BigTV English

Refund Rules: ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా? రీఫండ్ రూల్స్ గురించి తెలుసుకోండి..

Refund Rules: ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ చేస్తున్నారా? రీఫండ్ రూల్స్ గురించి తెలుసుకోండి..

Indian Railways: భారతీయ రైల్వే సంస్థ ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ద్వారా రైలు టికెట్లను అమ్ముతుంది. చాలా మంది  ఈ యాప్ లేదంటే వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటారు. గతంలో రైలు ప్రయాణానికి మూడు నెలల ముందు టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు రెండు నెలలకు తగ్గించారు. అయితే, ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న వాళ్లు కొన్నిసార్లు టికెట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. అనివార్య కారణాలతో ప్రయాణాలు రద్దు అయిన సందర్భంలో టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటారు. అయితే, రైలు బయల్దేరే సమయాన్ని బట్టి రీఫండ్ అనేది ఉంటుంది. ఇంతరీ రీఫండ్ రూల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


పూర్తి రీఫండ్ రావాలంటే టికెట్లు ఎప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలి?

ఇ-టికెట్లను ఆఫ్‌ లైన్ ద్వారా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉండదు. ఆన్‌ లైన్‌ లోనే రద్దు చేసుకోవాల్సి ఉంటుంది. కౌంటర్ లో టికెట్ తీసుకున్న వాళ్లు కచ్చితంగా ఆఫ్ లైన్ ద్వారానే టికెట్ క్యాన్సిల్ చేసుకునే వెలుసుబాటు ఉంటుంది. అయితే, టికెట్లు వీలైనంత వరకు ఛార్ట్ ప్రిపరేషన్ కాకముందే క్యాన్సిల్ చేసుకోవాలి. ఒకవేళ ఛార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత టికెట్లు క్యాన్సిల్ చేసినా రీఫండ్ అనేది ఉండదు.


ఫుల్ రీఫండ్ పొందాలంటే?

రైలు బయల్దేరడానికి 48 గంటల ముందు టికెట్లు రద్దు చేసుకుంటే క్యాన్సిలేషన్ ఛార్జీలు మినహాయించుకుని పూర్తి రీఫండ్ అందిస్తారు. రైలు బయల్దేరడానికి 12 నుంచి 48 గంటల్లో టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఛార్జీలు అదనంగా వసూళు చేస్తారు. టికెట్ రేట్లలో 25 శాతం వరకు ఛార్జీలు కట్ చేసి మిగతా డబ్బులు రీఫండ్ చేస్తారు. ఇక రైలు బయల్దేరడానికి 12 నుంచి 4 గంటల్లోగా టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటే  టికెట్ ధరలో 50 శాతం ఛార్జీ పడుతుంది. మిగిలిన మొత్తానికి రీఫండ్ అందిస్తారు.

క్యాన్సిలేషన్ ఛార్జీలు ఎంత ఉంటాయంటే?

టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు అనేవి  ఏసీ ఫస్ట్ క్లాస్ లేదంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు రూ.240 ఛార్జీ విధిస్తారు. ఏసీ 2 టైర్ లేదంటే ఫస్ట్ క్లాస్‌ కు రూ. 200 ఛార్జీ కట్ చేస్తారు. ఏసీ 3 టైర్/ ఏసీ 3 ఎకానమీకి/ఏసీ ఛైర్ కార్ కు రూ. 180 ఛార్జీ విధిస్తారు. స్లీపర్ క్లాస్‌ క్యాన్సిలేషన్ ఛార్జీ రూ. 120, సెకండ్ క్లాస్‌ కు రూ. 60 వసూలు చేస్తారు.

Read Also: ప్రారంభానికి రెడీ అవుతున్న వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జ్, దీని ప్రత్యేకతలు ఎంతో తెలుసా?

ఛార్ట్ ప్రిపేర్ అయితే నో రీఫండ్

ఇక రైలు బయల్దేరడానికి సుమారు 3 గంటల ముందు ఛార్ట్ ప్రిపేర్ అవుతుంది. ఆ తర్వాత టికెట్ క్యాన్సిల్ చేసుకునేందుకు అవకాశం ఉండదు. ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేసుకున్నా రీఫండ్ అనేది ఉండదని వెల్లడించింది. ఇలాంటి సందర్భంలో టీడీఆర్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది.  ఇక ఈ రీఫండ్ డబ్బులు అనేవి పేమెంట్ మోడ్‌ను బట్టి  5 నుంచి 7 రోజుల్లోగా ఖాతాల్లో జమ అవుతాయి.

Read Also: మస్క్ మామకు బ్యాడ్ న్యూస్, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వెళ్లే రైలును ఆవిష్కరించిన డ్రాగన్ కంట్రీ!

Related News

Secunderabad Station: ఆ 32 రైళ్లు ఇక సికింద్రాబాద్ నుంచి నడవవు, ఎందుకంటే?

Raksha Bandhan 2025: వారం రోజుల పాటు రక్షాబంధన్ స్పెషల్ ట్రైన్స్.. హ్యపీగా వెళ్లొచ్చు!

Garib Rath Express: గరీబ్ రథ్ ఎక్స్‌ ప్రెస్ రైలు పేరు మారుతుందా? రైల్వే మంత్రి ఏం చెప్పారంటే?

Safest Cities In India: మన దేశంలో సేఫ్ సిటీ ఇదే, టాప్ 10లో తెలుగు నగరాలు ఉన్నాయా?

Vande Bharat Express: ఆ మూడు రూట్లలో వందే భారత్ వస్తోంది.. ఎన్నేళ్లకో నెరవేరిన కల.. ఎక్కడంటే?

SCR Special Trains: చర్లపల్లి నుండి కాకినాడకు స్పెషల్ ట్రైన్.. ఏయే స్టేషన్లలో ఆగుతుందంటే?

Big Stories

×