E-Paper
Advertisement

బ్లింకిట్ గా మారిపోయిన ఇండియన్ రైల్వే.. రిక్వెస్ట్ పెట్టిన 10 నిమిషాల్లోనే డైపర్లు వచ్చేశాయ్!

బ్లింకిట్ గా మారిపోయిన ఇండియన్ రైల్వే.. రిక్వెస్ట్ పెట్టిన 10 నిమిషాల్లోనే డైపర్లు వచ్చేశాయ్!
Advertisement

Indian Railways Arranges Baby Diapers: రైలు ప్రయాణంలో చిన్న పిల్లలతో వెళ్లేటప్పుడు తల్లిదండ్రులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పాలు, ఫుడ్, దుస్తులు, డైపర్లు లాంటి అవసరమైన వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకుంటారు. అయితే, ప్రయాణం మధ్యలో అవసరమైన ఏదైనా వస్తువు అనుకోకుండా అయిపోతే ఇబ్బందులు తప్పవు. ఇలాంటి పరిస్థితి ఎదురైన ఓ తండ్రికి భారతీయ రైల్వే సకాలంలో సాయం అందించింది. రైల్‌మదాద్ ద్వారా వచ్చిన రిక్వెస్ట్ కు అధికారులు జస్ట్ 10 నిమిషాల్లో పరిష్కారం చూపించారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ప్రయాణంలో ఎదురైన అనుకోని ఇబ్బంది!

దేవి ప్రసాద్ అనే ప్రయాణికుడు తన ఆరు నెలల బిడ్డతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నాడు. ప్రయాణానికి అవసరమైన వస్తువులను ముందుగానే తీసుకున్నప్పటికీ, మార్గమధ్యంలో చిన్న సైజు డైపర్లు అయిపోయాయి. దీంతో వాటిని ఎక్కడి నుంచి తీసుకోవాలో తెలియక ఇబ్బందిపడ్డాడు. చిన్న పిల్లల విషయంలో డైపర్లు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా సుదీర్ఘ రైలు ప్రయాణాల్లో అందుబాటులో లేకపోతే తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో ఆ ప్రయాణికుడు రైల్వే అధికారులను సంప్రదించేందుకు నిర్ణయించుకున్నాడు. భారతీయ రైల్వే అందిస్తున్న అధికారిక ఫిర్యాదుల పరిష్కార వేదిక రైల్‌మదాద్‌ ద్వారా తన సమస్యను తెలియజేశాడు.

ఫిర్యాదు చేసిన పది నిమిషాల్లోనే స్పందన!

Advertisement

దేవి ప్రసాద్ తన ఎక్స్‌ వేదికగా రైల్వే అధికారులు స్పందించిన తీరును పంచుకున్నారు. ఉదయం 10:07 గంటలకు రైల్‌మదాద్‌లో రిక్వెస్ట్ చేసినట్లు వెల్లడించాడు. తన బిడ్డకు అవసరమైన డైపర్లు అయిపోయాయని, వాటిని అందించాలని  కోరాడు. ఫిర్యాదు చేసిన కొద్దిసేపటికే రైల్వే సిబ్బంది నుంచి స్పందన వచ్చింది. రైల్‌మదాద్‌ ప్రతినిధులు, రైలు ప్యాంట్రీ కార్‌ మేనేజర్‌ అతడిని సంప్రదించారు. సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.

గయా జంక్షన్‌ దగ్గర డైపర్ల అందజేత

ప్రయాణికుడి ఫిర్యాదుపై స్పందించిన సిబ్బంది, నెక్ట్స్ స్టేషన్‌ దగ్గర డైపర్లు అందించేలా చర్యలు తీసుకున్నారు. గయా జంక్షన్‌ దగ్గర తన బాబుకు అవసరమైన డైపర్లు అందించారు.  సమస్యను పరిష్కరించేందుకు సంబంధిత సిబ్బంది నిమిషాల వ్యవధిలో చేసిన సాయానికి కృతజ్ఞతలు చెప్పాడు.

రైల్వే సర్వీసులలో వేగానికి ఎగ్జాంఫుల్

Advertisement

గత కొన్నేళ్లుగా భారతీయ రైల్వేలో మౌలిక సదుపాయాలు, రైళ్ల ఆధునికీకరణతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంపై కూడా దృష్టి పెరుగుతోంది. బ్రాడ్‌గేజ్‌ నెట్‌వర్క్‌ విద్యుదీకరణ, వందే భారత్‌ రైళ్ల ప్రారంభం లాంటి మార్పులు తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలో చిన్న సమస్యపై కూడా స్పందించి పరిష్కారం చూపడం ప్రయాణికులకు ఉపయోగకరంగా మారింది. ముఖ్యంగా చిన్న పిల్లలతో ప్రయాణించే తల్లిదండ్రులకు అత్యవసర సమయంలో సహాయం అందడం ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. రైల్‌మదాద్‌ వంటి ఫిర్యాదుల పరిష్కార వేదికలను సరిగ్గా వినియోగించుకుంటే ప్రయాణంలో ఎదురయ్యే కొన్ని సమస్యలకు ఈజీగా పరిష్కారం లభిస్తుందని ఈ ఘటన తెలియజేస్తోంది.

Read Also: రైలు క్యాన్సిల్ అయినా నో టెన్షన్.. టికెట్ డబ్బులు సింపుల్ గా ఇలా పొందవచ్చు!

Tags

Related News

రన్నింగ్ ట్రైన్ లోనూ కన్ఫార్మ్ టికెట్ పొందొచ్చు, IRCTCలో ఈ సింపుల్ ట్రిక్ ఫాలోకండి!

రైలు క్యాన్సిల్ అయినా నో టెన్షన్.. టికెట్ డబ్బులు సింపుల్ గా ఇలా పొందవచ్చు!

IRCTC సూపర్ టూర్ ప్యాకేజీ.. భాగ్యనగర అందాలతో పాటు శ్రీశైలం మల్లన్న దర్శనం కూడా!

జస్ట్ రూ.70 వేలకే శ్రీలంక టూర్.. ఐఆర్‌సీటీసీ అదిరిపోయే ప్యాకేజీ వివరాలివే!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. యాదాద్రిలో ఆగనున్న ప్రత్యేక రైళ్లు!

ఎయిర్‌పోర్ట్‌కు నరేంద్ర మోడీ పేరు..ఉత్తరప్రదేశ్ కేబినెట్ సంచలన నిర్ణయం!

రేపు 10 గంటలపాటు రైళ్లు బంద్, 57 మెట్రో స్టేషన్లు మూసివేత!

Big Stories

Advertisement
×