు అంటూ సూరజ్ మనసులో నువ్వు లేవు కాబట్టే నీ ఫోటో వాడి పర్సులో లేదు.. అంటూ చెప్పగానే.. నువ్వు మరీ నీ కొడుకు మీద ఆశలు పెట్టుకోకు అత్త టైం నీది నడుస్తుందని రెచ్చిపోకు నీ కొడుకు నువ్వు గీసిన గీతని దాటుకుంటూ కాదు దూక్కుంటూ వస్తాడు అంటూ వెళ్లిపోతుంది.
శివనారాయణ, పారుతో కలిసి వెళ్లి టిఫిన్ బండి ఓపెన్ చేస్తాడు. ఎంతసేపు వెయిట్ చేసినా బోణీ కూడా కాదు. అప్పుడే టిఫిన్ బండి ఓనరు వచ్చి ఇంకా కస్టమర్లు రాలేదా…? అంటూ వెటకారంగా మాట్లాడతాడు. మీరు ఎంత చేసినా కస్టమర్లు రారు ఇక మీరు ఈగలు తోలుకోవాల్సిందే అంటూ చెప్పి వెళ్లిపోతాడు. పారిజాతం కూడా బాధపడుతుంది. మన టిఫిన్లు మనమే తినాలేమో అంటూ ఎమోషనల్ అవుతుంది.
రాత్రికి కార్తీక్, దీప ఇంటికి వస్తారు. శివనారాయణ, పారు, జ్యోత్స్న ఇంకా ఇంటికి రాలేదని గాబరా పడుతుంటే.. అప్పుడే జ్యోత్స్న వస్తుంది. ఇంటర్వ్యూ ఏమైందని అడిగితే జాబ్ రాలేదని చెప్తుంది. అప్పుడే వచ్చిన శివనారాయణ, పారు కూడా వ్యాపారం జరగలేదని మిగిలిన టిఫిన్స్ అనాథ పిల్లలకు పంచేసి ఇంటికి వచ్చామని బాధగా చెప్తారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్ అయిపోతుంది.