E-Paper
Advertisement

క్వాల్కమ్ ప్రాసెసర్‌తో HP OmniPad 12 వచ్చేసింది.. రూ. 5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఎలా పొందాలంటే?

క్వాల్కమ్ ప్రాసెసర్‌తో HP OmniPad 12 వచ్చేసింది.. రూ. 5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఎలా పొందాలంటే?
Advertisement

HP OmniPad 12: వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు.. ఇండియన్ టెక్ మార్కెట్‌లోకి ఎప్పటికప్పుడు కొత్త పరికరాలు వస్తూనే ఉంటాయి. తాజాగా ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌పీ (HP) తమ కొత్త టాబ్లెట్ OmniPad 12ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఆకట్టుకునే డిజైన్, శక్తివంతమైన ప్రాసెసర్, రోజంతా వచ్చే బ్యాటరీ లైఫ్‌తో ఈ టాబ్లెట్‌ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చారు.

ఏడాదిపాటు వారంటీ:

ఈ HP OmniPad 12 టాబ్లెట్ రెండు వేరియంట్లలో లభిస్తోంది. 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.48,999 కాగా, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999గా ఉంది. ఇది డెనిమ్ బ్లూ, మిటోరియార్ సిల్వర్ రంగుల్లో దొరుకుతుంది. హెచ్‌పీ అధికారిక సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా వంటి ప్రముఖ షాపుల్లో ఇది అందుబాటులో ఉంది. కొన్ని ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.5,000 క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఇస్తున్నారు. దీనికి ఏడాది వారంటీ ఉంటుంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్:

Advertisement

HP OmniPad 12 ట్యాబ్లెట్‌లో 12 అంగుళాల పెద్ద 2K డిస్‌ప్లేను అందించారు. 90Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల వీడియోలు చూడటానికి, గేమ్స్ ఆడటానికి స్క్రీన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌పై ఇది పనిచేస్తుంది. 8GB ర్యామ్ ఉండటం వల్ల ఒకేసారి ఎక్కువ పనులు చేసుకున్నా టాబ్లెట్ స్లో అవ్వదు. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది రన్ అవుతుంది.

Also Read: ఆండ్రాయిడ్ 16, జేబీఎల్ ప్రో సౌండ్‌తో మోటరోలా కొత్త ట్యాబ్లెట్.. ఫీచర్లపై ఓ లుక్కేయండి!

600 గ్రాముల బరువు:

Advertisement

ఫొటోలు, వీడియోల కోసం HP OmniPad 12లో వెనుక వైపు 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను ఇచ్చారు. ఇక ఆన్‌లైన్ క్లాసులు, ఆఫీస్ మీటింగ్స్, సెల్ఫీల కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. వేగవంతమైన వైఫై 6E, బ్లూటూత్ 5.2, టైప్-సి పోర్ట్, హెడ్‌ఫోన్ జాక్ వంటి అన్ని అవసరమైన కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. దీని బరువు దాదాపు 600 గ్రాములు ఉంటుంది.

బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

HP OmniPad 12లో 31Wh బ్యాటరీని అందించారు. హెచ్‌పీ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వల్ల కేవలం 90 నిమిషాల్లోనే సున్నా నుండి 90 శాతం వరకు ఛార్జ్ అయిపోతుంది. దీంతో పాటు ఒక డిటాచబుల్ కీబోర్డ్ కూడా వస్తుంది. తద్వారా టాబ్లెట్‌ను అవసరమైనప్పుడు ఒక చిన్న ల్యాప్‌టాప్ మాదిరిగా కూడా వాడుకోవచ్చు. చదువుకునే విద్యార్థులకు, ఆఫీస్ పనులు చేసుకునేవారికి ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు.

Also Read: తిరుగులేని బ్యాటరీతో Poco M8 Power 5G.. రూ.3,000 డిస్కౌంట్‌తో ఎలా కొనాలంటే?

Related News

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

ఏఐ మోసాలకు చెక్ పెట్టే టెక్నాలజీ..గూగుల్,ఆపిల్ ఫోన్లలోని అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు!

వాట్సాప్‌లో.. ఈ 5 సెట్టింగ్‌లను పొరపాటున కూడా మరవొద్దు!

Big Stories

Advertisement
×