Railway Ticket Transfer: భారతీయ రైల్వే సంస్థ.. ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు అనే రకాల సర్వీసులను అందిస్తున్నది. ముఖ్యమంగా ప్రయాణ భారాన్ని తగ్గించేందుకు పలు నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే టికెట్ ట్రాన్స్ ఫర్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. మీరు బుక్ చేసుకున్నటికెట్ ను మీ కుటుంబ సభ్యులకు ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, టికెట్ ను ఏ సమయాల్లో బదిలీ చేసే అవకాశం ఉంటుంది? టికెట్ ట్రాన్స్ చేయాలంటే ఏం చేయాలి? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
టికెట్ ను ఏ సందర్భంలో ట్రాన్స్ ఫర్ చెయ్యొచ్చంటే?
మీరు ముందుగానే టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ అనివార్య కారణాలతో ప్రయాణించలేకపోతే, ఆ టికెట్ ను ఇకపై క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీ బదులుగా మీ కుటుంబ సభ్యులు ప్రయాణం చేయాలనుకుంటే, టికెట్ ను వారి పేరు మీదికి ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సౌకర్యం వల్ల రిజర్వేషన్ చేసుకున్న టికెట్ డబ్బు వృథా కాదు. మీకు బదులు మీ కుటుంబ సభ్యులు హ్యాపీగా జర్నీ చేసే అవకాశం ఉంటుంది. అయితే, కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే టికెట్ ట్రాన్స్ ఫర్ అనేది ఉంటుంది. అంటే, టికెట్ బుక్ చేసుకున్న వ్యక్తి తల్లిదండ్రులు, తోబుట్టువులు, భార్య, పిల్లల పేరు మీదికి ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒకే ఇంటిపేరు ఉన్న కుటుంబ సభ్యులు మాత్రమే టికెట్ ట్రాన్స్ ఫర్ చేసే వెసులుబాటు ఉంటుంది.
రైలు బయల్దేరడానికి 24 గంటల ముందు..
టికెట్ బదిలీ చేయించుకోవాలనుకునే వాళ్లు రైలు బయల్దేరడానికి 24 గంటల ముందే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వెళ్తే చేయరు. టికెట్ ను ట్రాన్స్ ఫర్ చేయాలంటే ముందు మీ టికెట్ కన్ఫర్మ్ చేయబడి ఉండాలి. టికెట్ ట్రాన్స్ ఫర్ అయ్యే వ్యక్తి కుటుంబ సభ్యుడై ఉండాలి. టికెట్ ట్రాన్స్ ఫర్ అనేది తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రైల్వే స్టేషన్లలో అందుబాటులో లేదు. సికింద్రాబాద్, విశాఖపట్నం, కాజీపేట లాంటి స్టేషన్లలో మాత్రమే ఉంది.
Read Also: సడెన్ గా ప్రయాణం క్యాన్సిల్ అయ్యిందా? ఇక టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు!
టికెట్ ట్రాన్స్ ఫర్ కోసం ఏం చేయాలంటే?
టికెట్ ట్రాన్స్ ఫర్ సమయంలో కొన్ని ఐడీ ఫ్రూప్స్ సమరించాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ టికెట్ ఉన్న వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ లాంటి ఫోటో ఐడెంటిటీ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. రైల్వే స్టేషన్ లోని టికెట్ కౌంటర్ లో గెజిటెడ్ అధికారి సమక్షంలో టికెట్ కు ట్రాన్స్ ఫర్ వివరాలను నమోదు చేసిన దరఖాస్తున్న సమర్పించాలి. గెజిటెడ్ అధికారి మీ వివరాలను పరిశీలించి నిజమే అని ఆమోదిస్తే, టికెట్ ను కుటుంబ సభ్యులలో ఒకరి మీదికి ట్రాన్స్ ఫర్ చేయించుకునే అవకాశం ఉంటుంది. టికెట్ ట్రాన్స్ ఫర్ అనేది ఒకేసారి ఉంటుంది. ఒకసారి ఇతరుల పేరు మీదికి ట్రాన్స్ ఫర్ అయితే, తిరిగి మళ్లీ ట్రాన్స్ ఫర్ చేసే అవకాశం ఉండదు.
Read Also: రైల్లో అందరూ చూస్తుండగానే పాస్ పోసిన ప్రయాణీకుడు, మరీ ఘోరం భయ్యా!