E-Paper
Advertisement

తాళాల స్థానంలో స్మార్ట్ కార్డ్స్.. హోటళ్లలో ఈ మార్పు ఎందుకు? దీని వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి?

తాళాల స్థానంలో స్మార్ట్ కార్డ్స్.. హోటళ్లలో ఈ మార్పు ఎందుకు? దీని వెనుక మాస్టర్ ప్లాన్ ఏంటి?
Advertisement

Hotel Key Cards: పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా హోటల్స్ లోనే బస చేయాల్సి వస్తుంది. అయితే ఒకప్పుడు హోటల్స్ గదులకు తాళాలు ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ వ్యవస్థ దాదాపుగా కనుమరుగవుతోంది. మారిన కాలానికి అనుగుణంగా ప్రస్తుతం వాటి స్థానంలో స్మార్ట్ కీ కార్డ్స్ ను హోటల్స్ నిర్వాహకులు వినియోగిస్తున్నారు. ప్లాస్టిక్ కార్డును గది డోర్ వద్ద స్వాప్ చేయడం ద్వారా చిటికెలోనే డోర్ ఓపెన్ అవుతోంది. అయితే పాతకాలపు తాళాలకు, ఈ స్మార్ట్ కార్డ్ కి మధ్య తేడా, ఈ ప్లాస్టిక్ కార్డ్ వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

కార్డు పోయినా సెకన్లలో డీయాక్టివేట్

సాధారణంగా తాళం చెవిని జేబులో పెట్టుకొని వెళ్లినప్పుడు ఒక్కోసారి అది జారిపడే ప్రమాదం ఉంది. అది వేరొకరి చేతికి చిక్కితే తాళం ఓపెన్ చేసి.. గదిలోకి ప్రవేశించడం చాలా తేలికవుతుంది. అదే స్మార్ట్ కార్డ్ వినియోగం వల్ల అలాంటి టెన్షన్ ఉండదు. ఒకవేళ స్మార్ట్ కార్డ్ పోగొట్టుకున్నా.. వెంటనే హోటల్ సిబ్బందికి సమాచారం ఇస్తే వాళ్లు దానిని డీయాక్టివేట్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

స్టే ముగియగానే యాక్సెస్ ఆఫ్

Advertisement

సాధారణ ఇనుప తాళం లాగా కీ కార్డు ఎల్లప్పుడూ పనిచేయదు. మీరు చెకిన్ అయినప్పుడు మీ బుకింగ్ గడువు ఎంతవరకు ఉందో అంతవరకే పనిచేసేలా దాన్ని ప్రోగ్రామ్ చేస్తారు. మీరు చెకౌట్ పూర్తి చేసిన తక్షణమే ఆ కార్డు గడువు ముగుస్తుంది. దీనివల్ల పాత అతిథులు వెళ్లిపోయిన తర్వాత కూడా ఆ తాళాలు పనిచేస్తాయేమోననే ఆందోళన హోటల్ యాజమాన్యానికి ఉండదు.

ఒకే కార్డుతో అనేక సేవలు

ప్రస్తుతం కీ కార్డు అనేది కేవలం రూమ్ తలుపు తెరవడానికి మాత్రమే కాకుండా.. ఒక ఆల్-ఇన్-వన్ పాస్‌లా పనిచేస్తోంది. లిఫ్ట్ ఉపయోగించడం, ఫిట్‌నెస్ సెంటర్‌లోకి వెళ్లడం, స్విమ్మింగ్ పూల్, ఎగ్జిక్యూటివ్ లాంజ్, ప్రత్యేక ఫ్లోర్‌లలోకి ప్రవేశించడానికి కూడా ఇదే కార్డు ఉపయోగపడుతోంది. దీని వల్ల ప్రతీ గదికి వేర్వేరు తాళం చెవులు పట్టుకెళ్లే బాధలేకుండా అంతా ఒకే కార్డులో అందుబాటులోకి వస్తుంది.

నిర్వహణ ఖర్చులు తగ్గుదల

Advertisement

తలుపులకు తాళాలు మారుస్తూ ఉండటమనేది హోటళ్లకు ఖర్చుతో కూడుకున్న పని. పాత పద్ధతిలో తాళం చెవి పోతే, సురక్షితంగా ఉంచడానికి పూర్తి లాక్ సిస్టమ్‌ను మార్చాల్సి వచ్చేది. కానీ ఎలక్ట్రానిక్ కీ కార్డులతో ఆ సమస్య తీరిపోయింది. పాత కార్డును రద్దు చేసి కొత్త కార్డును ప్రోగ్రామ్ చేయడం ద్వారా హోటళ్లకు నిర్వహణ ఖర్చులు బాగా తగ్గాయి.

