Wide Rules: క్రికెట్ లో సాధారణంగా బ్యాటర్లదే హవా కనిపిస్తూ ఉంటుంది. మైదానంలో బ్యాటర్లు తుఫాన్ సృష్టిస్తున్నారు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్నారు. దీంతో బౌలర్లకు మైదానంలో కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందుకే బౌలర్లకు కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యుడు, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పొలాక్ అభిప్రాయపడుతున్నారు.
Also Read: New Zealand Squad: ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే న్యూజిలాండ్ జట్టు ఇదే..కేన్ మామ వచ్చేశాడు!
వైడ్ బాల్ నిబంధనలో మార్పులకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు బ్యాటర్లకు మాత్రమే ప్రయోజనకరంగా ఉన్న వైడ్ బంతి నిబంధనలలో ఐసిసి మార్పులు చేయాలని నిర్ణయించిందని తెలిపారు. బౌలర్లకు కూడా బెనిఫిట్ ఇవ్వడం కోసమే ఈ మార్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల వల్ల బౌలర్లు ఇక్కట్లు పడుతున్నారని.. వన్డే, టి-20 ఫార్మాట్ లలో బ్యాటర్లు క్రీజ్ వదిలి బయటకు రావడం చేస్తుంటారు.
ఆ సమయంలో బౌలర్ బంతిని స్టంప్స్ కి కాస్త దూరంగా వేయడం జరుగుతుందని, ఇకనుండి అటువంటి వాటిపైన అంపైర్లు దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ సమీపిస్తున్న తరుణంలో షాన్ పొలాక్ ఈ ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది. షాన్ పొలాక్ మాట్లాడుతూ.. ” ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యుడిగా నేను ఇదే అంశంపై పని చేస్తున్నాను. బ్యాటర్లతో పాటు బౌలర్లకు కూడా ప్రయోజనం కలిగేలా మార్పులు చేయబోతున్నాం.
బ్యాటర్ చివరి నిమిషంలో క్రీజ్ లో నుండి బయటకు వెళితే.. సరైన ప్రదేశంలో బాల్ వేయడం కష్టం. బ్యాటర్ చివరి క్షణంలో కదులుతారని బౌలర్లు ముందే ఎలా పసిగడతారు. అందుకే బౌలర్లకు ఉన్న ఆ ఇబ్బందిని తొలగించేందుకు {Wide Rules} ఐసీసీ క్రికెట్ కమిటీ నడుం బిగించింది. ఒకవేళ బ్యాటర్ చివరి క్షణంలో కదిలినప్పుడు బంతి దూరంగా వెళ్లిందనుకుందాం.. అప్పుడు ఆ బ్యాటర్ ఎక్కడ ఉన్నాడో.. అక్కడి నుండే బాల్ దూరాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
అప్పుడే వైడ్ బాల్ పై ఓ నిర్ణయానికి రావాలి. ఈ విషయం ప్రస్తుతం చర్చల్లో ఉంది. ఈ మార్పుల ద్వారా బౌలర్లకు మరింత మద్దతు అందించాలన్న ఉద్దేశంతోనే పరిశీలన కొనసాగుతుంది. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ లో దక్షిణ ఆఫ్రికా జట్టు మొదటిసారి ఆడబోతోంది జూన్ నెలలో లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో కనపడబోతోంది.
Also Read: Gilchrist on Rohit Sharma: రోహిత్ ఇక చాలు…ఇంటికి వెళ్లి నీ కొడుకు డైపర్లు మార్చుకో…!
నేను దక్షిణాఫ్రికా జట్టును ఫేవరెట్ గా చూడడం లేదు. కానీ క్రికెట్లో ఏం జరుగుతుందో మనం ఊహించలేం. మన జట్టు ప్రత్యర్థిని ఒత్తిడికి గురి చేస్తే ఫలితాలు సానుకూలంగా ఉండొచ్చు” అని పేర్కొన్నారు. ఈ సౌత్ ఆఫ్రికా మాజీ ఆల్ రౌండర్ షాన్ పొలాక్ ప్రస్తుతం ఐసీసీ క్రికెట్ కమిటీ సభ్యుడిగా ఉన్నందున వైడ్ బాల్స్ రూల్స్ మార్పు అంశం చర్చల దశలో ఉందని పేర్కొన్నారు.