Indian Railways: భారతీయ రైల్వేకు 160 ఏండ్లకు పైగా ఘన చరిత్ర ఉన్నది. బ్రిటిషర్ల కాలంలోనే దేశంలో రైల్వేలకు పునాది రాయి పడింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ ఉన్న దేశాల్లో నాలుగో స్థానంలో నిలించింది. 18వ శతాబ్దం నుంచి అనేక మంది ఉపాధి కల్పిస్తోంది రైల్వే సంస్థ. భారతీయ రైల్వే వ్యవస్థ రెవల్యూషన్ గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ దేశంలో తొలి రైలు
18వ శతాబ్దంలో తొలిసారి దేశంలో రైల్వే వ్యవస్థ మొదలయ్యింది. ఆర్థర్ కాటన్ గ్రానైట్, రోడ్డు నిర్మాణ సామాగ్రి రవాణా కోసం రెడ్ హిల్ రైల్వేను ప్రారంభించారు. 1837లో తొలి రైలు మద్రాస్ లోని రెడ్ హిల్స్ నుంచి చింతాద్రిపేట బ్రిడ్జి వరకు నడిచింది. 1847 ఆగష్టు 21న ఈస్ట్ ఇండియా కంపెన సాకారంతో దేశంలో తొలి రైల్వే ట్రాక్ ను నిర్మించడానికి గ్రేట్ పెనిన్సులా రైల్వే చీఫ్ రెసిడెంట్ ఇంజనీర్ జేమ్స్ జాన్ బర్కిలీని నియమించింది. ఆయన ఆధ్వర్యంలో 56 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ ను నిర్మించారు. బొంబాయి నుంచి ఖాందేష్, బేరార్ వరకు విస్తరించారు. దేశంలో తొలి ప్యాసింజర్ రైలు ముంబైలోని బోరిబందర్ స్టేషన్ నుంచి థానే వరకు 34 కిలో మీటర్ల మేర ప్రయాణం చేసింది. 14 బోగీలు ఉన్న ఈ రైల్లో 400 మంది ప్రయాణించారు. వీటిని మూడు ఆవిరి లోకోమోటివ్‌లు ముందుకు తీసుకెళ్లాయి. 1855- 1860 మధ్య ఎనిమిది రైల్వే కంపెనీలు స్థాపించబడ్డాయి. దేశంలో తొలి రైల్వే స్టేషన్, బోరిబందర్ లో 1888లో క్వీన్ విక్టోరియా గౌరవార్థం నిర్మించారు. ముంబైలో ఉన్న ఉన్న ఈ రైల్వే స్టేషన్ ఇప్పుడు ఛత్రపతి శివాజీ రైల్వే టెర్మినల్ గా మారింది.
రైళ్లలో టాయిలెట్ల ఏర్పాటు, విద్యుదీకరణ
ఇండియాలో రైళ్లు ప్రారంభం అయిన సుమారు 50 ఏండ్ల తర్వాత రైళ్లలో టాయిలెట్లు ఏర్పాటు చేశారు. జూలై 2, 1909న, ఓఖిల్ చంద్ర సేన్ అనే భారతీయ రైల్వే ప్రయాణీకుడు పశ్చిమ బెంగాల్‌లోని సాహిబ్‌గంజ్ డివిజనల్ కార్యాలయానికి టాయిలెట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ లేఖ రాశారు. ఆయన లేఖను పరిగణలోకి తీసుకున్న అధికారులు రైళ్లలో టాయిలెట్లు ఏర్పాటు చేశారు. 1925 ఫిబ్రవరి 3న దేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ప్యాసింజర్ రైలు విక్టోరియా టెర్మినల్ నుంచి కుర్లా హార్బర్ మధ్య ప్రారంభమైంది. ఆ తర్వాత విద్యుత్ లైను నాసిక్ లోని ఇగత్పురి జిల్లాకు, ఆ తర్వాత పూణేకు విస్తరించబడింది.
దేశ స్వాతంత్ర్యం అనంతరం 75% ప్రజా రవాణా. 90% సరుకు రవాణాలో రైల్వేల ద్వారానే జరిగింది. భారతీయ రైల్వే 1951లో జాతీయం చేయబడింది. 1986లో భారతీయ రైల్వే వ్యవస్థ తొలి కంప్యూటరైజ్డ్ రిజర్వేషన్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత భారతీయ రైల్వేలో ఎన్నో మార్పులు జరిగాయి.
దశాబ్ద కాలంలో గణనీయమైన మార్పులు
దేశంలో తొలి ఎయిర్ కండిషన్డ్ డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU) ను మోడీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సమయంలో సురేష్ ప్రభు రైల్వే మంత్రిగా ఉన్నారు. జూలై 14, 2017న, ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ స్టేషన్ నుండి మొట్టమొదటి DEMUను ప్రారంభించారు. ఈ రైలు ఢిల్లీలోని సహ్రాయ్ రోహిలా నుంచి హర్యానాలోని ఫరూఖ్ నగర్ వరకు నడిచింది. ఈ రైలులో మొత్తం 16 సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. రైలు అవసరాలను సౌరశక్తితో పొందే ప్రయత్నం చేశారు. ఇక తొలి CNG గ్యాస్ ఆధారిత రైలు జనవరి 2005లో భారత రైల్వేలోని ఉత్తర జోన్‌లోని రేవారీ-రోహ్తక్ విభాగంలో ప్రారంభమైంది
దేశ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చిన వందేభారత్
ఇక భారతీయ రైల్వేలో సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ కీలక మైలు రాయిగా నిలిచింది. తొలి వందేభారత్ రైలు ఢిల్లీ- కాన్పూర్- అలహాబాద్- వారణాసి మధ్య నడిచింది. ఫిబ్రవరి 15, 2019లో ప్రధాని మోడీ ఈ రైలును ప్రారంబించారు. గంటకు 130 కిలో మీటర్ల వేగంతో ఈ రైలు నడుస్తోంది. త్వరలోనే దేశంలో అత్యాధునికి వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రానుంది. అటు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైలు పట్టాలెక్కబోతోంది.
Read Also: రైలును ధ్వంసం చేస్తే ఇండియాలో ఏ శిక్ష విధిస్తారు? ఆ దేశంలో ఏకంగా టాయిలెట్లు కడిగిస్తారు!