IRCTC: భారతీయ రైల్వే సంస్థ అధికారిక వెబ్ సైట్, యాప్ మరోసారి డౌన్ అయ్యాయి. సరిగ్గా తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో డౌన్ డిటెక్టర్ ఇష్యూ ఏర్పడింది. కొద్ది టికెట్లు బుకింగ్ కాగానే సైట్ క్రాష్ అయినట్లు వినియోగదారులు వెల్లడించారు. తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునేందుకు లాగిన్ కాలేకపోతున్నట్లు చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు వెబ్ సైట్ స్క్రీ షాట్స్ తీసి ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సుమారు గంటపాటు సైట్, యాప్ డౌనట్ అయినట్లు ఎర్రర్ మెసేజ్ లో చూపించింది.
సైట్ డౌన్ వెనుక అనుమానాలు!
గత కొద్ది రోజుల్లో IRCTC డౌన్ కావడం మూడోసారి కావడంతో నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేవలం రెండో వారంలోనే రెండోసారి సైట్ క్రాష్ కావడం పట్ల ఏదో మతలబు ఉందంటున్నారు. పండుగ వేళ తెర వెనుక ఏదో కథ నడుస్తుందంటున్నారు. “IRCTC సరిగ్గా తత్కాల్ టికెట్ బుకింగ్ సమయంలోనే డౌన్ అవుతున్నది. ఇవాళ కూడా అలాగే జరిగింది. సైట్ తిరిగి అందుబాటులోకి వచ్చేసరికి టికెట్లు అయిపోయినట్లు చూపించింది. సంక్రాంతి వేళ ఇదో పెద్ద స్కామ్ గా అర్థం అవుతోంది” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.
#IRCTC is down exactly during tatkal time.
If i could not find online only available Premium tatakal tickets once the site is back. Then its clearly a big SCAM during festive period !! pic.twitter.com/EFOmX9LEnl— Chandra Sekhar (@chanduiith) January 11, 2025
కావాలనే సైట్ ను హ్యాంగ్ చేస్తున్నారా?
వాస్తవానికి గత కొద్ది నెలలుగా IRCTC వెబ్ సైట్ పలుసార్లు డౌన్ అయ్యింది. గత డిసెంబర్‌లోనే మూడు సార్లు క్రాష్ అయ్యింది. పదే పదే సైట్ డౌన్ కావడం పట్ల రైల్వే ప్రయాణీకులలో అనుమాలను వ్యక్తం అవుతున్నాయి. నిజానికి తత్కాల్ బుకింగ్స్ AC క్లాస్ లకు ఉదయం 10 గంటలకు, నాన్-AC క్లాస్ (స్లీపర్, సెకండ్ సిట్టింగ్)కు 11 గంటలకు ఓపెన్ అవుతాయి. తత్కాల్ బుకింగ్స్ సమయంలో ఏర్పడే ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు IRCTC తన సర్వర్ ను గతంలోనే అప్ డేట్ చేసింది. ఇటీవలి కాలంలో తరచుగా సర్వర్ సమస్య తలెత్తుతోంది. IRCTC పోర్టల్ నాన్ ఏసీ క్లాస్ లకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాక 80 శాతానికి పైగా తత్కాల్ టికెట్స్ ఉండగానే సైట్, యాప్ హ్యాంగ్ అవుతున్నట్లు ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఏసీ తత్కాల్ బుకింగ్స్ ఉదయం 10 గంటలకు ప్రారంభమైనా పోర్టల్ ఎప్పుడూ క్రాష్ కాలేదంటున్నారు. నాన్ ఏసీ వరకు వచ్చే సరికి ఈ ఇబ్బంది ఎదురవుతుందంటున్నారు.
Read Also: సంక్రాంతి వెళ్లేవారికి గుడ్ న్యూస్, మరో 26 ప్రత్యేక రైళ్లు ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే
This is what happens when corrupt incompetent babus are running our crucial ministries. #IRCTC site always. I repeat ALWAYS goes down at 11AM during tatkal timing.
Due to reducing the advance booking period to 60 days, now more people are opting for Tatkal. Bad governance pic.twitter.com/VWabYryn9q
— Pun_Tweets (@Pun_Tweets) January 11, 2025
అటు ట్రావెల్ ఏజెంట్లు మాత్రం అధిక డిమాండ్ ఉన్న రూట్లలో కూడా తత్కాల్ టిక్కెట్లను బుక్ చేస్తున్నారని ప్రయాణీకులు ఆరోపిస్తున్నారు. ఈ వెబ్ సైట్ హ్యాంగ్ వెనుక పెద్ద కుట్రేదో ఉందని పలువురు ప్రయాణీకులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై రైల్వేశాఖ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Also: వచ్చేస్తోంది హైడ్రోజన్ రైలు, దీని పవర్ ముందు మిగతావన్నీ దిగదుడుపే!
IRCTC Down !!
Users Are Unable To Book Tickets As Website Faces First Outage Of 2025 !
The website was previously down just before New Year so this marks the second instance of service disruption in less than two weeks pic.twitter.com/sfADOAYHQz
— Stranger (@Stranger4every1) January 11, 2025
Read Also: అమృత్ భారత్ వెర్షన్ 2.0 వచ్చేస్తోంది, బాబోయ్.. ఇన్ని ప్రత్యేకతలా!