Free bus scheme for men: ఇప్పటి వరకూ ఉచిత బస్సు ప్రయాణం అంటే మహిళలకే పరిమితమని అందరూ భావించారు. కేవలం మహిళలకే వర్తించే ఈ ప్రయోజనం.. ఇప్పుడు అద్భుత మలుపు తీసుకుంది. దేశంలోని ఓ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న తాజా అభిప్రాయంతో.. పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం వస్తుందా? అనే ప్రశ్న ఒక్కసారిగా రాష్ట్రాల వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.
ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణం అమలు చేస్తున్న పక్క రాష్ట్రాల్లోనూ ఇప్పుడు యువత అంతా ఉత్కంఠతో ఎదురు చూస్తోంది. రాజకీయాల్లో హామీల వర్షం కురిసే ఈ సమయంలో.. మరి ఈ ప్రయోజనం మగవాళ్లను వరించబోతోందా? లేదంటే ఇది మరో ఎన్నికల ప్రయోగమా? ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఉన్న చర్చ చూస్తుంటే.. ఇది కేవలం పథకం కాదేమో అనిపిస్తోంది. ఇదో కొత్త ప్రయాణ రాజకీయానికి ప్రారంభం కావచ్చేమో.. ఇంతకు ఆ రాష్ట్రం ఏమిటి? అమలు ఎప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న కర్ణాటక తర్వాత.. అదే దారిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలూ అడుగులేస్తున్నాయి. ఇక తాజాగా కర్ణాటకలో పురుషులకూ ఉచిత ప్రయాణం వస్తుందా అనే ప్రశ్న తలెత్తిన వేళ, ఈ మూడు రాష్ట్రాల మధ్య బస్సు స్కీముల రేస్ మొదలైందనే చెప్పవచ్చు.
కర్ణాటక మొదలు పెట్టింది.. చర్చ మొదలైంది!
2023లో ఏర్పడిన సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారం చేపట్టిన కొద్దిరోజులకే శక్తి అనే పేరు మీద ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్రంలోని మహిళలకు అందజేసింది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు రోజూ ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ఇది కేవలం ఎన్నికల హామీగానే మిగలకుండా, ప్రజల మద్దతు తెచ్చిన ఓ గొప్ప స్కీమ్‌గా నిలిచింది.
ఇప్పుడు అదే కర్ణాటకలో పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం అన్న డిస్కషన్ మొదలైంది. ఇటీవల సీఎం సలహాదారు బసవరాజ రాయరెడ్డి.. ఉద్యోగార్థులకు ప్రయోజనంగా ఉండేందుకు మగవాళ్లకూ ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం ఆలోచిస్తోందని కామెంట్స్ చేశారు.
Also Read: Pani puri prices: పానిపూరీ టేస్ట్ చేస్తారా? ఇక్కడికి వెళ్లండి .. జస్ట్ రూ. 1089 మాత్రమే!
తెలంగాణలో ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్..
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన సీఎం రేవంత్ సర్కార్ మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ అమలు చేస్తోంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలకు, విద్యార్థులకు ఎంతో ఉపశమనం ఇచ్చిన స్కీమ్‌గా నిలుస్తోంది. అంతేకాదు.. ఇక్కడ కేవలం ఈ స్కీమ్ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించడమే కాక, నూతన బస్సులను రంగంలోకి దింపి ఈ స్కీమ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోంది.
ఇప్పుడు కర్ణాటకలో పురుషులకూ ఇలాంటి ప్రయోజనం వస్తుందనగానే.. ఇక్కడా మగవాళ్లకి ఫ్రీ వస్తుందా? అనే చర్చ తెలంగాణలోనూ మొదలవుతోంది. ముఖ్యంగా యువకులు, డెలివరీ బాయ్స్, చిన్న వ్యాపారస్తులు ప్రభుత్వ రవాణా మీద ఆధారపడే వాళ్లు దీనిపై ఆసక్తిగా ఉన్నారు.
