Goods Train Derails In Peddapalli: పెద్దపల్లి జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ప్రమాదంలో ఏకంగా మూడు ట్రాక్ లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పలు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించారు. ప్రస్తుతం రైల్వే ట్రాక్స్ పునరుద్దరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మంగళవారం రాత్రి రాఘవాపురం-రామగుండం మధ్య స్టీల్ కాయిల్స్, ఇనుప రాడ్లను మోసుకెళ్లే గూడ్స్ కు సంబంధించిన 12 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. కర్ణాటకలోని బళ్లారి నుంచి ఘజియాబాద్ కు ఈ రైలు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాక్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి.
తొలుత ఒక ట్రాక్ పునరుద్దరణ.. తర్వాత మరో రెండు కూడా..
గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ట్రిపుల్-లైన్ విభాగంలో మూడు ట్రాక్‌లు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో రైళ్లు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాక్ ల నిర్మాణం కోసం పెద్ద క్రేన్లను తీసుకొచ్చారు. ఇందు కోసం పక్కనే టెంపరరీ యాక్సెస్ రోడ్డును ఏర్పాటు చేశారు. పట్టాలు తప్పిన రైలును అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు ముందుగా ఓ లైన్ ను నిర్మించారు. మిగిలిన రెండు రైల్వే లైన్లను ఆ తర్వాత నిర్మించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తో పాటు ఇతర సీనియర్ అధికారులు ట్రాక్ పునరుద్దరణ పనులను దగ్గరుంచి పర్యవేక్షిస్తున్నారు.
39 రైళ్లు రద్దు, 61 రైళ్లు దారి మళ్లింపు
గూడ్స్ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో 39 ప్యాసింజర్ రైళ్లు రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. మరో ఏడు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ఇంకో 61 రైళ్లను దారి మళ్లించారు. 7 రైళ్లను రీషెడ్యూల్ చేశారు. ఈ ఎఫెక్ట్ రేపు( నవంబర్ 14) కూడా ఉంటుందని అధికారులు వెల్లడించారు. నాగర్ సోల్-కాచిగూడ మధ్య ప్రయాణించే 17662 రైలును రద్దు చేశారు. సిర్పూర్ కాగజ్ నగర్- సికింద్రాబాద్ నడుమ నడిచే 17234 రైలును పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు. అటు ఎక్కువ దూరం ప్రయాణించే రైళ్లను క్యాన్సిల్ చేయలేదని, వాటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. కేవలం సౌత్ సెంట్రల్ జోన్ లో నడుస్తున్న రైళ్లను మాత్రమే క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించారు.
రద్దు చేసిన రైళ్ల వివరాలు
పెద్దపల్లి గూడ్స్ రైలు పట్టాలు తప్పిన నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేశారు. ఇంతకీ ఆ రైళ్లు ఏవో ఇప్పుడు చూద్దాం.. నర్సాపూర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-నాగ్ పూర్, హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్, సికింద్రాబాద్-సిర్పూర్ టౌన్, సిర్పూర్ టౌన్-కరీంనగర్, కరీంనగర్-బోధన్, సిర్పూర్ టౌన్- భద్రాచలం రోడ్, భద్రాచలం రోడ్- బల్లార్షా- కాజీపేట-కాజీపేట, కాచిగూడ- నాగర్ సోల్, కాచిగూడ- కరీంనగర్, సికింద్రాబాద్- రామేశ్వరం, సికింద్రాబాద్- తిరుపతి, ఆదిలాబాద్- పర్లి, అకోలా- పూర్ణ, ఆదిలాబాద్- నాందేడ్, నిజామాబాద్- కాచిగూడ, గుంతకల్లు-బోధన్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.
Bulletin No. 10 & 11 – SCR PR No. 618 Dt. 13.11.2024 on “Cancellation/Partial Cancellation/Rescheduling of Trains Due to Goods Train Derailment” pic.twitter.com/T3vt7R36BJ
— South Central Railway (@SCRailwayIndia) November 13, 2024
Read Also: నవంబరు 15 నుంచి 18 వరకు 9 రైళ్లు రద్దు, వీటిలో మీ రైల్ ఉందేమో చూడండి!