Baba Vanga Prediction 2026: బల్గేరియాకు చెందిన ప్రముఖ కాలజ్ఞాని బాబా వంగా భవిష్యవాణికి సంబంధించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. 2025కి సంబంధించి ఆమె పలు ఆందోళనకరమైన విషయాలు వెల్లడించగా, 2026కు సంబంధించి తను చెప్పిన విషయాలు మరింత భయాన్ని కలిగిస్తున్నాయి. 2025లో ప్రకృతి విపత్తుల కారణంగా భారీ ప్రాణనష్టం జరుగుతుందని హెచ్చరించారు. అంతర్జాతీయంగా అస్థిరత కొనసాగుతుందన్నారు. ఈ అంచనాలు నిజం చేస్తూ భారీ భూకంపాలు, అగ్ని పర్వతాల పేలుడు, సునామీలు సంభవించాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరిస్తున్న వ్యవహార తీరు అంతర్జాతీయ అస్థిరతకు కారణం అయ్యింది. టారిఫ్ ల పేరుతో ఆయన బెదిరింపులు ప్రపంచ దేశాలకు ఆగ్రహం కలిగిస్తోంది. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం, ఇజ్రాయెల్- హమాస్ దాడులు, భారత్-పాక్ ఉద్రికత్తలు కూడా ఆందోళనకు గురి చేశాయి.
2026 గురించి షాకింగ్ అంచనాలు
తాజాగా బాబా వంగా 2026 గురించి చెప్పిన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంచనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ ప్రపంచ వ్యాప్తంగా భారీ విపత్తులు: 2026లో భయంకరమైన భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు తలెత్తుతాయని బాబా వంగా అంచనా వేశారు. ఇవి మానవులకు, భూమికి తీవ్రమైన హాని కలిగిస్తాయని అభిప్రాయపడ్డారు. దాదాపు 7 నుండి 8 శాతం భూభాగం ఈ విపత్తులకు గురవుతుందని వెల్లడించారు.
⦿ మూడవ ప్రపంచ యుద్ధం: బాబా వంగా అంచనాల ప్రకారం, 2026లో ప్రపంచ స్థాయి యుద్ధ వాతావరణం చెలరేగే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్-పాకిస్తాన్, ఇరాన్-ఇజ్రాయెల్, థాయిలాండ్-కంబోడియా వంటి దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. చైనా తైవాన్‌పై దాడి చేయడానికీ అవకాశం ఉంది. రష్యా, అమెరికా మధ్య ప్రత్యక్ష ఘర్షణకు కూడా తలెత్తే అవకాశం ఉంది.
⦿ AIతో ముప్పు: 2026లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గురించి కూడా షాకింగ్ విషయాలు వెల్డించారు. 2025లో ఏఐ ఓ రేంజ్ లో డెవలప్ అవుతోంది. దీని డామినేషన్ కారణంగా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. వేలాది మంది ఉద్యోగాలను కోల్పోయే అవకాశం ఉంది. మానవ వనరులకు ఇది ప్రత్యామ్నాయంగా మారనుంది. బాబా వంగా అంచనా ప్రకారం 2026లో ఏఐ ప్రపంచం మీద ఆధిపత్యం కొనసాగించే అవకాశం ఉంటుంది.
⦿ ఏలియన్స్ రాక: అటు ఏలియన్స్ గురించి కూడా బాబా వంగా అంచనా వేసింది. గ్రహాంతరవాసులు ఉన్నట్లు 2026లో సాక్ష్యాధారాలు లభిస్తాయన్నారు. అంతరిక్షంలో జీవ రూపాలను కనుగొనడం లాంటి ఘటనలు ఏర్పడుతాయన్నారు. 2026 నవంబర్‌లో ఒక భారీ గ్రహాంతర నౌక భూమి వైపు వస్తోందని, మానవులు మొదటిసారిగా గ్రహాంతరవాసులతో సంబంధం కలిగి ఉండే అవకాశం ఉందని ఆమె వెల్లడించారు. ఇప్పటికే 3ఐ/ఎటిఎల్ఎఎస్ అనే ఒక ఖగోళ వస్తువు భూ వాతావరణాన్ని పోలి ఉంది. ఇది తోకచుక్క అని భావించినప్పటికీ.. హార్వర్డ్ ప్రొఫెసర్ లోబ్ భూమికి ప్రత్యామ్నాయ గ్రహంగా భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Also: అమ్మాయికి అచ్చుగుద్దినట్లు తండ్రి పోలికలు.. అదెలా సాధ్యం?