Railway Ticket Transfer Rules: భారతీయ రైల్వే ద్వారా నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు జర్నీ చేస్తారు. తక్కువ ఖర్చుతో ఆహ్లాదకర ప్రయాణం చేసే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది రైల్లో వెళ్లేందుకు మొగ్గు చూపుతారు. రైల్వే ప్రయాణ చేయాలనుకునే వాళ్లు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. కొన్నిసార్లు చివరి నిమిషంలో ప్రయాణం వాయిదా పడుతుంది. ఆ సమయంలో టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే క్యాన్సిలేషన్ ఛార్జీలు పడతాయి. తక్కువ డబ్బులు రీఫండ్ అవుతాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు వెసులుబాటు కలిగించేలా చర్యలు తీసుకుంటుంది భారతీయ రైల్వే. టికెట్ పై ప్రయాణ తేదీని మార్చుకోవడంతో పాటు వేరే వారి పేరు మీదికి టికెట్ ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.
టికెట్ ను వేరొకరికి ఎలా ట్రాన్స్ ఫర్ చేయాలి?
ఓ ప్రయాణీకుడి కన్ఫార్మ్ టికెట్ మరొక వ్యక్తికి బదిలే చేసుకునే అవకాశం కల్పిస్తోంది భారతీయ రైల్వే. అయితే, ఈ అవకాశం కేవలం రిజర్వేషన్ కౌంటర్లలో ఆఫ్ లైన్ బుకింగ్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది. IRCTC ద్వారా ఆన్ లైన్‌లో బుక్ చేసుకున్న టికెట్లు ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం లేదు. అయితే, ఈ టికెట్ ను కేవలం అదే ఇంటి పేరు ఉన్న కుటుంబ సభ్యులకు మాత్రమే బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది.
⦿ రైలు బయల్దేరడానికి కనీసం 24 గంటల ముందు సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కార్యాలయానికి వెళ్లాలి.
⦿ పేరు మార్పు కోసం అభ్యర్థిస్తూ రిటెన్ గా అప్లికేషన్ ఇవ్వాలి. ప్రస్తుతం టికెట్ ఉన్నవారితో పాటు, టికెట్ ఎవరి పేరు మీదికి మార్చాలో వారికి సంబంధించిన గుర్తింపు కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది.
⦿ అన్ని వివరాలు పరిశీలించి టికెట్ మీ కుటుంబ సభ్యుడి పేరు మీదికి ట్రాన్స్ ఫర్ చేస్తారు.
⦿ టికెట్ ట్రాన్స్ ఫర్ అనేది ఒకేసారి చేసుకునే అవకాశం ఉంటుంది. మరోసారి చేసుకునేందుకు వీలు ఉండదు.
Read Also: ఆహా ఎంత అద్భుతమో.. దేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరాలు ఇవే!
ప్రయాణ తేదీని ఎలా మార్చుకోవాలంటే?
ప్రయాణీకులు ఆన్ లైన్, ఆఫ్ లైన్ బుకింగ్ టికెట్లలో ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశం ఉంటుంది.
⦿ రైలు బయలుదేరడానికి కనీసం 48 గంటల ముందు సమీపంలోని రైల్వే రిజర్వేషన్ కార్యాలయానికి వెళ్లాలి.
⦿ అసలు టికెట్ ను ఇచ్చి ప్రయాణ తేదీని మార్చాలని రిక్వెస్ట్ చేయాలి.
⦿ ప్రయాణ తేదీని ఒకేసారి మర్చుకునే అవకాశం ఉంటుంది.
⦿ తత్కాల్, వెయిట్ లిస్ట్ టికెట్లకు ప్రయాణ తేదీని మార్చుకునే అవకాశం ఉంటుంది.
⦿ ప్రయాణ తేదీని మార్చినప్పుడు మరో రైలులో సీటు లభ్యత విషయంలో మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.
సో, ఇకపై మీరు ప్రయాణం క్యాన్సిల్ అయినా, ఒకవేళ ప్రయాణ తేదీని మార్చుకోవాలి అనుకున్నా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఛేంజ్ చేసుకోవచ్చు.
Read Also: విశాఖ- విజయవాడ మధ్య విమాన సర్వీసులు.. ప్రారంభం ఎప్పటి నుంచి అంటే?