E-Paper
Advertisement

CNGపై కేంద్రం సంచలన నిర్ణయం.. 2028 నుంచి కొత్త ఇంధన విధానం అమలు!

CNGపై కేంద్రం సంచలన నిర్ణయం.. 2028 నుంచి కొత్త ఇంధన విధానం అమలు!
Advertisement

Bio CNG Blending in CNG from 2028: దేశంలో త్వరలో CNG ఫ్యూయెల్ కు సంబంధించి కీలక మార్పులు రాబోతున్నాయి. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపినట్లే, ఇకపై CNGలో కూడా బయో CNG మిశ్రమాన్ని దశలవారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో దేశంలో క్లీన్ ప్యూయెల్ వినియోగం పెరగడమే కాకుండా, దిగుమతి చేసుకునే నేచురల్ గ్యాస్ పై ఆధారపడటం కూడా తగ్గే అవకాశం ఉంది. ఇందుకోసం కేంద్ర మంత్రివర్గం రూ.23,731 కోట్ల వ్యయంతో గోబర్ధన్ జాతీయ సర్క్యులర్ బయోఎనర్జీ పథకానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా దేశంలో బయో CNG ఉత్పత్తిని పెంచడంతో పాటు, దానికి స్థిరమైన మార్కెట్‌ను కూడా కల్పించనున్నారు.

దశల వారీగా బయో CNG అమలు

ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. 2026-27 ఆర్థిక సంవత్సరంలో CNGలో 3 శాతం బయో CNG కలపనున్నారు. 2027-28లో ఈ వాటాను 4 శాతానికి పెంచి, 2028-29 ఆర్థిక సంవత్సరం నుంచి 5 శాతం బయో CNG మిశ్రమాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం 2035-36 వరకు కొనసాగనుంది.

ఇంతకీ ఏంటీ బయో CNG?

Advertisement

బయో-CNG అనేది పశువుల పేడ, పంట వ్యర్థాలు, ఆహార వ్యర్థాలు, మున్సిపల్ వ్యర్థాలు, చెరకు పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాల లాంటి సేంద్రీయ పదార్థాలను శుద్ధి చేసి తయారు చేసే ఇంధనం. ఇది సాధారణ సహజ వాయువుకు చాలా దగ్గరగా ఉండటంతో ప్రస్తుతం ఉన్న CNG పంపిణీ వ్యవస్థలోనే ఉపయోగించవచ్చు.

కొత్తగా చేయాల్సిన మార్పులు ఏంటి?

ఇప్పటికే CNG కార్లు ఉపయోగిస్తున్న వారికి ఈ నిర్ణయం ఎలాంటి ఇబ్బంది కలిగించదు. ఎందుకంటే కొత్త బయో CNG మిశ్రమాన్ని వాడేందుకు కారులో ఎలాంటి ఇంజిన్, హార్డ్‌ వేర్ మార్పులు చేయాల్సిన అవసరం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న CNG వాహనాలు ఇదే ఇంధనంతో యథావిధిగా నడుస్తాయి. కేవలం CNG స్టేషన్లలో అందించే గ్యాస్‌లో బయో CNG శాతం మాత్రమే క్రమంగా పెరుగుతుంది. దేశంలో ఇప్పటికే మారుతి సుజుకి, టాటా మోటార్స్, హ్యుందాయ్, టయోటా లాంటి కంపెనీలు CNG కార్లను విక్రయిస్తున్నాయి. బయో CNG వినియోగం పెరగడం వల్ల ఈ వాహనాలు మరింత పర్యావరణహితంగా మారే అవకాశం ఉంది.

బయో CNG ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రోత్సాహకాలు

Advertisement

బయో CNG ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ప్రకటించింది. కొత్తగా ఏర్పాటు చేసే గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్లకు రోజుకు టన్ను ఉత్పత్తి సామర్థ్యానికి రూ.2 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించనుంది. అలాగే ఇప్పటికే ఉన్న ప్లాంట్ల విస్తరణకు కూడా సపోర్టు మద్దతు ఇవ్వనుంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త ప్రణాళిక విజయవంతంగా అమలైతే 2028-29 నుంచి భారతదేశ CNG రంగంలో కీలక మార్పు కనిపించనుంది. ముఖ్యంగా CNG వాహనాల యజమానులకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా మరింత క్లీన్ ఫ్యూయల్ ను ఉపయోగించే అవకాశం ఉంటుంది.

Read Also: ఆటోమేటిక్ కారు కొనాలా? రూ.10 లక్షల్లో బెస్ట్ 10 కార్లు ఇవే!

Tags

Related News

రిలీజ్ కు ముందే కొత్త పల్సర్ 150 లీక్.. డిజైన్‌ అదిరింది భయ్యా!

ఆటోమేటిక్ కారు కొనాలా? రూ.10 లక్షల్లో బెస్ట్ 10 కార్లు ఇవే!

KTM 390 అడ్వెంచర్ X ధర పెంపు, ఇప్పుడు కాస్ట్ ఎంత అంటే?

జస్ట్ రూ.99 వేలకే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ ఏంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

టాటా నెక్సాన్ కామో ఎడిషన్ లాంచ్.. వారెవ్వా.. ఏం ఫీచర్లు గురూ!

టెస్లా, BYDలకు షాక్.. భారత ఈవీలకు ప్రపంచ గుర్తింపు!

తెలుగు రాష్ట్రాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లతో డబ్బే డబ్బు.. ఇలా చేస్తే చాలు!

Big Stories

Advertisement
×