E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode October 11th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని వైజయంతి కనిపెడుతుందా..?

Nindu Noorella Saavasam Serial Today Episode October 11th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరిని వైజయంతి కనిపెడుతుందా..?
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఐసీయూలో ఉన్న సీతారాంను చంపేందుకు మనోహరి వెళ్తుంది. సీతారాంకు ఉన్న ఆక్సిజన్‌ తీసేస్తుంది. దీంతో సీతారాం చనిపోతాడనుకుంటే.. కోమాలోంచి బయటకు వస్తాడు. అది చూసి మనోహరి షాక్‌ అవుతుంది. చనిపోతావనుకుంటే బతికావేంట్రా అంటూ కోపంగా చూస్తూ.. దిండు తీసుకుని సీతారాంను చంపేందుకు ప్రయత్నిస్తుంది. సీతారాం గిలాగిలా కొట్టుకుంటుంటాడు. అప్పుడే బయట పోలీస్‌ వెహికిల్‌ వచ్చిన హారన్‌ సౌండ్‌ వింటుంది మనోహరి. ఈ టైంలో పోలీసులు ఎవరు వస్తున్నారు.. కొంపదీసి వైజయంతి వస్తుందా..? ఏంటి ఎందుకైనా మంచిది ఒకసారి చూద్దాం అనుకుని ఐసీయూలోంచి బయటకు వచ్చి చూస్తుంది. నిజంగానే వైజయంతి వస్తుంది. వెంటనే మనోహరి అక్కడి నుంచి పారిపోయి తన రూంలోకి పడుకుంటుంది.

ఐసీయూలోకి వెళ్లిన వైజయంతి, సీతారాం ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే.. ఏంటో చెప్పమని అడుగుతుంది. సీతారాం సైగలు చేస్తుంటాడు నోటి మాట రాదు. దీంతో వైజయంతి, డాక్టర్‌ను తీసుకురాపో అని కానిస్టేబుల్‌కు చెప్తుంది. డాక్టర్‌ వస్తాడు. సీతారాంకు ఎవరు ఆక్సిజన్‌ తీశారు.. అంటూ ఆక్సిజన్‌ పెడతాడు. అప్పుడే సీతారాం మళ్లీ కోమాలోకి వెళ్తాడు. అదే విషయం డాక్టర్‌, వైజయంతికి చెప్తాడు. వైజయంతి షాక్‌ అవుతుంది. అదేంటి ఇప్పుడే కోమాలోంచి వచ్చిన వ్యక్తి మళ్లీ కోమాలోకి వెళ్లడం ఏంటి..? అంటూ డాక్టర్‌ను అడిగితే.. తాను ఏదో షాక్‌ గురయ్యే సంఘటన చూసి ఉంటాడు మేడం అని డాక్టర్‌ చెప్తాడు.

Advertisement

అయితే ఈ రూంలోకి ఎవరైనా వచ్చారా..? అని వైజయంతి అడిగితే ఎవ్వరూ రాలేదని కాసేపటి క్రితం మాత్రం ఏదో సౌండ్ వచ్చిందని తాను వచ్చి చూస్తే ఏమీ లేదని కానిస్టేబుల్‌ చెప్తాడు. అందుకు వైజయంతి అమర్‌, భాగీ, మనోహరి ఎక్కడున్నారని అడుగుతుంది. వాళ్లు నిద్రపోతున్న రూం దగ్గరకు వెళ్లి చూస్తుంది. ఒక రూంలో రాథోడ్‌, మిస్సమ్మ, అమర్‌ నిద్రపోతుంటారు. మరో రూంలో మనోహరి నిద్రపోతున్నట్టు నటిస్తుంది. అప్పుడే వైజయంతి సీసీటీపీ పుటేజీ ఉంటుంది కదా అది చూద్దాం పదండి అంటూ డాక్టర్‌ను తీసుకుని సీసీటీవీ పుటేజీ ఉన్న రూం దగ్గరకు వెళ్తుంది.

సీసీటీవీ పుటేజీ రూంలో మంటలు మండుతూ సిస్టమ్స్‌ అన్ని మంటల్లో కాలిపోతుంటాయి. అది చూసి వైజయంతి షాక్‌ అవుతుంది. ఏంటి డాక్టర్‌ ఇది అని అడిగితే.. షార్ట్‌ సర్యూట్‌ అయ్యిందేమో మేడం అంటాడు. కానిస్టేబుల్స్‌ను మంటలు ఆర్పమని చెప్తుంది మనోహరి. దీంతో కానిస్టేబుల్స్‌ మంటలు ఆర్పేస్తారు. మంటలు ఆరిపోయిన తర్వాత వైజయంతి రూంలోకి వెళ్లి మొత్తం చెక్‌ చేస్తుంది. తన రూంలో ఉన్న మనోహరి నవ్వుకుంటూ తానే వెళ్లి సీసీటీవీ పుటేజీ ఉన్న రూంలో మంటలు అంటించిన విషయం గుర్తు చేసుకుంటుంది.

Advertisement

రూం అంతా గమనించిన వైజయంతి ఎవరో కావాలనే ఈ మంటలు అంటించారు అంటుంది. షార్ట్‌ సర్యూట్‌ అయ్యుండొచ్చు కదా మేడం అంటూ కానిస్టేబుల్‌ అంటే.. యూ స్టుపిడ్‌ కనిపించడం లేదా… సిస్టం మీద పేపర్స్‌ ఇక్కడ అగ్గిపెట్టే అంటే ఎవరో కావాలనే అంటించారు. నన్ను ఎవరో క్లోజ్గా ఫాలో అవుతున్నారు.. ఈ కేసుకు సంబందించిన సస్పెక్ట్‌ ఎవరో మనల్ని దగ్గర నుంచి అబ్జర్వ్‌ చేస్తున్నారు అంటూ వైజయంతి ఆలోచిస్తుంది. అప్పుడే ఆ రూం డోర్‌ దగ్గరకు వచ్చి చూస్తున్న మనోహరి బలే గెస్ చేశావు వైజయంతి. కానీ అమరే నన్ను పట్టుకోలేకపోయాడు.. నువ్వు పట్టుకుంటావా..? నన్ను.. అని మనసులో అనుకుంటూ నవ్వుకుంటుంది మనోహరి. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Related News

Gundeninda GudiGantalu Today episode: బాలు దెబ్బకు రచ్చ రచ్చ.. రోహిణి ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు షాక్…

Illu Illalu Pillalu Today Episodes: పాపం చందు.. కన్నీళ్లు పెట్టుకున్న రామరాజు.. భాగ్యం పై వల్లి సీరియస్..

Telugu Serials : ఈ వారం టాప్ సీరియల్స్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏది..?

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. ఎండ్ కార్డు..

Podarillu chakri : ‘ పొదరిల్లు ‘ చక్రీ నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..?

Sunday Tv Movies : మూవీ లవర్స్ కు పునకాలే.. ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలే..

జిమ్‌లో దివి సందడి.. ఇష్టమైన వ్యక్తితో వర్కౌట్స్, లేటెస్ట్ వీడియో వైరల్!

Big Stories

Advertisement
×