Actress Meena:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న మీనా (Meena ) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. చిరంజీవి (Chiranjeevi ), బాలకృష్ణ (Balakrishna) మొదలుకొని మోహన్ బాబు (Mohanbabu) వంటి సీనియర్ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఇటు సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా 90 ల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. సహజ నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. కోట్లాదిమంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది. అంతా బాగానే ఉన్న సమయంలో అనూహ్యంగా ఆమె భర్త మరణం ఆమె జీవితంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇక ఆ బాధ నుంచి బయటపడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.
రెండో పెళ్లి వార్తలపై మీనా ఫైర్..
ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా మీనా రెండో పెళ్లిపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి. అయితే తాజాగా ఈ రూమర్స్ పై మీనా మాట్లాడుతూ ఇలాంటి వార్తలు రాసే రైటర్స్ పై మండిపడింది. ముఖ్యంగా మీనా తన రెండో పెళ్లిపై వస్తున్న రూమర్స్ పై స్పందిస్తూ.. “సోషల్ మీడియాలో ఏదో ఒకటి రాయాలి కాబట్టి, ఏదో ఒక విషయాన్ని హైలెట్ చేయాలి కాబట్టి కొంతమంది ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తున్నారు. ముఖ్యంగా కోలీవుడ్ హీరో ధనుష్ (Dhanush ) భార్య నుంచి విడాకులు తీసుకొని వేరుపడ్డారు. ఇక ఆయనను ట్యాగ్ చేస్తూ పిచ్చిపిచ్చి వార్తలు రాస్తున్నారు. ధనుష్ ను వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు రాయడం ఎంతవరకు కరెక్ట్.. అలాగే ఇంకొంతమంది సింగిల్ గా ఉన్న హీరోలను కూడా ట్యాగ్ చేస్తూ వారిని వివాహం చేసుకోబోతున్నాను అంటూ వార్తలు రాస్తున్నారు. ముఖ్యంగా ఎలాంటి వార్తలు లేనప్పుడు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ రైటర్స్ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది మీనా.
నా జీవితం ఒక తెరిచిన పుస్తకం..
అలాగే ఆమె మాట్లాడుతూ..” నేను చిన్నప్పటినుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. అందుకే ప్రతి ఒక్కరితో కూడా చాలా సన్నిహితంగా ఉంటాను. ఇలాంటి సమయంలో లేనిపోని విషయాలు ఎందుకు రాస్తున్నారు.? రాసే ముందు ఒక్క మాటైనా నన్ను అడగవచ్చు కదా.. నేనేమైనా నిర్ణయం తీసుకుంటే ముందే మీడియాకు చెబుతాను కదా. ఎందుకు నాపై ఇలాంటి చెత్త రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం. నా జీవితంలో సినిమాలు, నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇదే.. మీకు తెలియని నా రహస్యాలు ఇంకేమీ లేవు. దయచేసి ఇప్పటికైనా నాపై ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయడం ఆపండి” అంటూ మీనా కామెంట్ చేసింది.
రైటర్స్ ఇప్పటికైనా ఆగేరా..
ఏది ఏమైనా ఎవరి జీవితంలో ఎప్పుడు ఏ సంఘటన జరుగుతుందో చెప్పడం కష్టం. అలాంటిది తన జీవితంలో ఊహించని ఘటన జరగడంతో ఇప్పటికీ ఆ బాధ నుంచి బయటపడలేకపోతోంది మీనా.. ఇలాంటి సమయంలో ఈమెపై ఇలాంటి వార్తలు షికార్లు చేయడంతో మీనా ఎంతో బాధపడుతూ ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి ఇకనైనా పరిస్థితిని అర్థం చేసుకొని ఇలాంటి వార్తలు రాయకుండా ఉండాలి అని అభిమానులు సైతం కోరుతున్నారు.