Passengers Alert: మన ఇండియన్ రైల్వే నిబంధనలు తెలుసుకోకుంటే, చిక్కులు తప్పవు. ప్రధానంగా వందే భారత్ లాంటి రైళ్లలో మాత్రం నిబంధనలు తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఇండియన్ రైల్వేలో నూతన శకానికి నాంది పలుకుతూ వందే భారత్ రైళ్లు రయ్ రయ్ అంటూ పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్లు మన దేశంలో ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తున్నాయి.
ఈ ట్రైన్లు దేశవ్యాప్తంగా 16 రైల్వే జోన్లలో వివిధ మార్గాలపై నడుస్తున్నాయి. ముఖ్యమైన నగరాలు, ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రయాణికులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. అయితే ఈ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం, జైలు ఊసలు లెక్కపెట్టాల్సిందే. ఇంతకు ఆ నిబంధనలు ఏమిటో తెలుసుకుందాం.
ఇండియన్ రైల్వే నిబంధనల ప్రకారం, ఏ రైలులో అయినా, ముఖ్యంగా వందే భారత్ (Vande Bharat) వంటి హైటెక్ ట్రైన్లలో, సిగరెట్ త్రాగడం పూర్తిగా నిషేధం. ఇలాంటి చర్యలను పబ్లిక్ ప్లేస్‌లో పొగత్రాగడం కింద పరిగణిస్తారు. వందే భారత్‌లో సిగరెట్ త్రాగితే భారత రైల్వే చట్టం, 1989 ప్రకారం రూ. 200 వరకు జరిమానా విధిస్తారు. అంతేకాదు ఆన్ ది స్పాట్ పోలీస్ కేసు బుక్ చేసి, ప్యాసింజర్ కు నోటీసు ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పరిస్థితులను బట్టి రైలు నుంచే దించివేయవచ్చు. ఈ రైళ్లలో నిరంతర సీసీటీవీ పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి, పొగత్రాగుతున్న దృశ్యం రికార్డవడం ఖాయం.
ఎందుకింత సీరియస్ యాక్షన్..
వందే భారత్ రైలు పూర్తిగా ఎయిర్ కండిషన్‌తో నడిచే ట్రైన్. ఇందులో చిన్నపాటి పొగ కూడా ఇతర ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంది. అందుకే, ట్రైన్‌లో పొగత్రాగడం అంటే, ఇతరుల ఆరోగ్యానికి హానికరంగా ఉండటమే కాదు, చట్టరీత్యా నేరం కూడా. అందుకే ఇలాంటి సీరియస్ యాక్షన్ ను ఆర్పీఎఫ్ పోలీసులు తీసుకుంటారు.
ఇది గుర్తుంచుకోండి..
రైల్వే స్టేషన్‌లోని నిర్దేశిత స్మోకింగ్ జోన్‌లో మాత్రమే త్రాగాలి. రైలులో కంటే ముందే పూర్తిగా నియంత్రించుకోవడమే ఉత్తమం. టాయిలెట్‌లో ధూమపానం చేయడమనేది అత్యంత ప్రమాదకరం. ఫైర్ అలారం పని చేయవచ్చు, ట్రైన్ ఆపివేసే పరిస్థితి కూడా వస్తుంది. ఆపద లాంటి పరిణామాలకు దారి తీస్తుంది.
ఎలాంటి అత్యవసర పరిస్థితి లేకుండా చైన్ లాగితే కేసు నమోదవుతుంది. రూ. 1000 వరకు జరిమానా, జైలు శిక్ష కూడా ఉంటుంది. మ్యూజిక్ లేదా వీడియోలు లౌడ్‌గా వినడం వంటి చర్యలకు పాల్పడవద్దు. హై స్పీడ్ ట్రైన్‌లో ఇతరులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తుంది. ఇలా చేస్తే టికెట్ రద్దయ్యే అవకాశం కూడా ఉంటుంది.
Also Read: Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ రైల్లో ఫ్రీ ఫుడ్? ఏయే వెరైటీలు పెడతారంటే?
వందే భారత్‌లో చెత్త వేయడం కూడా నిషిద్ధమే. ప్లాట్‌ఫామ్‌లా తీయకుండా పేపర్లు, బాటిల్స్ పడేయడం నిషేధం. ఫోటోలు లేదా సెల్ఫీలు తీయడం, తలుపులు దగ్గర నిలబడి రీల్స్ చేయడం వంటి చర్యలకు పాల్పడితే రైల్వే అధికారులు జరిమానా విషయం పక్కన పెడితే, ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువ. అందుకే వందే భారత్ లో ప్రయాణించే వారు ఈ తప్పులు అస్సలు చేయవద్దు.. లేకుంటే ఆన్ ది స్పాట్ జైలుకే!