BigTV English

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో క్రెడిట్ ఆ ముఖ్యమంత్రిదేనా? పునాది వేసింది ఎవరు?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో క్రెడిట్ ఆ ముఖ్యమంత్రిదేనా? పునాది వేసింది ఎవరు?

హైదరాబాద్ మెట్రో దేశంలోనే అతిపెద్ద నగర రవాణా ప్రాజెక్టులలో ఒకటి. రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంలో లక్షలాది మంది ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. అయితే, ఈ భారీ ప్రాజెక్టును నిర్మించాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? ఆ ఆలోచన కార్యరూపం ఎలా దాల్చింది? అనే వివరాలను ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం..


హైదరాబాద్ మెట్రో చంద్రబాబు ఆలోచన!

హైదరాబాద్ మెట్రో ఆలోచన ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారు. 1995 నుంచి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కాలంలో హైదరాబాద్ ఐటీ హబ్ గా డెవలప్ అయ్యింది. సైబరాబాద్ ఏర్పడింది. నగర పురోగతికి అనుగుణంగా ఆధునిక రవాణా వ్యవస్థ ఉండాలని భావించారు. రోడ్లు రద్దీగా ఉన్నాయని, బస్సులు, మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (MMTS) లాంటి పాత వ్యవస్థలు సరిపోవని ఆయన భావించారు. ఢిల్లీ మెట్రో నుంచి ప్రేరణ పొంది ప్రపంచ స్థాయి మెట్రో వ్యవస్థను నిర్మాలని భావించారు. హైదరాబాద్ ప్రజలకు ప్రయాణాన్ని త్వరగా, సౌకర్యవంతంగా మార్చాలనుకున్నారు.


తొలి దశ మెట్రో ప్రణాళికలు

2000 ప్రారంభంలో చంద్రబాబు ప్రభుత్వం మెట్రో నిర్మాణానికి కీలక చర్యలు చేపట్టింది. 2003లో మెట్రోను ప్లాన్ చేయడానికి  కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో కలిసి ప్రణాళికలు సిద్ధం చేశారు. డీపీఆర్ ను రూపొందించడానికి నిపుణులతో కలిపి మెట్రో రైల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మెట్రో మార్గాలు, ఖర్చులు, డిజైన్లను వివరిస్తూ 2003–2004లో DPR రెడీ అయ్యింది. ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడానికి, ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరారు చంద్రబాబు.

చంద్రబాబు తర్వాత ఏం జరిగింది?

2004 తర్వాత చంద్రబాబు పదవి నుంచి దిగిపోయారు. కానీ, మెట్రో ప్రాజెక్ట్ పనులు కొనసాగాయి. ఆ తర్వాత సీఎం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం DPRని ఖరారు చేసి, ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లింది. 2010లో L&T మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ తో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) మోడల్ లో మెట్రోను నిర్మించడానికి ఒప్పందం చేసుకుంది.  2014లో తెలంగాణ ఏర్పడి, కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  కేసీఆర్ ప్రభుత్వం ఫేజ్ I నిర్మాణాన్ని పర్యవేక్షించింది. మొదటి మెట్రో లైన్ 2017లో అందుబాటులోకి తీసుకొచ్చింది.69 కి.మీ పరిధిలో విస్తరించింది. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెండవ దశ మెట్రో విస్తరణకు ఆమోదం తెలిపారు. ఇందులో విమానాశ్రయం, పాత నగరానికి కొత్త మార్గాలు ఉన్నాయి. చంద్రబాబు కలలుగన్న మెట్రో ప్రాజెక్టును, ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ముందుకు కొనసాగించారు.

హైదరాబాద్ మెట్రో గేమ్-ఛేంజర్!

హైదరాబాద్ అభివృద్ధిని ముందే ఊహించి మెట్రోకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్లడంలో ఇతర ముఖ్యమంత్రులు కూడా శ్రద్ధ తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ప్రతిరోజూ దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. రోజు రోజుకు మరింతగా విస్తరిస్తోంది. 2024లో ఆమోదించబడిన రెండవ దశ, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక మార్గంతో సహా 76.4 కి.మీ కొత్త లైన్లను జోడిస్తుంది. ప్రణాళికలో ఉన్న మూడవ దశ, మేడ్చల్, శంషాబాద్ లాంటి సుదూర ప్రాంతాలను కలుపుతూ 300 కి.మీ.లకు పైగా కవర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also: హైదరాబాద్ లో ఉన్నారా? ఈ ప్లేస్ కు వెళ్లకపోతే వేస్టే.. ఎక్కడ ఉందంటే?

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×