Champions Trophy: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ని టీమ్ ఇండియా గెలుచుకుంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు 9 నెలలలో రెండవ ట్రోఫీని అందుకుంది. 2024 టీ20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచిన తర్వాత.. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా 12 సంవత్సరాల తర్వాత మళ్లీ చాంపియన్ ట్రోఫీని ముద్దాడింది. మార్చ్ 9 ఆదివారం రోజున దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్ భారత్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో.. న్యూజిలాండ్ జట్టుని నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది భారత్.
Also Read: IPL 2025: IPL-2025 నుంచి వైదొలిగిన ఇంగ్లండ్ డేంజర్ ప్లేయర్ !
దీంతో 25 ఏళ్ల క్రితం ఇదే {Champions Trophy} టోర్నమెంట్ ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మొత్తంగా 60 కోట్ల ప్రైస్ మనీని కేటాయించారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ తో పోలిస్తే ఇది 53% అధికం. ఇక ఐసీసీ ప్రకటించిన వివరాల ప్రకారం విజయం సాధించిన జట్టుకు ట్రోఫీతో పాటు దాదాపుగా రూ. 19.48 కోట్ల నగదు బహుమతి దక్కుతుంది. అలాగే రన్నరప్ గా నిలిచిన జట్టుకు సుమారు 9.72 కోట్లు అందజేస్తారు.
ఇక ఆదివారం రోజు ఫైనల్ మ్యాచ్ గెలిచిన అనంతరం భారత జట్టు ఆటగాళ్లంతా తెల్ల కోట్లు వేసుకున్నది గమనించే ఉంటారు. 2013లో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని, మిగతా ఆటగాళ్లంతా ఇలానే తెల్ల కోట్లు ధరించారు. అయితే ఐసీసీ నిర్వహించే వన్డే, టీ-20 ప్రపంచ కప్ లలో ఇలాంటి సాంప్రదాయం మనకు ఎక్కడా కనిపించదు. కానీ ఛాంపియన్ ట్రోఫీలో మాత్రమే ఈ ప్రత్యేకత ఉంటుంది.
ఎందుకంటే ఈ టోర్నీలో పాల్గొనే జట్లు ట్రోఫీ కోసమే కాకుండా, తెల్ల కోట్ కోసం కూడా పోటీ పడతాయని ఐసిసి తెలిపింది. ఈ వైట్ సూట్ ఆటగాళ్ల గొప్పతనం, వారికి దృఢ సంకల్పాన్ని సంగ్రహించే “గౌరవ బ్యాడ్జ్” లాంటిదని అభివర్ణించింది. ఈ తెల్ల కోట్ ఛాంపియన్లు అలంకరించే గౌరవ చిహ్నం. ఈ ట్రోఫీ కోసం వారు చేసే కృషి, తరతరాలకు స్ఫూర్తినిచ్చే అంశాలను ప్రతిబింబిస్తాయని ఐసీసీ పేర్కొంది.
Also Read: IND VS NZ Final: వరుసగా రెండు క్యాచ్ లు మిస్… గ్రౌండ్ నుంచి వెళ్లిపోయిన షమీ..!
ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత జరిగే వేడుకలలో ఉత్సాహంగా ధరించే ఈ వైట్ సూట్.. ఈ టోర్నీ గొప్ప చరిత్రకు ఒక ప్రత్యేకతను జోడిస్తాయని ఐసీసీ పేర్కొంది. మిగిలిన జట్లు కూడా మరోసారి పోటీ పడేల ఇది ప్రోత్సహిస్తుందని వెల్లడించింది. ఇక ఆదివారం రోజు జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. అనంతరం 252 పరుగుల లక్ష్యంతో బడిలోకి దిగిన భారత జట్టు 49 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసి విజయం సాధించింది. ఈ విజయంతో భారత క్రీడాభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.