BigTV English

Bigg Boss 8 Telugu: వచ్చిన గెస్టులపై ప్రేరణ ప్రతాపం.. ఓడిపోతే మరీ ఇలా చేయాలా?

Bigg Boss 8 Telugu: వచ్చిన గెస్టులపై ప్రేరణ ప్రతాపం.. ఓడిపోతే మరీ ఇలా చేయాలా?

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ 8లో టికెట్ టు ఫినాలే కోసం పోటీ పడే కంటెండర్లను సెలక్ట్ చేయడం కోసం హౌస్‌లోకి మాజీ కంటెండర్లు ఎంటర్ అవుతున్నారు. అలా రోజుకు ఇద్దరు మాజీ కంటెండర్లు హౌస్‌లో అడుగుపెట్టి నలుగు కంటెస్టెంట్స్ మధ్య టికెట్ టు ఫినాలే కంటెండర్‌షిప్ పోటీని నిర్వహిస్తున్నారు. అయితే అలా టాస్కులు గెలిచిన వారు కంటెండర్లు అవ్వగా.. ఓడిపోయిన వారికి బ్లాక్ బ్యాడ్జ్ లభిస్తుంది. అంటే బ్లాక్ బ్యాడ్జ్ లభించిన వారు పూర్తిగా టికెట్ టు ఫినాలే రేసు నుండి తప్పుకోవాల్సిందే. తాజాగా వితికా షేరు, పునర్నవి.. కంటెస్టెంట్స్‌తో టికెట్ టు ఫినాలే కంటెండర్‌షిప్ ఆటలు ఆడించడానికి హౌస్‌లోకి ఎంటర్ అవ్వగా.. వాళ్లు వెళ్లేటప్పుడు మాత్రం అంత సంతోషంగా వెళ్లలేదు.


తేజకు అన్యాయం

వితికా షేర్, పునర్నవి హౌస్‌లోకి వచ్చి నిఖిల్, గౌతమ్‌లను టాస్కుల కోసం సెలక్ట్ చేశారు. ఇప్పటివరకు నిఖిల్‌కు అసలు ఈ టాస్కుల్లో పాల్గొనడానికే అవకాశం రాలేదంటూ వితికా తనకు సపోర్ట్ చేసింది. ఇక నిఖిల్, గౌతమ్ కలిసి తమతో పోటీ పడే మరో ఇద్దరు కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేసుకోవాలి. గౌతమ్ అయితే ప్రేరణతో పోటీపడాలని ముందే ఫిక్స్ అయ్యాడు. నిఖిల్ మాత్రం పృథ్వి, టేస్టీ తేజలో ఎవరైనా ఓకే అన్నాడు. చివరికి పృథ్వినే సెలక్ట్ చేశాడు. అయితే టాస్కుల్లో తనను సెలక్ట్ చేయకపోవడంపై తేజ ఫీల్ అయ్యాడు. చివరికి చేసేది ఏం లేక ఆడేవారికి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అలా ఈ నలుగురు కంటెస్టెంట్స్ మధ్య మొదటి టాస్క్ మొదలయ్యింది.


Also Read: టాప్-5 కంటెస్టెంట్స్ ఎవరు.. ఉత్కంఠ రేపుతున్న ఓటింగ్..!

నిఖిల్ గెలిచాడు

గౌతమ్, నిఖిల్, ప్రేరణ, పృథ్వి.. ఒక స్లైడ్‌పైకి తాడు సపోర్ట్‌తో ఎక్కి అక్కడ ఉన్న డిస్కులను తీసుకొచ్చి బాస్కెట్‌లో వేయాలి. ఈ టాస్క్‌ను పృథ్వి సక్సెస్‌ఫుల్‌గా పూర్తిచేశాడు. పృథ్వి 10 డిస్క్‌లు తన బాస్కెట్‌లో వేయగా నిఖిల్ 9 డిస్క్‌లు, ప్రేరణ, గౌతమ్ 5 డిస్క్‌లు వేశారు. కానీ పృథ్వి రూల్స్ పాటించలేదంటూ సంచాలకులు అయిన వితికా, పునర్నవితోనే గొడవ మొదలుపెట్టింది ప్రేరణ. దీంతో వారిద్దరూ కూడా పృథ్వి రూల్స్ బ్రేక్ చేశాడంటూ నిఖిల్‌ను విన్నర్‌గా ప్రకటించారు. ఆ విషయం పృథ్వికి నచ్చలేదు. దీంతో గెస్ట్‌లుగా వచ్చిన వితికా, పునర్నవితో దురుసుగా ప్రవర్తించాడు. ఇక రెండో టాస్క్ మొదట్లోనే ఊహించని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్.

ప్రేరణ శాడిజం

నలుగురు కంటెస్టెంట్స్‌లో ఎవరో ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి టికెట్ టు ఫినాలే కంటెండర్‌షిప్ నుండి తొలగించమని వితికా, పునర్నవిలకు ఆదేశించారు బిగ్ బాస్. దీంతో ప్రేరణ తమతో దురుసుగా ప్రవర్తించిందని తమకు బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారు. ఇది ప్రేరణకు నచ్చలేదు. కన్నీళ్లు కూడా పెట్టుకుంది. మొత్తానికి నిఖిల్, పృథ్వి, గౌతమ్ మధ్య పోటీ మొదలయ్యింది. నిఖిల్ టాస్కులో విజయం సాధించాడు. దీంతో పృథ్వి ఆటను మధ్యలోనే ఆపేసి పక్కకు వెళ్లిపోయాడు. నిఖిల్‌ను టికెట్ టు ఫినాలే కంటెండర్లుగా ప్రకటించారు వితికా, పునర్నవి. చివరికి వారు హౌస్ వదిలి వెళ్లిపోతున్న సమయంలో కూడా ప్రేరణ వారితో దురుసుగా ప్రవర్తించింది. ఇది చూసిన ప్రేక్షకులు ప్రేరణ ప్రవర్తన కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×