ఏపీలో ఆగస్టు 15 నుండి మొదలు కానున్న ఫ్రీ బస్ స్కీమ్
ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, తమ మేనిఫెస్టోలో పేర్కొన్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 2025 ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇందులో APSRTC బస్సుల్లో సిటీ, జోన్ పరంగా కొన్ని నిబంధనలతో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. ఇప్పటికే సాంకేతికంగా టికెటింగ్, QR కోడ్ స్కానింగ్ వంటి విధానాలపై RTC యాజమాన్యం పనులు చేపట్టింది. ఇక రాష్ట్రంలోని మహిళలు ఉచిత ప్రయాణానికి సిద్ధమవుతున్న తరుణంలో.. కర్ణాటక లో పురుషులకు కూడా ప్రయోజనం వస్తే, ఇదే అంశం ఏపీలోనూ చర్చకు రావడం ఖాయం.
మగవాళ్లకూ ఫ్రీ అంటే ఎలా ఉంటుంది?
ఇది మాటలకే పరిమితమా? లేక అమలుకు వస్తుందా? అనే ప్రశ్నల మధ్య.. వాస్తవానికి చాలా మంది యువకులు, విద్యార్థులు రోజూ పని, చదువుల కోసం నగరాలకు రవాణా సాగిస్తుంటారు. వారికి ఉచిత బస్సు ప్రయాణం అంటే పెద్ద భారం తగ్గినట్టే. కార్యనిర్వాహక స్థాయిలో ఇది ఆచరణ సాధ్యమా అనే చర్చలు ప్రభుత్వ యంత్రాంగాల్లో నడుస్తున్నాయి. బస్సు సంస్థల ఆదాయ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారు? స్కీమ్‌కు ఎంత బడ్జెట్ అవసరం? ఇవన్నీ అంచనా వేసిన తర్వాతే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Srisailam dam gates open: శ్రీశైలం గేట్లు ఓపెన్.. ట్రిప్ ప్లాన్ ఛేశారా? ముందే ఇవి తెలుసుకోండి!
పోటీ తప్పదా?
దక్షిణ భారత రాజకీయాల్లో కీలకమైన మూడు రాష్ట్రాలుగా నిలిచిన కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు ఇప్పుడు ప్రజల రవాణా ప్రయోజనాల్లోనూ ఒక రకమైన పోటీకి దిగినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసి, ఇప్పుడు మగవాళ్లకూ అదే సౌకర్యం కల్పించే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి. ఇదే జరిగితే దేశంలో పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక గుర్తింపు పొందనుంది. ఇక తెలంగాణలో ఇప్పటికే మహిళల ఫ్రీ బస్ స్కీమ్ విజయవంతంగా అమలవుతోంది.
ఇప్పుడు కర్ణాటక నూతన ప్రకటనల నేపథ్యంలో అక్కడా పురుషుల ప్రయోజనాలపై చర్చ మొదలవుతోంది. ఆంధ్రప్రదేశ్ చూస్తే, అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయబోతుంది. ఈ మూడు రాష్ట్రాల్లో ప్రజా రవాణా పథకాలపై తీసుకుంటున్న నిర్ణయాలు, దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా మారే అవకాశం లేకపోలేదు. ప్రజల ఆకాంక్షలు, రాజకీయ అవసరాలు కలిసే కొద్దీ.. ఈ రైడింగ్ కాంపిటీషన్ మరింత ఆసక్తికరంగా మారుతుంది.
ఇప్పటికే మహిళల ప్రయోజనాలపై దృష్టి పెడుతున్న ప్రభుత్వం, వచ్చే ఎన్నికల నాడి బట్టిని బట్టి.. పురుషులకు కూడా ప్రయోజనం కల్పించేలా మార్పులు చేయవచ్చునన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. అదే జరిగితే.. ఇది కేవలం ట్రావెల్ స్కీమ్ కాదు.. ఓ రాజకీయ వ్యూహంగా కూడా నిలుస్తుంది. ఇక బస్సులు కదులుతున్నాయో లేదో కాదు.. ప్రయోజనాలు ఎవరికీ వస్తున్నాయో అనే విషయమే ఇప్పుడు చర్చకు కేంద్ర బిందువవుతోంది. మొత్తం మీద పురుషులకు ఫ్రీ బస్ స్కీమ్ అమలైతే.. ఆ ఊహే ఎంత బాగుంటుందో కదా!