Harshvardhan Rane: నెపోటిజం అనేది సినీ ఇండస్ట్రీలో ఉంటుందన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. ముఖ్యంగా బాలీవుడ్‌లో నెపోటిజం అనే పదం చుట్టూ చాలా వివాదాలు పుట్టుకొచ్చాయి. ఇప్పటికీ ఆ వివాదాలకు ఫుల్ స్టాప్ పడలేదు. అయినా ఈ నెపోటిజం, స్టార్ కిడ్స్ మధ్య బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చే యాక్టర్లు అసలు నిలబడరని కూడా ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ అలాంటి సమయంలోనే కొందరు యాక్టర్లు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి, మంచి కథలను ఎంచుకొని హీరోలుగా మంచి ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. అందులో ‘సనమ్ తేరీ కసమ్’ ఫేమ్ హర్షవర్ధన్ రాణే కూడా ఒకడు. అలాంటి ఈ హీరో తాజాగా స్టార్ కిడ్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
నెపోటిజంపై కామెంట్స్
హర్షవర్ధన్ రాణే, మావ్రా హోకేన్ హీరోహీరోయిన్‌గా నటించిన ‘సనమ్ తేరీ కసమ్’ రీ రిలీజ్ గురించే ప్రస్తుతం ప్రేక్షకుల్లో హాట్ టాపిక్ నడుస్తోంది. తొమ్మిదేళ్ల క్రితం ఈ సినిమా థియేటర్లలో విడుదలయినప్పుడు చాలామంది దీనిని పట్టించుకోలేదు. అలాంటిది ఓటీటీ వల్ల, సోషల్ మీడియా వల్ల ఈ మూవీకి విపరీతమైన పాపులారిటీ పెరిగిపోయింది. అలా రీ రిలీజ్ అయిన తర్వాత రికార్డ్ స్థాయి బుకింగ్స్, కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది ‘సనమ్ తేరీ కసమ్’ (Sanam Teri Kasam). దీంతో అవకాశాలు లేక వెండితెరపై దూరమయిన హర్షవర్ధన్ మళ్లీ లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ నెపోటిజంపై తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.
లెక్కల ప్రకారం
‘‘నా చుట్టూ ఉన్నవాళ్లు చెప్పేదాని కంటే నా ఆలోచనలనే బలంగా నమ్మే మనిషిని నేను. స్టార్ కిడ్స్‌కే ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయని నాతో అందరూ అంటుంటారు. కానీ సరిగ్గా చూస్తే 10 మందిలో ఎనిమిది మంది ఇప్పటికే అవకాశాలు లేక వెండితెరకు దూరమయిన వాళ్లే ఉంటారు. అలా లెక్కలు వేసి చూస్తే.. బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన వాళ్లకే మంచిగా పని దొరుకుతుంది. అలాంటి వారి సక్సెస్‌ను చూడకుండా ఎలా ఉంటాం? అందుకే నేను నెపోటిజం గురించి ఎలాంటి ఫిర్యాదు చేయను. నేను దీని గురించి పాజిటివ్‌గా ఏమీ మాట్లాడడం లేదు. కానీ ఇదే నిజం. ఎవరికైనా దేని గురించి అయినా అనుమానం కలిగినప్పుడు ఇలాగే లెక్కలు వేసి చూడాలి’’ అని వివరించాడు హర్షవర్ధన్.
Also Read: చాలామంది హీరోయిన్స్ నన్ను రిజెక్ట్ చేశారు.. ‘లవ్ టుడే’ హీరో ఆవేదన
ఎదురుచూస్తూనే ఉంటాను
స్టార్ కిడ్స్‌కు పని దొరకడం లేదని, చాలామంది బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చినవాళ్లే టాప్ స్థాయికి చేరుకున్నారని చెప్పుకొచ్చాడు హర్షవర్ధన్ రాణే (Harshvardhan Rane). అయితే గత కొన్నాళ్లుగా తను వెండితెరపై కనిపించకపోవడానికి కారణం కూడా బయటపెట్టాడు. త్వరగా సినిమాలు చేయాలి అని అనుకకోకుండా మంచి కంటెంట్‌తో మాత్రమే ప్రేక్షకుల ముందుకు రావాలని ఎదురుచూస్తున్నట్టుగా తెలిపాడు. దానికోసం ఎంతకాలం అయినా ఎదురుచూడడానికి సిద్ధమన్నాడు. ఇక ‘సనమ్ తేరీ కసమ్’ థియేటర్లలో ఉండగానే దాని సీక్వెల్‌ను అనౌన్స్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే లోపు ఈ సీక్వెల్‌ను సిద్ధం చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని మాటిచ్చారు.