Tanveer Ahmed On Abhishek and Ishan: టీమిండియా పై పాకిస్తాన్ మాజీలు విషం కక్కుతూనే ఉన్నారు. పొద్దున లేస్తే చాలు… ఏదో ఒక అంశంపై ఇండియాను ఉద్దేశించి విమర్శలు చేస్తూనే ఉంటారు. టీమిండియా మ్యాచ్ గెలిస్తే ఫిక్సింగ్ అనడం… అదే ఓడిపోతే చేతకాలేదని చేతకాలేదు అనడం పాకిస్తాన్ మాజీ లకు అలవాటైపోయింది. ముఖ్యంగా తన్వీర్ అహ్మద్… టీమిండియాను విమర్శించడానికి ఉన్నట్టుగా ఆయన వ్యవహరిస్తూ ఉంటారు. అయితే లేటెస్ట్ గా టీమిండియా బ్యాటర్లను కించపరుస్తూ… పాకిస్తాన్ టి20 కెప్టెన్ ఫర్హాన్ ను నెత్తిన ఎక్కించుకున్నారు. ప్రపంచంలోనే ఫర్హాన్ అత్యంత భయంకరమైన బ్యాటర్ అంటూ కితాబు ఇచ్చారు. అతని ముందు అభిషేక్ శర్మ అలాగే ఇషాన్ కిషన్ దేనికి పనికిరారని తన్వీర్ అహ్మద్ పరువు తీశారు. అభిషేక్, ఇషాన్ ఫ్లాట్ పిచ్ హీరోలే…ఫర్హాన్ కాలి గోటికి కూడా పనికిరారంటూ తన్వీర్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ కెప్టెన్ ఫర్హాన్ కాలిగోటికి కూడా భారత ఆటగాళ్లు అభిషేక్ శర్మ అలాగే ఇషాన్ కిషన్ లు పనికిరారని మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫర్హాన్ స్థిరత్వం కలిగిన ఆటగాడని వెల్లడించారు. ప్రతి మ్యాచ్ లో పరుగులు రాబట్టి పాకిస్తాన్ జట్టును గెలిపిస్తాడని ప్రశంసించారు. బుమ్రా లాంటి భయంకరమైన బౌలర్ల కు కూడా వణుకు పుట్టించాడని గుర్తు చేశారు. అతడి బౌలింగ్ లో సిక్సర్ల మీద సిక్సర్లు కొట్టాడని వెల్లడించారు. కానీ అభిషేక్ శర్మ అటు ఇషాన్ కిషన్ ఇద్దరు కూడా స్థిరత్వం లేని ప్లేయర్లు అంటూ పరువు తీశారు. కళ్ళు మూసుకొని బ్యాట్ ఊపుతారని… హైవే లాంటి పిచ్ లపై మాత్రమే రాణిస్తారని హాట్ కామెంట్స్ చేశారు.
బంతి బ్యాట్ పైకి వస్తే మాత్రమే కొడతారు అంటూ హేళన చేశారు. ఈ ఇద్దరు ఒక మ్యాచ్ లో అద్భుతంగా ఆడితే.. మరో మ్యాచ్ లో డక్ అవుట్ కావడం గ్యారెంటీ అని పరువు తీశారు. కానీ ఫర్హాన్ మాత్రం ప్రతి మ్యాచ్ లో మెరుగైన స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధిస్తాడని గుర్తు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ జట్టును ఓ రేంజ్ కు తీసుకువెళ్తాడని తనకు నమ్మకం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అది త్వరలోనే టి20 నెంబర్ వన్ ఆటగాడుగా ఫర్హాన్ నిలుస్తాడని సంచలన ప్రకటన చేశారు. ఇది ఇలా ఉండగా ఇప్పటికైతే ఇషాన్ కిషన్ టి20 నెంబర్ వన్ బ్యాటర్ గా మొదటి స్థానంలో ఉన్నాడు. రెండవ స్థానంలో అభిషేక్ శర్మ ఉండగా మూడవ స్థానంలో ఫర్హాన్ నిలిచాడు. టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఇటీవల సూపర్ సెంచరీ నమోదు చేసి… 18 స్థానాలు ఎగబాకి ఏడవ స్థానానికి వచ్చాడు.