Indian Railway Ticket Rules: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని కలిగించేందుకు ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. సాధారణంగా రైల్లో ప్రయాణించేందుకు చాలా మంది ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే, ముందుగా బుక్ చేసుకున్న వారికే బెర్తులు కన్ఫార్మ్ అవుతాయి. మిగతా వారికి వెయిటింగ్ లిస్ట్ వస్తుంది. ప్రయాణం చేసే సమయానికి మరికొంత మందికి బెర్త్ దొరికే అవకాశం ఉంటుంది. మరికొంత మంది వెయిటింగ్ టిస్ట్ టికెట్లు ఉన్నప్పటికీ.. రిజర్వేషన్ కోచ్ లలోకి ఎక్కుతున్నారు. వీరి వల్ల కోచ్ లోని ఇతర ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైల్వే సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వెయిటింగ్ లిస్టు టికెట్లు ఉన్నవాళ్లు రిజర్వుడ్ కోచ్ లోకి ఎక్కితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
జరిమానాతో పాటు రైల్లో నుంచి దింపే అవకాశం!
వెయిటింగ్ టికెట్ తో రిజర్వేషన్ కోచ్ లోకి ఎక్కి.. టికెట్ కలెక్టర్ కు దొరికితే తీత్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ప్రయాణం చేసే వారికి జరిమానా విధించడంతో పాటు తర్వాతి స్టేషన్ లో కిందికి దింపే అవకాశం ఉంటుంది. నిజానికి ఈ నిబంధన చాలా కాలంగా ఉన్నా, రైల్వే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇకపై ఈ రూల్ ను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే రైల్వే ఈ అంశానికి సంబంధించి అధికారిక ప్రకటన ఏసింది. ఇకపై వెయిటింగ్ టికెట్ ఉన్నవాళ్లు రిజర్వుడ్ కోచ్ లోకి ఎక్క కూడదని హెచ్చరించింది.
ఎంత జరిమానా విధిస్తారంటే?
ఒకవేళ వెయిటింగ్ టికెట్ తో రిజర్వేషన్ కోచ్ లోకి ఎక్కేవారికి భారీగా జరిమానా విధించనున్నట్లు రైల్వే సంస్థ వెల్లడించింది. ఒక్కో వ్యక్తికి రూ.440 జరిమానా వేస్తామని తెలిపింది. అంతేకాదు, సదరు ప్రయాణీకుడు చెప్పే కారణాలు అసంబద్దంగా అనిపిస్తే తర్వాతి స్టేషన్ లో దింపే అధికారం టీటీఈకి ఉంటుందని వెల్లడించింది. ఒకవేళ అతడు చెప్పే కారణాలు కన్విన్సింగ్ గా ఉంటే జనరల్ బోగీకి పంపిస్తారని తెలిపింది.
Read Also: ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఇకపై తేజస్, వందే భారత్ రైళ్లలోనూ ఆ సౌకర్యం!
జనరల్ టికెట్ తోనూ రిజర్వు కోచ్ లోకి
వెయిటింగ్ లిస్టు టికెట్ మాత్రమే కాకుండా జనరల్ టికెట్ తీసుకొని కొంత మంది రిజర్వేషన్ కోచ్ లలోకి ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇక నుంచి టికెట్ కలెక్టర్లు ఇలాంటి వారి విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలన ఆదేశాలు జారీ చేసింది. ఈ విధానం ద్వారా ఆదాయాన్ని పొందాలని రైల్వే సంస్థ భావిస్తున్నది. ఇప్పటికే టికెట్ల అమ్మకం ద్వారా ఆదాయాన్ని పొందడంతో పాటు టికెట్ క్యాన్సిలేషన్ ద్వారా కూడా ఆదాయాన్ని అర్జిస్తున్నది. మరోవైపు సరుకు రవాణా ద్వారా పెద్ద మొత్తంలో ఇన్ కం పొందుతున్నది.
Read Also: ఆ రూట్ లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ 50 రోజులు క్యాన్సిల్, కారణం ఏంటో తెలుసా?