No AC Campaign In Hyderabad: వేసవి ప్రారంభం అయిన నేపథ్యంలో హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘నో ఏసీ క్యాంపెయిన్’కు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రైడ్ ల బహిష్కరించిన ఓలా, ఉబర్, రాపిడో, ఇతర క్యాబ్ డ్రైవర్లు, అగ్రిగేటర్లు వసూలు చేసే అన్యాయమైన రేట్లను నిరసిస్తూ ఇప్పుడు నగరంలో ‘నో ఏసీ క్యాంపెయిన్’ మొదలుపెట్టారు. ఇవాళ్టి (మార్చి 24) నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. “హైదరాబాద్ లోని క్యాబ్ డ్రైవర్లు మార్చి 24 నుండి ‘నో ఏసీ క్యాంపెయిన్’ను ప్రారంభించారు” అని ప్రకటించింది.
‘నో ఏసీ క్యాపెంయిన్’ ఎందుకు?
క్యాబ్ అగ్రిగేటర్లు ప్రభుత్వం నిర్దేశించిన ప్రీపెయిడ్ టాక్సీ ఛార్జీల మాదిరిగానే యూనిఫామ్ ఛార్జీల విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తోంది. పెట్రో ఖర్చులు, వాహనాల మెయింటెనెన్స్, డ్రైవర్ సర్వీస్ కు అగ్రిగేటర్లు ఇచ్చే కమీషన్ ఏమాత్రం సరిపోవడం లేదంటుంది. గత ఏడాది ఏప్రిల్ లోనూ క్యాబ్ డ్రైవర్లు ‘నో ఏసీ క్యాంపెయిన్’ నిర్వహించారు. ఇప్పుడు మరోసారి ఆ క్యాపెంయిన్ కొనసాగిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్లకు సాధారణంగా కి.మీ.కు ₹10-12 ఆదాయం వస్తుండగాచ.. ఎయిర్ కండిషనర్ ఆన్ చేస్తే ఆ ఖర్చు కి.మీ.కు ₹16-18 అవుతుందంటున్నారు. వచ్చే ఆదాయం కంటే అయ్యే ఖర్చే అధికంగా ఉందనేది క్యాబ్ డ్రైవర్ల ఆరోపణ. క్యాబ్ అగ్రిగేటర్లు అందించే అన్యాయమైన కమీషన్ కు వ్యతిరేకంగా యూనియన్ ఈ నిర్ణయం తీసుకుందని TGPWU అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ వెల్లడించారు. అగ్రిగేటర్లు, ప్రీ-పెయిడ్ టాక్సీలు వసూలు చేసే ఛార్జీల మధ్య ₹300–400 వరకు తేడా ఉంటుందన్నారు. ఎయిర్ పోర్టుకు వెళ్లే క్యాబ్ డ్రైవర్లు తిరుగు ప్రయాణం కోసం 3 నుంచి 4 గంటలు వేచి ఉండాల్సి వస్తుందన్నారు. వసూళు చేసే ఛార్జీల నుంచి అగ్రగేటర్లకు 30 శాతం కమీషన్ చెల్లించాల్సి ఉంటుందని, డ్రైవర్లకు మిగిలేది ఏమీ లేదని ఆయన ఆరోపించారు.
हैदराबाद में ओला, उबर, रैपिडो कैब ड्राइवर्स का 24 मार्च से नो एसी कैंपेन, जानिए क्यों हो रहा आंदोलन https://t.co/Z2HrWZ2SDg via @NavbharatTimes
— Telangana Gig and Platform Workers Union (@TGPWU) March 23, 2025
Read Also: ఫారిన్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇక హైదరాబాద్ నుంచి నేరుగా వెళ్లొచ్చు!
క్యాబ్ డ్రైవర్ల నిర్ణయంతో ప్రయాణీకుల ఇబ్బందులు
వేసవి మొదలైన వేళ క్యాబ్ డ్రైవర్లు తీసుకున్న నిర్ణయం ప్రయాణీకులకు ఇబ్బంది కలిగిస్తున్నది. ఫీక్ అవర్ పేరుతో ఇప్పటికే ఎక్కువ ఛార్జీలు వసూళు చేస్తుండగా, ఇప్పుడు ఏసీ వేయం అంటే ఎలా అంటూ మండిపడుతున్నారు. క్యాబ్ డ్రైవర్లు తమకు అన్యాయం జరుగుతుందని భావిస్తే, ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు క్యాబ్ సర్వీసులను నిలిపివేయడం మంచిదని సూచిస్తున్నారు. క్యాబ్ లు నడుపుతూ, ఛార్జీలు వసూళు చేస్తూ, ఏసీ వేయం అని చెప్పడం దారుణం అంటున్నారు. మరోవైపు ఈ విషయంలో రాష్ట్రంలో జోక్యం చేసుకోవాలని TGPWU కోరింది. క్యాబ్ అగ్రిగేటర్ల ధరల విధానాలను నియంత్రించడంతో పాటు యూనిఫామ్ఛార్జీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది.
Read Also: పైసా ఖర్చులేకుండా ఏడాదిగా ట్రైన్ లో ఫ్రీ జర్నీ, ప్రయాణీకుడి తెలివికి రైల్వే అధికారుల షాక్!