E-Paper
Advertisement

దేశంలో అత్యంత అందమైన రైల్వే స్టేషన్.. అక్కడ అడుగు పెడితే అస్సలు రావాలి అనిపించదు!

దేశంలో అత్యంత అందమైన రైల్వే స్టేషన్.. అక్కడ అడుగు పెడితే అస్సలు రావాలి అనిపించదు!
Advertisement

India’s Most Beautiful Railway Station: రైల్వే స్టేషన్ అంటే సాధారణంగా రైళ్ల రాకపోకలు, ప్రయాణికుల హడావుడి, టికెట్ కౌంటర్లు, ప్లాట్‌ఫామ్‌పై పరుగులు గుర్తొస్తాయి. కానీ, దేశంలో కొన్ని రైల్వే స్టేషన్లు మాత్రం ఈ సాధారణ ఊహకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. చుట్టూ కనిపించే ప్రకృతి అందాలు, కొండలు, అడవులు, జలపాతాలు ప్రయాణాన్నే ఒక మధురమైన అనుభూతిగా మార్చేస్తాయి. అలాంటి అందమైన ప్రదేశాల్లో ఒక రైల్వే స్టేషన్ గురించి తెలుసుకుందాం. అదే దూద్ సాగర్ రైల్వే స్టేషన్.

ప్రకృతి ఒడిలో దూద్‌సాగర్

గోవా–కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉన్న దూద్‌సాగర్ రైల్వే స్టేషన్ చుట్టూ పశ్చిమ కనుమల సహజ సౌందర్యం కనిపిస్తుంది. దట్టమైన అడవులు, పచ్చని కొండలు, లోయలు, వర్షాకాలంలో ఉరకలెత్తే జలపాతాలు ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడ రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు కిటికీలోంచి బయటకు చూస్తే నగరాల్లో కనిపించే దృశ్యాలకు పూర్తిగా భిన్నమైన ప్రపంచం కనిపిస్తుంది. ఎటుచూసినా పచ్చదనంతో మనసుకు ప్రశాంతతను అందిస్తుంది. అందుకే ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం చేయాలనుకునే వారికి ఈ మార్గం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది.

దూద్‌సాగర్ జలపాతం ప్రత్యేక ఆకర్షణ

Advertisement

ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకొచ్చింది ప్రసిద్ధ దూద్‌సాగర్ జలపాతం. ఎత్తైన కొండల మధ్య నుంచి తెల్లటి నీటి ధారలా కిందకు జారిపడే ఈ జలపాతం చూపరులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో నీటి ప్రవాహం పెరిగినప్పుడు దీని అందం మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది. జలపాతం, కొండలు, అడవి మధ్య నుంచి సాగే రైల్వే మార్గం కారణంగా ఈ ప్రయాణం చాలామందికి గుర్తుండిపోయే అనుభూతిగా మారుతుంది. రైలు కదులుతున్న కొద్దీ మారే ప్రకృతి దృశ్యాలు ప్రయాణికుల దృష్టిని కిటికీ వైపు మళ్లిస్తాయి.

ఘుమ్ స్టేషన్ కూడా ప్రత్యేకమే!

ప్రకృతి అందాలతో ప్రసిద్ధి చెందిన మరో రైల్వే స్టేషన్ పశ్చిమ బెంగాల్‌లోని ఘుమ్. హిమాలయ పర్వత ప్రాంతానికి సమీపంలో ఉన్న ఈ స్టేషన్ చుట్టూ కొండలు, మేఘాలు, చల్లని వాతావరణం కనిపిస్తాయి. ఎత్తైన ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడి వాతావరణం, పరిసరాలు సాధారణ రైల్వే స్టేషన్లకు భిన్నంగా అనిపిస్తాయి. ఘుమ్ ప్రాంతంలో ప్రయాణిస్తున్నప్పుడు కొండల మధ్య నుంచి రైలు నెమ్మదిగా ముందుకు సాగడం ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది. ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం ఎందుకు అంతగా నచ్చుతుందో అక్కడికి వెళ్లిన తర్వాతే అర్థమవుతుంది.

రైల్వే ప్రయాణానికి కొత్త అనుభూతి

Advertisement

సాధారణంగా ఒక ప్రాంతానికి వెళ్లడానికి రైలును కేవలం రవాణా సాధనంగా చూస్తాం. కానీ, దూద్‌సాగర్ వంటి ప్రాంతాల్లో ప్రయాణమే ఒక అద్భుతమైన ఎక్స్ పీరియెన్స్ గా మారుతుంది. రైలు ఎక్కడికి చేరుతుందనే దానికంటే, మార్గంలో కనిపించే ప్రకృతి దృశ్యాలు మనసులో నిలిచిపోతాయి. అందుకే దేశంలోని అందమైన రైల్వే ప్రదేశాలను చూడాలనుకునేవారు దూద్‌సాగర్, ఘుమ్ లాంటి ప్రాంతాలను సెలెక్ట్ చేసుకోవచ్చు.అక్కడ కొన్ని క్షణాలు గడిపితే ప్రకృతి మధ్యలోనే ఉండిపోవాలనిపించడం ఖాయం.

Read Also: నదీ జలాలు.. సముద్రపు అలలు.. అడవి మధ్యలో బోటింగ్.. అంతర్వేది అందాలు చూస్తే మైమరచిపోతారు!

Tags

Related News

పొల్లూరు జలపాతం ఉగ్రరూపం.. కుప్పకూలిన ‘ఇరుముడి’ చెక్క వంతెన!

నదీ జలాలు.. సముద్రపు అలలు.. అడవి మధ్యలో బోటింగ్.. అంతర్వేది అందాలు చూస్తే మైమరచిపోతారు!

రైలు ఆపారు.. సాయం కోరారు.. గంట గడిచినా పత్తాలేని అంబులెన్స్!

రాముడు, కృష్ణుడు నీలం రంగులో ఎందుకు కనిపిస్తారు? అసలు వర్ణం నలుపు కాదా?

పైలట్ నుంచి మద్యం వాసన.. ఎయిర్ ఇండియా షాకింగ్ డెసిషన్!

కారుపై ‘L’ అని ఉందా? ఈ ట్రాఫిక్ రూల్స్ మీకు తెలియకపోతే నష్టం తప్పదు!

పండుగ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. విశాఖకు ప్రత్యేక రైళ్లు!

Big Stories

Advertisement
×