Anantha Sriram:’చెన్నై లవ్ స్టోరీ..కిరణ్ అబ్బవరం హీరోగా వచ్చిన ఈ సినిమా తొలి మూడు రోజుల్లోనే రూ.40 కోట్లకు పైగా వసూళ్లు(మేకర్స్ అంటున్నారు మరి)సాధించి దూసుకుపోతుండటంతో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్.ఇక ఈవెంట్ లో సినిమాకి సంబంధించిన అందరూ మాట్లాడినా ఎక్కువగా లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ చేసిన కామెంట్సే ఇప్పుడు నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయ్.
ఫస్ట్ రివ్యూ నేనే
అనంత శ్రీరామ్..మాట్లాడుతూ “ఈ సినిమాకి వచ్చిన ఫస్ట్ రివ్యూ నేనే రాశాను. కథ వినగానే ఇది మామూలు లవ్ స్టోరీ కాదు.. చరిత్రలో నిలిచిపోయే ప్రేమకథ అని చెప్పేశాను. ఆ తర్వాత ఎవరు ఎలాంటి రివ్యూలు రాశారో మేం పట్టించుకోలేదు. ఎందుకంటే ప్రేక్షకులే మా అసలు రివ్యూయర్స్. వాళ్లు సినిమాని గుండెల్లో పెట్టుకున్నారు.. అదే మాకు అతిపెద్ద విజయం” అంటూ చెప్పుకొచ్చారు.
సరదాగా ఆటపట్టించిన అనంత్ శ్రీరామ్
అక్కడితో ఆగకుండా స్టేజ్‌పైనే తన టీమ్‌లోని వాళ్లందరినీ సరదాగా ఆటపట్టించారు. నిర్మాత ఎస్‌కేఎన్ గురించి మాట్లాడుతూ.. “మ్యూజిక్ సిట్టింగ్స్‌కి ఒక్కసారి కూడా రాలేదు. అదే మాకు బాగా కలిసి వచ్చింది. ఎలాంటి టెన్షన్ లేకుండా మంచి పాటలు చేయగలిగాం” అంటూ నవ్వించారు. దర్శకుడు సాయి రాజేష్‌పై కూడా జోక్ వేస్తూ.. “ఒక పాటకు నాలుగు పల్లవులు రాస్తే.. అవన్నీ పాటలోనే కావాలని అంటారు. చివరికి వాటిని ఎలా సెట్ చేయాలో మాకే టెన్షన్” అన్నారు. దర్శకుడు రవి నంబూరి గురించి మాట్లాడుతూ.. “నచ్చిందా? లేదా? అని చెప్పడానికి నాలుగు రోజులు టైమ్ తీసుకుంటారు. వెంటనే చెబితే మాకు కూడా పని ఈజీ అవుతుంది” అంటూ సరదాగా కామెంట్ చేశారు.
also read :ఈ స్టార్ హీరోయిన్ల అసలు పేర్లు మీకు తెలుసా?
ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే చాలు
అయితే అసలు సోషల్ మీడియాలో డిబెట్లకి దారి తీసినవి మాత్రం రివ్యూయర్స్‌పై చేసిన కామెంట్లే.. “ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే చాలు.. అందరూ రివ్యూయర్స్ అయిపోతున్నారు. కొందరు ఈ సినిమా సెకండాఫ్ స్లోగా ఉందన్నారు. అదే కథ, అదే స్క్రీన్‌ప్లే మలయాళంలో వస్తే మ్యాజిక్ అంటారు.. తమిళంలో వస్తే టెర్రిఫిక్ అంటారు.. కన్నడలో వస్తే క్లాసిక్ అంటారు.. హిందీలో వస్తే గొప్ప సినిమా అంటారు. కానీ తెలుగు సినిమా వస్తే మాత్రం ఎందుకో విమర్శించడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు” అంటూ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇంకా “సినిమా నచ్చకపోతే మీ అభిప్రాయం చెప్పండి. కానీ కెమెరా ముందు మాట్లాడేటప్పుడు కాస్త సెన్స్‌తో మాట్లాడండి. ఒక సినిమా కోసం వందల మంది ఎంతో కష్టపడతారు. ఆ కష్టాన్ని కూడా గౌరవించాలి. మనసుతో తీసిన సినిమాలను.. మనసుతో చూసి మాట్లాడితే ఇంకా బాగుంటుంది” అంటూ రివ్యూయర్స్‌కు సూచించారు అనంత శ్రీరామ్.
ఎలాంటి రివ్యూలు వదులుతారో
ప్రస్తుతం అనంత శ్రీరామ్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొందరు ఆయన చెప్పిందే నిజమంటూ మద్దతు ఇస్తుండగా.. మరికొందరు మాత్రం రివ్యూ చెప్పడం కూడా ప్రేక్షకుడి హక్కేనని అంటున్నారు. ఏది ఏమైనా ‘చెన్నై లవ్ స్టోరీ’ సక్సెస్ మీట్‌లో మొదలైన ఈ చర్చ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయింది.చూడాలి మరి వీటిపై రివ్యూ రైటర్స్ ఎలాంటి రివ్యూలు వదులుతారో !
also read :“జబర్దస్త్‌కి అప్పటి క్రేజ్ లేదు.. అసలు కారణం ఇదే!”