Dileep Shankar:ఇటీవల కాలంలో సెలబ్రిటీలు అర్ధాంతరంగా తనువు చాలిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. పరిస్థితులు ఏవైనా కానీ.. తనువు చాలించడం వల్ల ఆ సమస్య తీరిపోతుందా? అనేది అభిమానుల ప్రశ్న. కష్టం ఎంతటిదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవడమే మనిషి యొక్క లక్షణం అని కూడా కామెంట్లు చేస్తున్నారు. అన్నీ తెలిసినా సరే చాలామంది సెలబ్రిటీలు తమ కొచ్చిన కష్టాన్ని భరించలేక లేదా ఎదుర్కోవడంలో విఫలం అయ్యి ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే మరికొంతమంది అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించి, అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నారు. అలాంటి వారిలో మలయాళ సీరియల్ నటుడు దిలీప్ శంకర్ (Dileep Shankar)కూడా ఒకరు.
హోటల్ గదిలో శవమై కనిపించిన దిలీప్..
తిరువనంతపురం లోని ఒక ప్రైవేటు హోటల్లో దిలీప్ శంకర్ శవమై కనిపించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. దిలీప్ శంకర్ మృతికి గల కారణాలు మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. గత రెండు రోజులు క్రితమే దిలీప్ శంకర్ ఒక హోటల్లో రూమ్ తీసుకున్నారు. అయితే ఆయన అప్పటి నుంచి బయటకు వెళ్లలేదని హోటల్ సిబ్బంది కూడా చెబుతోంది. ఈరోజు హోటల్ గది నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చిన హోటల్ సిబ్బంది, వారి సమక్షంలోనే గదిని తెరిచినట్లు సమాచారం. ఇక అక్కడ దిలీప్ కుమార్ శవమై కనిపించడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే దిలీప్ మరణానికి గల కారణాలు ఏంటి? ఆయనను ఎవరైనా చంపేశారా? లేక ఆయనే ఆత్మహత్య చేసుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి కొంతమంది ఎవరైనా చంపేస్తే తలుపు ఎలా లాక్ చేయబడి ఉంటుంది? అంటూ అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికైతే దిలీప్ మరణానికి అసలు కారణం మాత్రం రహస్యంగానే మిగిలిపోయింది. మరి దర్యాప్తు చేపట్టిన పోలీసులు త్వరలోనే నిజాన్ని తేల్చనున్నట్లు సమాచారం.
దిలీప్ మృతి పై స్పందించిన పోలీసులు..
పోలీసులు మాట్లాడుతూ.. హోటల్లో చనిపోయిన మృతిలో ఎలాంటి అనుమానాలు లేవని ప్రాథమిక అంచనా వేశారు. ఫారెన్సిక్ బృందం మొత్తం గదిని తనిఖీ చేస్తోందని కన్వెన్షన్ ఎస్పీ స్పష్టం చేశారు. శంకర్ అకాల మరణం మలయాళ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది.
దిలీప్ శంకర్ నటించిన సినిమాలు..
ప్రస్తుతం దిలీప్ ఫ్లవర్స్ టీవీలో ఒక సీరియల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇక ఆయన చివరిసారిగా ‘పంచాగ్ని’ అనే సీరియల్ లో చంద్రసేన అనే పాత్రలో నటించారు.ఇటీవల ‘అమ్మయ్యరియతే’ అనే సినిమాలో పీటర్ పాత్ర చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
దిలీప్ మృతికి బాధపడుతున్న సహనటి..
ఇకపోతే దిలీప్ మృతిపై పంచాగ్ని మహానటి సీమ జి నాయర్ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా ఖాతా ద్వారా అసలు విషయాన్ని తెలియజేశారు. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో..” ఐదు రోజుల క్రితం మీరు నాకు ఫోన్ చేశారు.. కానీ నేను మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను” అంటూ రాసుకుంది. మరి దిలీప్ ఈమెకు ఏ కారణం చేత ఫోన్ చేశారు? ఏం మాట్లాడాలనుకున్నారు? అనే విషయాలు మాత్రం తెలియడం లేదు. ప్రస్తుతం దిలీప్ మరణాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.