UP News: ఉత్తరప్రదేశ్ లోని రాష్ట్రంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యూపీలో హాత్రాస్ లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన అజిత్ అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే అజిత్ ఇంట్లో మామూలుగా కూర్చొని మొబైల్ చూస్తుండగా.. స్క్రీన్ పై 36 అంకెల బ్యాలెన్స్ క్రెడిట్ అయినట్టు మెసెజ్ వచ్చింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. ఇది నిజమేనా అని నమ్మలేక పోయాడు. అయితే ఈ జరిగిన పది రోజుల తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏప్రిల్ 24న అజిత్ అకౌంట్ నుంచి రూ.1800 డెబిట్ అయ్యాయి. ఆ తర్వాత రోజు మళ్లీ రూ.1400 కట్ అయ్యాయి. ఆ కాసేపటికే అతని బ్యాంక్ బ్యాలెన్స్ రూ.1,00,13,56,00,00,01,39,54,21,00,23,56,00,00,01,39,542గా ఉండటంతో ఒక్కసారిగా అజిత్, అతని కుటుంబ సభ్యులు షాక్ కు గురయయారు. అలాగే గ్రామ ప్రజలు కూడా ఈ విషయాన్ని విని నమ్మలేకపోయారు.
అయితే, అకౌంట్ లో అంత డబ్బులు జమ కావడం చూసిన అజిత్ భార్య మోసగాళ్లు బారిన పడి ఉండోచ్చునేమో అని భావించింది. దీంతో వెంటనే అజిత్ కుటుంబ సభ్యులు బ్యాంక్ అధికారులను సంప్రదించారు. దీంతో అధికారులు జమ్ముకశ్మీర్ లోని ఓ బ్రాంచ్ కు ట్రాక్ చేయబడిన క్రెడిట్ సాంకేతిక లోపం కారణంగా మీ అకౌంట్ అలా నంబర్లు క్రెడిట్ అయ్యాయని చెప్పారు. తన అకౌంట్ స్తంభించిపోవడంతో.. తను మోసపోయాయనని అజిత్ తెలుసుకున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
Also Read: Lashkar-e-Taiba: ఉగ్రవాదులకు సాయం చేసిన వ్యక్తి.. పోలీసుల నుంచి తప్పంచుకోబోయి.. చివరకు..?
ఆ తర్వాత వెంటనే అజిత్ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. సైబర్ క్రైమ్ విభాగానికి మరొక దరఖాస్తును సమర్పించమని పోలీసులు కోరడంతో బాధిత వ్యక్తులు ఫిర్యాదు చేశారు.
మామూలుగా ప్రపంచంలోనే అత్యంత రిచెస్ట్ పర్సన్ అయిన స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ మొత్తం ఆస్తి విలువ కంటే అజిత్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువగా చూపించింది. బ్లూమ్ బెర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ ప్రకారం ఇది ఎలాన్ మస్క్ ఆస్తి విలువ 14 అంకెల సంఖ్య అంటే.. 2,84,17,69,27,10,400గా అంచనా వేయబడింది.
Also Read: CM Revanth Reddy: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్-2025 పోటీలు.. సీఎం రేవంత్ ఏమన్నారంటే..?