విద్యుత్ ఆదా

మెజారిటీ హోటల్స్ లో గదిలోకి అడుగుపెట్టగానే తలుపు పక్కన ఒక స్లాట్ కనిపించడం గమనించే ఉంటారు. ఆ స్లాట్‌లో మీ రూమ్ కార్డును ఉంచితేనే గదిలో విద్యుత్ సరఫరా ప్రారంభమవుతుంది. అతిథులు బయటకు వెళ్లేటప్పుడు కార్డును బయటకు తీయగానే లైట్లు, టీవీ, ఏసీలు దానంతట అవే ఆగిపోతాయి. వందలాది గదులు ఉండే పెద్ద హోటళ్లలో ఇది చాలావరకు విద్యుత్‌ను ఆదా చేస్తుంది.

ప్రతీ ఎంట్రీకి డిజిటల్ రికార్డు

ఈ కార్డులు తలుపులు తెరవడమే కాకుండా రూమ్ ఎప్పుడు ఓపెన్ అయిందో డిజిటల్ లాగ్ రికార్డు చేస్తాయి. హౌస్ కీపింగ్ విషయంలో ఏవైనా వివాదాలు వచ్చినా, గదిలో వస్తువులు పోయాయని అతిథులు ఫిర్యాదు చేసినా, నిర్వహణ సిబ్బంది సమగ్ర విచారణ చేయడానికి ఈ డిజిటల్ డేటా ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏ కార్డు ఉపయోగించి ఏ సమయానికి గది తెరిచారో స్పష్టంగా తెలుస్తుంది.

Also Read: జియోలో ఇంత మంచి ప్లాన్ ఉందా.. రూ. 666తో 70 రోజులపాటు ఫ్రీ కాల్స్, డేటా.. సామాన్యులకు పండగే!

గదుల నిర్వహణ సులభతరం

వందలాది గదులు ఉండే పెద్ద హోటళ్లలో ప్రతీ గదికి తాళాలు మెయిన్ టెన్ చేయాలంటే చాలా కష్టమైన పని. ఎలక్ట్రానిక్ కీ కార్డులు ఈ ప్రక్రియను ఎంతో సులభతరం చేశాయి. రిసెప్షన్ సిబ్బంది కేవలం కొద్ది సెకన్లలోనే కొత్త కార్డును సిద్దం చేసే వెసులుబాటును ఈ వ్యవస్థ కల్పిస్తుంది. అలాగే హౌస్ కీపింగ్ సిబ్బందికి వారు కేటాయించిన గదులకు మాత్రమే యాక్సెస్ ఇచ్చేలా డిజిటల్‌గా మార్పులు చేయవచ్చు.

Also Read: రోజుకు రూ.7 మాత్రమే.. డైలీ 1GB డేటా, కాల్స్, నాన్‌స్టాప్ 5G కూడా.. వీఐలో అత్యంత చౌకైన ప్లాన్స్!

Tags

Related News

మానవులు ఏలియన్స్ తో మాట్లాడవచ్చా? భవిష్యత్ లోనైనా సాధ్యమేనా?

సూర్యాపేటకు రైలు కూత.. దశాబ్దాల కలకు కీలక అడుగులు!

పండుగ సీజన్‌లో ప్రయాణికులకు గుడ్ న్యూస్, హైటెక్ సిటీలో రైలు ఎక్కొచ్చు!

రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జర్నీలో ఈ తప్పులు చేస్తే.. జరిమానాతో పాటు డైరెక్ట్ జైలే!

కొండవాలుపై ‘కృష్ణుడి వెన్నముద్ద’ రాయి.. 1200 ఏళ్లుగా దొర్లని వైనం.. సైన్స్‌కే అంతుపట్టని రహస్యం!

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రోడ్డుపై బైక్ రైడ్.. గిన్నీస్ రికార్డుల్లోకి తుని యువకుడు!

మహిళలకు అలర్ట్.. రైల్వే స్టేషన్‌లోని ఈ అద్భుతమైన సౌకర్యాలు మీకు తెలుసా?

రైలు ఫుడ్‌పై రైల్వే కీలక నిర్ణయం.. వంట నుంచి ప్యాకింగ్ వరకు AI నిఘా!

Big Stories

Advertisement
×