Special Trains: శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా దర్శనం కోసం వెళ్లే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తర రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. న్యూఢిల్లీ నుంచి కత్రాకు నేరుగా ప్రత్యేక రైలును అందుబాటులోకి తీసుకొచ్చింది. యాత్రికుల సజావుగా ప్రయాణించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ ప్రత్యక్ష రైలు సేవ ఇంటర్ ఛేంజ్‌ల ఇబ్బందిని, నిరీక్షణ సమయాన్ని ఆదా చేయనుంది. ప్రయాణీకులు ఎలాంటి ఒత్తిడి, ఇబ్బంది లేకుండా శ్రీ మాతా వైష్ణో దేవి దర్శనాన్ని చేసుకునే అవకాశం కల్పించనుంది. దేశంలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన కత్రాకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ప్రత్యేక రైలు షెడ్యూల్, రూట్ వివరాలు
ప్రయాణికుల రద్దీని అనుగుణంగా 04081, 04082 నంబర్‌లతో కూడిన రెండు ప్రత్యేక రైళ్లు రెండు దిశలలో ఒక్కొక్కటి మూడు ట్రిప్పుల చొప్పున నడవనున్నాయి. ఈ రైళ్లు యాత్రికులకు ప్రత్యక్ష, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించనున్నాయి. 04081 నంబర్ గల ఈ ప్రత్యేక రైలు ఆగస్టు 14, 15, 16 తేదీల్లో రాత్రి 11:45 గంటలకు న్యూఢిల్లీ నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రాకు బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు(04082) ఆగస్టు 15, 16, 17 తేదీల్లో రాత్రి 9:20 గంటలకు కత్రా నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు త్వారా యాత్రికులు అమ్మవారి మందిరాన్ని సందర్శించిన న్యూఢిల్లీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి వచ్చే అవకాశం కలుగుతుంది.
వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం
ప్రయాణీకులకు సౌకర్యాన్ని పెంచడానికి, ఈ ప్రత్యేక రైళ్లు ఎంపిక చేసిన కీలక స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి. పానిపట్, కురుక్షేత్ర, అంబాలా కంటాంట్, ధండారి కలాన్, జలంధర్ కంటాంట్, పఠాన్ కోట్ కంటాంట్, జమ్మూ తావి, షహీద్ కెప్టెన్ తుషార్ మహాజన్ స్టేషన్లలో హాల్టింగ్ తీసుకుంటాయి. న్యూఢిల్లీ నుంచి శ్రీ మాతా వైష్ణో దేవి కత్రాకు మొత్తం ప్రయాణ సమయం సుమారు 13 గంటలు ఉంటుంది.
Read Also: దసరాకు ప్రత్యేక రైళ్లు.. వెంటనే బుక్ చేసుకోండి!
ప్రయాణీకులకు అనుగుణంగా కోచ్ లు
ప్రయాణీకుల అవసరాలకు అనుగుణంగా, ప్రత్యేక రైళ్లు ఎయిర్ కండిషన్డ్, స్లీపర్, జనరల్ క్లాస్ తో కూడిన కోచ్ లను కలిగి ఉంటాయి. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు ఈ రైల్లో ప్రయాణించేలా కోచ్ ల ఎంపిక ఉంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు యాత్రికులకు, ముఖ్యంగా అధిక డిమాండ్ సమయాల్లో ఉపశమనం కలిగించనున్నాయి. ఈ ప్రత్యేక సర్వీసు ప్రయాణీకులకు గ్యారెంటీ పథకాన్ని అమలు చేస్తుంది. ఓవర్ బుక్డ్ రైళ్లు, చివరి నిమిషంలో రద్దు చేయడం వల్ల కలిగే ఒత్తిడిని తగ్గిస్తుంది. పండుగ సీజన్ నేపథ్యంలో నార్త్ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది యాత్రికులకు అనవసరమైన ఆలస్యం, ఇతర సమస్యలు లేకుండా శ్రీ మాతా వైష్ణో దేవిని చేరుకోవడానికి సహాయపడుతుంది.
Read Also: దేశంలోనే అతిపెద్ద రైల్వే వంపు, ఎక్కడో కాదు మన రాజమండ్రిలోనే!