Vi Recharge Plans: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vi) తమ కస్టమర్ల కోసం అద్భుతమైన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. ముఖ్యంగా ప్రతిరోజూ 1GB హై-స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, SMS ప్రయోజనాలతో బడ్జెట్ ధరల్లో ఈ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 210 తో ప్రారంభమయ్యే ఈ ప్లాన్లలో కస్టమర్ల వ్యాలిడిటీ అవసరాలను బట్టి రూ.249, రూ. 299, రూ. 479 లాంటి ప్లాన్లు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా వీటిలోని కొన్ని ప్లాన్లపై అన్‌లిమిటెడ్ 5G డేటాను కూడా Vi అందిస్తోంది. ఈ ప్లాన్లకు సంబంధించిన వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.
28 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ వీఐ ప్లాన్ లో.. ప్రతీ రోజూ యూజర్లకు 1GB డేటా లభించనుంది. అలాగే ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా రోజుకు సగటున రూ. 7.50 మాత్రమే ఖర్చు కానుంది. అయితే ప్రస్తుతం ఈ ప్లాన్ అస్సాం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఒడిశా సర్కిళ్లలో మాత్రమే అందుబాటులో ఉంది.
24 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ లోనూ రోజూ 1GB డేటా యూజర్లు పొందొచ్చు. ఫ్రీ కాల్స్, ప్రతీరోజూ 100 ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు. ఈ ప్లాన్ ఎంచుకుంటే రోజుకు సగటున రూ. 10.38 ఖర్చవుతుంది.
ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1GB డేటా, 100 SMSలు లభిస్తాయి. దీనికి అదనంగా ‘Vi Movies & TV’ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందొచ్చు. దీని ద్వారా లేటెస్ట్ బాలీవుడ్ సినిమాలు, టీవీ షోలు, లైవ్ న్యూస్ ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాకుండా వీఐ యాప్‌లో ‘టుడేస్ ఆఫర్’ కింద రీఛార్జ్ చేసుకుంటే అన్‌లిమిటెడ్ డేటా ప్రయోజనం కూడా పొందే ఛాన్స్ ఉంది. దీని రోజువారీ ఖర్చు రూ. 10.68.
రెగ్యులర్ ప్రయోజనాలతో పాటు అదనపు డేటా కోరుకునే వారికి రూ. 340 ప్లాన్ బెస్ట్ ఆప్షన్. దీనిలో 28 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 1GB డేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి. వీటికి అదనంగా మరో 1GB ఫిక్స్‌డ్ డేటాను సంస్థ అందిస్తోంది. ఈ ప్లాన్ రోజువారీ ఖర్చు రూ. 12.14.
Also Read: మీ కిచెన్ రిచ్‌గా కనిపించాలా? అయితే ఈ ఫ్రిజ్‌లపై ఓ లుక్కేయండి
తక్కువ బడ్జెట్ లో 5G బెనిఫిట్స్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ప్లాన్. సాధారణంగా ఈ ప్లాన్ ద్వారా 48 రోజుల పాటు డైలీ 1GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMSలు లభిస్తాయి. కానీ స్పెషల్ ఆఫర్ కింద కస్టమర్లకు అదనంగా 10GB డేటా, 54 రోజుల వ్యాలిడిటీ దక్కుతుంది. అలాగే 5G కవరేజ్ ఉన్న ప్రాంతాల్లో 5G స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్న వారికి అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా లభిస్తుంది. రోజుకు సగటున రూ. 9.98 ఖర్చుతో ఈ ప్లాన్ సొంతం చేసుకోవచ్చు.
Also Read: మన దేశంలో.. మనకే అనుమతి లేని రాష్ట్రాలు.. వెళ్లాలంటే దరఖాస్తు తప్పనిసరి!