విమాన ప్రయాణీకులకు అలర్ట్. బ్యాగేజీకి సంబంధించి రూల్స్ మారాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) లగేజీకి సంబంధించిన కొత్త రూల్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై నిబంధనలను ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలను విధించనున్నట్లు వెల్లడించింది. తాజాగా అమల్లోకి వచ్చి కొత్త రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్త నిబంధనలు ఎందుకోసం?
BCAS తాజా నిబంధనల ప్రకారం.. ప్రయాణీకులు విమానం లోపల ఒక హ్యాండ్ బ్యాగ్ లేదంటే క్యాబిన్ బ్యాగ్ మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతించబడతారు. దాని బరువు 7 కిలోలకు మించకూడదు. ఈ నియమాలు దేశీయ, అంతర్జాతీయ విమానాలకు వర్తిస్తాయి. ప్రయాణీకులు వీటిని కచ్చితంగా పాటించాట్సిందే. ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో విమానాశ్రయ భద్రతను నిర్ధారించడంతో పాటు బోర్డింగ్, చెక్-ఇన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడం లక్ష్యంగా ఈ రూల్స్ ను ఫ్రేమ్ చేసింది. హ్యాండ్ బ్యాగ్‌లు మినహా అన్ని బ్యాగులను చెక్-ఇన్ చేయడం తప్పనిసరి చేసింది. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF), ఇతర భద్రతా సంస్థలు బ్యాగులను ఇకపై మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయనున్నారు. తక్కువ సామాను కారణంగా తనిఖీ ప్రక్రియ వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్
⦿ ప్రతి ప్రయాణీకుడు ఒక క్యాబిన్ బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్ మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతించబడుతుంది.
⦿ బ్యాగ్ గరిష్ట బరువు 7 కిలోలు ఉండాలి.
⦿ బ్యాగ్ పరిమాణం 40 సెం.మీ (పొడవు) x 20 సెం.మీ (వెడల్పు) x 55 సెం.మీ (ఎత్తు) మించకూడదు.
⦿ ల్యాప్ టాప్ బ్యాగులు, లేడీస్ పర్స్, చిన్న బ్యాగులు (3 కిలోల వరకు) వంటి వ్యక్తిగత బ్యాగులు అనుమతించబడతాయి.
⦿ ఈ నియమాలను ఉల్లంఘించిన వారికి అదనపు ఛార్జీలు లేదంటే జరిమానాలు విధిస్తారు.
అమల్లోకి కొత్త రూల్స్ తెచ్చినట్లు విమానయాన సంస్థ
ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు బ్యాగేజీ కొత్త నిబంధనలకు సంబంధించి మార్గదర్శకాలను జారీ చేశాయి. ఎయిర్ ఇండియాలో 7 కిలోల వరకు హ్యాండ్ బ్యాగులు అనుమతించబడతాయి. అదే సమయంలో, 10 కిలోల వరకు హ్యాండ్ బ్యాగులను బిజినెస్, ఫస్ట్ క్లాస్‌లో తీసుకెళ్లవచ్చు. ఇండిగోలో ప్రతి ప్రయాణీకుడు ఒక క్యాబిన్ బ్యాగ్ (7 కిలోలు), ఒక వ్యక్తిగత బ్యాగ్ (3 కిలోలు) తీసుకెళ్లడానికి అనుమతి ఉంది. బ్యాగ్ మొత్తం పరిమాణం 115 సెం.మీ మించకూడదు.
Read Also: ఈ రోడ్ల నుంచి సంగీతం వస్తుంది.. ఈ టెక్నాలజీకి సలాం కొట్టాల్సిందే!
ప్రయాణీకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
⦿ ప్రయాణించే ముందు బ్యాగ్ బరువు, పరిమాణాన్ని చెక్ చేసుకోండి.
⦿ 7 కిలోల కంటే ఎక్కువ సామాను ఉంటే, దానిని చెక్-ఇన్ బ్యాగేజీలో ఉంచండి.
⦿ ఎయిర్‌లైన్స్ రూల్స్ తెలుసుకోండి. ప్రతి ఎయిర్‌లైన్ నియమాలు డిఫరెంట్ గా ఉండవచ్చు.
⦿ హ్యాండ్ బ్యాగ్‌లో పాస్‌పోర్ట్, టికెట్, మెడిసిన్స్ లాంటి ముఖ్యమైన వస్తువులను ఉంచుకోండి.
ప్రయాణీకుల భద్రత, సౌలభ్యాన్ని పెంచడానికి విమాన ప్రయాణానికి కొత్త నియమాలు రూపొందించబడ్డాయి. ఈ కొత్త నియమాలతో విమాన ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా, ఈజీగా మార్చడానికి అకాశం కలగనుంది.
Read Also: తత్కాల్ స్కామ్.. వాళ్ల కోసం రైల్వే అలా చేస్తుందా?