BIG TV LIVE Originals: హైదరాబాద్ మెట్రో రైలు నగరంలో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించడంతో పాటు ప్రయాణీకులకు చక్కటి ప్రయాణ అనుభవాన్ని అందిస్తోంది. ప్రపంచ స్థాయి రవాణా సౌకర్యాలతో దేశంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రయాణీకులను అత్యంత వేగంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతోంది. మెట్రో సజావుగా కార్యకలాపాలు కొనసాగించడంతో లోకో పైలెట్లకు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇంతకీ, వారికి హైదరాబాద్ మెట్రో సంస్థ ఎంత సాలరీ ఇస్తుంది? అదనపు ప్రయోజనాలు ఏం అందిస్తోంది? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
అనుభవం ఆధారంగా సాలరీస్ లో మార్పులు
హైదరాబాద్ మెట్రో రైల్ లోకో పైలట్స్ సాలరీస్ అనుభవాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఫ్రెషర్లు సంవత్సరానికి రూ.2.7 లక్షల నుంచి రూ. 3.5 లక్షల వరకు అందిస్తున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎంట్రీ లెవల్ లోకో పైలట్లు సాధారణంగా నెలకు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు సంపాదిస్తున్నారు. ఎక్కువ అనుభవం కలిగిన లోకో పైలెట్లు నెలకు రూ.50 వేల నుంచి రూ. 1 లక్ష వరకు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. లోకో పైలట్లు వారి మూల వేతనంతో పాటు బోనస్ లు, అలవెన్సులు, పెన్షన్ సహా ఇతర ప్రోత్సాహకాలను కూడా పొందుతారు. ఇందులో పన్నులు, ప్రావిడెంట్ ఫండ్ కటింగ్ కూడా ఉంటుంది. ఇక నోటీసు పీరియడ్ విషయంలో.. 67% మంది హైదరాబాద్ మెట్రో రైల్ లోకో పైలట్లు 15 రోజులు, అంతకంటే తక్కువగా ఉంటుంది. 33% మందికి 3 నెలల నోటీసు పీరియడ్ ను అమలు చేస్తున్నారు. దేశ సగటు మెట్రో రైల్ లోకో పైలెట్ సాలరీస్ కంటే కంటే హైదరాబాద్ మెట్రోలో తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియన్ రైల్వేలో లోకో పైలట్ జీతం ఏడాదికి రూ. 5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌లో రూ.9 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు ఉంటుంది.
లోకో పైలెట్స్ సాలరీ వివరాలు
⦿ ఫ్రెషర్స్: సంవత్సరానికి రూ.2.7 లక్షల నుంచి రూ. 3.5 లక్షలు
⦿ ప్రారంభ స్థాయి: నెలకు రూ.25,000 నుంచి రూ. 35,000
⦿ అనుభవం: నెలకు రూ.50,000 నుంచి రూ. 1 లక్ష
హైదరాబాద్ మెట్రో గురించి..
హైదరాబాద్ మెట్రో దేశంలోనే అతిపెద్ద మెట్రో వ్యవస్థలలో మూడో స్థానంలో నిలిచింది. ఢిల్లీ మెట్రో, బెంగళూరు నమ్మ మెట్రో తర్వాత స్థానంలో ఉంది. ఇది పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించి ప్రపంచంలోనే అతిపెద్ద ఎలివేటెడ్ మెట్రో రైల్ వ్యవస్థ. L&T సంస్థ నిర్మించింది. 2017 నవంబర్ 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మెట్రోను ప్రారంభించారు. మియాపూర్ నుంచి నాగోల్ వరకు 30 కి.మీ. మార్గం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం సుమారు కారిడార్లుగా 69 కి.మీ పరిధిలో విస్తరించింది. మొత్తం 57 మెట్రో స్టేషన్లు ఉన్నాయి. ప్రతి రోజూ 5 లక్షల మంది ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తున్నారు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: వందే భారత్ రైలు నడిపేందుకు రైల్వేకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? మీరు అస్సలు నమ్మలేరు!