E-Paper
Advertisement

నీటి తెర వెనుక దాగిన అద్భుతం.. హైదరాబాద్ సమీపంలో క్రేజీ వీకెండ్ డెస్టినేషన్!

నీటి తెర వెనుక దాగిన అద్భుతం..  హైదరాబాద్ సమీపంలో క్రేజీ వీకెండ్ డెస్టినేషన్!
Advertisement

Hyderabad to Ermayi Waterfalls:  హైదరాబాద్ ట్రాఫిక్, కాలుష్యానికి కాస్త దూరంగా ప్రకృతిలో ప్రశాంతంగా గడపాలనుకుంటున్నారా? అన్ని టెన్షన్స్ ను మర్చిపోయి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే, మీరు కర్ణాటకలోని ఎర్మయి జలపాతం దగ్గరికి వెళ్లాల్సిందే. పశ్చిమ కనుమల్లో పచ్చని అడవుల మధ్య దాగి ఉన్న ఈ జలపాతం ప్రకృతి అందాలతో పాటు అడ్వెంచర్ ఫీల్ ను కూడా కలిగిస్తుంది. హైదరాబాద్ నుంచి సుమారు 650 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని రెండు రోజుల ట్రిప్ గా ప్లాన్ చేసుకోవచ్చు.

ఇంతకీ ఎర్మయి జలపాతం ఎక్కడ ఉంది?

ఎర్మయి జలపాతం దక్షిణ కన్నడ జిల్లాలోని ముండజే గ్రామానికి సమీపంలో ఉంది. ధర్మస్థలానికి దగ్గరగా ఉండటంతో అక్కడికి వెళ్లే పర్యాటకులు ఈ జలపాతాన్ని కూడా తమ ట్రిప్ లో యాడ్ చేసుకోవచ్చు. చుట్టూ దట్టమైన అడవులు, కొండలు, పచ్చని వాతావరణం ఉండటంతో కాంక్రీట్ జంగల్ ను పూర్తి మర్చిపోయి ఎంజాయ్ చెయ్యొచ్చు.

ఎర్మయి జలపాతం ప్రత్యేకత ఏంటి?

Advertisement

సాధారణంగా చాలా జలపాతాలు ఒకే ప్రాంతంలో ఎత్తు నుంచి కిందకు పడుతూ కనిపిస్తాయి. కానీ, ఎర్మయి జలపాతం రాతి మెట్లపై నుంచి అంచెలంచెలుగా ప్రవహిస్తూ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. అయితే, ఈ జలపాతానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చేది నీటి తెర వెనుకకు వెళ్లే అవకాశం ఉండటం. ప్రధాన జలపాతం వెనుక సహజంగా ఏర్పడిన రాతి అంచు ఉంటుంది. అక్కడికి చేరుకున్నప్పుడు జలపాతాన్ని వెనుక నుంచి చూసే అవకాశం లభిస్తుంది. నీటి ప్రవాహం, చుట్టూ ఉన్న పచ్చదనం కలిసి అద్భుతంగా కనిపిస్తుంది. ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి కూడా ఈ ప్రదేశం బాగుంటుంది.

చిన్న ట్రెక్.. మంచి ఎక్స్ పీరియెన్స్

ఎర్మయి జలపాతాన్ని చేరుకోవడానికి సుమారు 1.5 కిలోమీటర్ల దూరం అడవిలో నడవాలి. సాధారణంగా ఈ ట్రెక్‌కు 30 నిమిషాల వరకు సమయం పడుతుందిజ. దారిలో చిన్న నీటి ప్రవాహాలు, రాళ్లు, చెట్లు,  పచ్చదనం కనిపిస్తాయి. అయితే, వర్షాకాలంలో జాగ్రత్త చాలా అవసరం. రాళ్లపై నాచు ఏర్పడటం వల్ల అవి జారే అవకాశం ఉంటుంది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో జలపాతం పైభాగాలకు వెళ్లడం ప్రమాదకరం. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసినప్పుడు స్థానికుల సూచనలు పాటించడం మంచిది.

హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?

Advertisement

రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి ధర్మస్థల వైపు వెళ్లి, అక్కడి నుంచి ముండజే గ్రామానికి చేరుకోవచ్చు. మొత్తం ప్రయాణానికి సుమారు 11 నుంచి 12 గంటలు పట్టే అవకాశం ఉంది. సొంత వాహనంతో వెళ్లేవారికి ఇది మంచి వీకెండ్ రోడ్ ట్రిప్‌గా ఉంటుంది. రైలు, విమానంలో వెళ్లాలనుకునేవారు ముందుగా మంగళూరుకు చేరుకుని, అక్కడి నుంచి టాక్సీ లేదంటే ఇతర రవాణా మార్గాల ద్వారా ఎర్మయి వైపు వెళ్లవచ్చు. ధర్మస్థల, ఉజిరే ప్రాంతాల్లో హోటళ్లు, లాడ్జీలు, హోమ్‌స్టేలు అందుబాటులో ఉంటాయి. జూలై నుంచి నవంబర్ మధ్య ఎర్మయి పరిసరాలు పచ్చదనంతో కళకళలాడుతాయి. ఆ టైమ్ లో వెళ్లడం మంచిది.

Read Also: కేరళ To ఉత్తరాఖండ్.. ఆగస్టులో చూడాల్సిన 10 అద్భుతమైన టూరిస్ట్ ప్లేసెస్ ఇవే!

Tags

Related News

ప్రపంచంలోనే 5 బెస్ట్ రైలు ప్రయాణాలు.. జీవితంలో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!

24 గంటల ప్రయాణం ఇక 16 గంటలే.. కొత్త వందేభారత్ స్లీపర్ వచ్చేస్తోంది!

రష్యా నుంచి భారత్‌కు డైరెక్ట్ ట్రైన్.. ప్రయాణికుల కోసం కాదా?

రైళ్లలో ఏఐ సర్వేలెన్స్.. ఇక వారికి చుక్కలే!

ఇంత కాలం విమానాలు.. ఇప్పుడు రైళ్లు.. ఎతిహాద్ ప్లాన్ అదిరింది భయ్యా!

ఎయిర్ ఇండియా గుడ్ న్యూస్.. ఆ ప్లైట్స్ కూడా వచ్చేస్తున్నాయ్!

కేరళ To ఉత్తరాఖండ్.. ఆగస్టులో చూడాల్సిన 10 అద్భుతమైన టూరిస్ట్ ప్లేసెస్ ఇవే!

Big Stories

Advertisement
×