AC Coaches In Trains: దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రైల్వే ప్రయాణీకులు ఏసీ క్లాసులలో జర్నీ చేసేందుకు ఇష్టపడుతారు. సౌకర్యవంతంమైన ప్రయాణం కోసం ఎయిర్ కండీషన్డ్ కోచ్ ల వైపు మొగ్గు చూపుతారు. సాధారణంగా రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకెండ్ ఏసీ, థర్డ్ ఏసీ,3E అనే క్లాసులు ఉంటాయి. వీటి మధ్య తేడా ఏంటి? ఏ క్లాస్ లో ఏ సదుపాయాలు ఉంటాయి? ప్రయాణీకులకు ఏది బెస్ట్ అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ ఫస్ట్ ఏసీ- విలాసవంతమైన ఎంపిక
భారతీయ రైల్వేలో ఫస్ట్ ఏసీ అనేది అత్యంత విలాసవంతమైన ఎంపిక. సుదూర ప్రయాణం చేసే వాళ్లు ఈ క్లాస్ ను ఎంచుకుంటారు. ప్రైవసీతో పాటు సౌకర్యవంతంగా ప్రయాణం చేయాలనుకునే వారి కోసం ఈ క్లాస్ ను అందుబాటులో ఉంచారు. ఈ కోచ్ లు రెండు లేదంటే నాలుగు బెర్తుల లాకబుల్ క్యాబిన్‌లను కలిగి ఉంటాయి. ఈ క్లాస్ లో ప్రయాణం చేసే వారికి కార్పెట్ తో కూడిన క్యాబిన్‌లు, వ్యక్తిగత రీడింగ్ ల్యాంప్‌లు, తాజా బెడ్డింగ్, అటెండర్‌ల కోసం కాల్ బటన్‌లు, వేడి నీటితో కూడిన ప్రైవేట్ వాష్ రూమ్ లను కూడా ఆనందిస్తారు. ఉన్నత స్థాయి అధికారులు, VIPలు తరచుగా ఫస్ట్ ACని ఇష్టపడతారు.
⦿ సెకెండ్ ఏసీ: స్మార్ట్ ట్రావెలర్స్ కోసం
ఫస్ట్ ఏసీతో పోల్చితే సెకెండ్ ఏసీ కాస్త తక్కువ సౌకర్యాలతో ఉంటుంది. ధర కూడా కాస్త తక్కువగా ఉంటుంది. ప్రతి బేలో నాలుగు ప్రధాన బెర్త్‌లు, రెండు సైడ్ బెర్త్‌లు ఉంటాయి. మిడిల్ టైర్ లేకుండా, థర్డ్ AC కంటే ఎక్కువ స్థలాన్ని అందిస్తాయి. బెర్తుల మధ్య గోప్యత కోసం కర్టెన్లు ఉంటాయి. పరుపులు, ఛార్జింగ్ పోర్ట్‌లు, రీడింగ్ లైట్లు ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచుతాయి.
⦿ థర్డ్ ఏసీ- బడ్జెట్ ఫ్రెండ్లీ ఏసీ జర్నీ కోసం
థర్డ్ ఏసీ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ ఏసీ ప్రయాణానానికి అనుకూలంగా ఉంటుంది. 64–72 బెర్త్‌లు మూడు అంచెలుగా ఉంటాయి. టికెట్ ఖర్చు తక్కువగా ఉన్న నేపథ్యంలో అతంగా ప్రైవసీ ఉండదు. కానీ ప్రయాణీకులకు బెడ్డింగ్, ఛార్జింగ్ పాయింట్లు, రీడింగ్ లైట్లు లభిస్తాయి.
⦿ ఏసీ 3-టైర్ ఎకానమీ(3E): కొత్తగా అందుబాటులోకి
ఇవి థర్డ్ ఏసీతో పోల్చితే కాస్త తక్కువ స్థలాన్ని అందిస్తాయి. కానీ తక్కువ ధరకు ఈ బెర్తులు లభిస్తాయి. రైలు, జోన్ ఆధారంగా అన్ని మార్గాల్లో బెడ్డింగ్ ఉచితంగా ఉండకపోవచ్చు. ఇది సరసమైన ఎయిర్ కండిషన్డ్ ప్రయాణాన్ని అందించడానికి రూపొందించబడింది. బెర్త్ కాన్ఫిగరేషన్ విషయానికి వస్తే, ప్రతి కంపార్ట్ మెంట్ లో రెండు వైపులా మూడు అంచెల బెర్త్‌లు ఉంటాయి, అప్పర్, మిడిల్, లోయర్ బెర్తులను కలిగి ఉంటుంది. కారిడార్ వెంట రెండు సైడ్ బెర్త్‌లు అప్పర్, లోయర్ బెర్తులు ఉంటాయి.
కోచ్ లను ఎలా గుర్తించాలి?
ఆయా కోచ్ ల మీద రాసి ఉండే కోడ్ ల ఆధారంగా క్లాసులను గుర్తించాలి.
H1: ఫస్ట్ ఏసీ
A1, A2, A3: సెకెండ్ AC
B1, B2, B3: థర్డ్ AC
ఏ క్లాస్ కు ఎంత ఛార్జీ?
ఛార్జీలు అనేవి ఆయా రూట్లను బట్టి మారుతూ ఉంటాయి. ముంబై-ఢిల్లీ ప్రయాణానికి సంబంధించిన ఛార్జీలు ఇలా ఉంటాయి.
ఫస్ట్ AC: ₹4,000–₹8,000
సెకెండ్ AC: ₹2,200–₹2,600
థర్డ్ AC: ₹1,100–₹2,100