BigTV English

Indian Railways: దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్లు ఇవే, ఒక్కో స్టేషన్ లో ఎన్ని ఫ్లాట్ ఫారమ్ లు ఉన్నాయో తెలుసా?

Indian Railways: దేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్లు ఇవే, ఒక్కో స్టేషన్ లో ఎన్ని ఫ్లాట్ ఫారమ్ లు ఉన్నాయో తెలుసా?

Indian Railways: భారతీయ రైల్వే సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ కలిగిన నాలుగో సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. అమెరికా, చైనా, రష్యా తర్వాత భారత్ నిలిచింది. రోజూ సుమారు 13 వేల రైళ్లు తమ సేవలను కొనసాగిస్తాయి. నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులను తమ గమ్యస్థానాలకు చేర్చుతుంది. ఇక దేశ వ్యాప్తంగా 7,303 రైల్వే స్టేషన్లు ఉండగా, వాటిలో కొన్ని అత్యధిక ఫ్లాట్ ఫారమ్ లు కలిగి ఉన్న రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇంతకీ ఆ స్టేషన్లు ఏవో చూద్దాం..


⦿ హౌరా రైల్వే స్టేషన్- 23 ఫ్లాట్ ఫారమ్ లు

కోల్‌ కతాలోని హౌరా రైల్వే స్టేషన్ 23 ప్లాట్‌ ఫారమ్‌లతో దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడి నుంచి ప్రతి రోజు 600 కంటే ఎక్కువ రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయి. దేశంలో రద్దీగా ఉండే స్టేషన్లలో ఇది ఒకటిగా కొనసాగుతున్నది.


⦿ సీల్దా రైల్వే స్టేషన్- 21 ఫ్లాట్ ఫారమ్ లు

ఈ రైల్వే స్టేషన్ కూడా కోల్ కతాలోనే ఉంది. ఇక్కడ మొత్తం 21 ఫ్లాట్ ఫారమ్ లు  ఉంటాయి. సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఇక్కడి నుంచి బయల్దేరుతాయి. ఎక్కువ రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఇది కూడా ఒకటిగా కొనసాగుతోంది.

⦿ ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్- 18 ఫ్లాట్ ఫారమ్ లు

ఈ రైల్వే స్టేషన్ ముంబైలో ఉంది. ఇక్కడ మొత్తం 18 ఫ్లాట్ ఫారమ్ లు ఉంటాయి. ఈ రైల్వే స్టేషన్ యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకుంది.

⦿ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్- 17 ఫ్లాట్ ఫారమ్ లు

ఇక చెన్నైలోని ఈ రైల్వే స్టేషన్ లో 17 18 ఫ్లాట్ ఫారమ్ లు ఉన్నాయి. సౌత్ ఇండియాలో కీలక రైల్వే కేంద్రంగా కొనసాగుతుంది. ఇక్కడి నుంచి దూర ప్రాంతాలకు రైళ్లు నడుస్తున్నాయి.

⦿ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్- 16 ఫ్లాట్ ఫారమ్ లు

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో 16 ప్లాట్‌ ఫారమ్‌ లు ఉన్నాయి. ఇది దేశంలో  రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఒకటిగా కొనసాగుతున్నది. దేశ రాజధాని నుంచి దేశంలో పలు ప్రాంతాలకు ఇక్కడ నుంచి రైల్వే సర్వీసులు నడుస్తున్నాయి.

⦿ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్- 12ఫ్లాట్ ఫారమ్ లు

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ లో 12 ప్లాట్‌ఫారమ్‌ లు ఉన్నాయి. ఇక్కడి నుంచి దేశంలోని పలు ముఖ్య నగరాలకు రైల్వే సర్వీసులు నడుస్తున్నాయి.

⦿గోరఖ్‌పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్- 12ఫ్లాట్ ఫారమ్ లు

ఉత్తర ప్రదేశం లోని గోరఖ్‌ పూర్ లో ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ 12 ప్లాట్‌ఫారమ్‌ లు ఉంటాయి. యూపీ నుంచి పలు ప్రాంతాలకు ఇక్కడి నుంచి రైల్వే సర్వీసులు కొనసాగుతున్నాయి.

ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాన్పూర్ సెంట్రల్ రైల్వే స్టేషన్, ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్, పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్లలో 10 రైల్వే ఫ్లాట్ ఫారమ్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి దేశంలోని పలు రాష్ట్రాలకు రైల్వే సర్వీసులు నడుస్తున్నాయి.

Read Also: దేశంలో అత్యంత రద్దీ రైల్వే స్టేషన్లు ఇవే, రోజూ ఎన్ని లక్షల మంది ప్రయాణిస్తారో తెలుసా?

Related News

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Big Stories

×