E-Paper
Advertisement

జియోలో ఇంత మంచి ప్లాన్ ఉందా.. రూ. 666తో 70 రోజులపాటు ఫ్రీ కాల్స్, డేటా.. సామాన్యులకు పండగే!

జియోలో ఇంత మంచి ప్లాన్ ఉందా.. రూ. 666తో 70 రోజులపాటు ఫ్రీ కాల్స్, డేటా.. సామాన్యులకు పండగే!
Advertisement

Jio Recharge Plan: టెలికాం రంగంలో తనదైన ముద్ర వేసిన రిలయన్స్ జియో (Reliance Jio) వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా రకరకాల రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెస్తోంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కోరుకునే వారి కోసం జియో అందిస్తున్న పాపులర్ ప్లాన్లలో రూ. 666 ప్లాన్ ఒకటి. రెండు నెలలకు పైగా వ్యాలిడిటీ ఇచ్చే ఈ ప్లాన్ పూర్తి వివరాలు, దీని వల్ల యూజర్లకు కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

రూ.666 ప్లాన్ వివరాలు

జియో ఈ ప్లాన్ ను 70 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. రోజుకు 1.5 GB చొప్పున హై-స్పీడ్ 4G డేటా యూజర్లకు లభిస్తుంది. అంటే 70 రోజులకు గాను మొత్తం 105 GB డేటాను వాడుకోవచ్చు. రోజువారీ డేటా పరిమితి పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ వేగం 64 Kbpsకి తగ్గనుంది. మరోవైపు దేశంలో ఏ నెట్ వర్క్ కు అయినా ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను సైతం ఈ ప్లాన్ కింద చేసుకోవచ్చు.

అదనపు బెనిఫిట్స్

Advertisement

ఈ ప్లాన్ లో డేటా, కాల్స్ మాత్రమే కాకుండా ఈ మరికొన్ని ఉచిత ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ వంటి యాప్‌లకు ఫ్రీ యాక్సెస్ లభించనుంది. అయితే రోజుకు 2GB వచ్చే ప్లాన్స్ కు మాత్రమే 5G అన్ లిమిటెడ్ డేటాకు ఛాన్స్ ఉన్నందున ఈ ప్లాన్ లో 5G ఆఫర్ లేకపోవడం మైనస్ గా చెప్పవచ్చు.

Also Read: రోజుకు రూ.7 మాత్రమే.. డైలీ 1GB డేటా, కాల్స్, నాన్‌స్టాప్ 5G కూడా.. వీఐలో అత్యంత చౌకైన ప్లాన్స్!

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

Advertisement

ఈ ప్లాన్‌ను చాలా ఈజీ పద్దతుల్లో రీఛార్జ్ చేసుకోవచ్చు. ముందుగా ఫోన్ లోని ‘MyJio’ యాప్‌ ఓపెన్ చేసి ‘రీఛార్జ్’ సెక్షన్‌కి వెళ్లండి. అక్కడ కనిపించే ప్లాన్లలో ‘రూ. 666’ ప్లాన్‌ను ఎంచుకుని UPI లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమేంట్ చేయవచ్చు. అలాగే గూగుల్ పే, ఫోన్ పే, పేటీయం వంటి యాప్స్ లోకి వెళ్లి కూడా ఈ ప్లాన్ ను సొంతం చేసుకోవచ్చు. ఇవేమి వీలుకాని పక్షంలో సమీపంలో ఉన్న జియో స్టోర్ లేదా రీఛార్జ్ షాప్‌కి వెళ్లి నేరుగా రీఛార్జ్ చేయించుకోవచ్చు.

Also Read: మన దేశంలో.. మనకే అనుమతి లేని రాష్ట్రాలు.. వెళ్లాలంటే దరఖాస్తు తప్పనిసరి!

Tags

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×