UP Crime News: భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు పెద్దవి అవుతున్నాయి. ఫలితంగా ఇరువురు మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరి ముఖం మరొకరు చూడలేని పరిస్థితి. ఇద్దరు కూర్చొని సమస్యలపై చర్చిస్తే సమస్యలకు పరిష్కారం లభించింది. ఇగోలకు పోయి ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి యూపీలో జరిగింది.
అసలేం జరిగింది?
యూపీలోని బరేలికి చెందిన రాజ్ ఆర్య-సిమ్రాన్‌లకు ఏడాది కిందట పెళ్లి జరిగింది. ఈ జంటకు బాబు పుట్టాడు. ఇంకా ఏడాది కూడా పూర్తికాలేదు. చిన్నారిని చూసి తల్లిదండ్రులు తెగ ముచ్చట పడేవారు. పెద్ద పెద్ద కలలు కనేవారు. ఆ తర్వాత దంపతుల మధ్య చిన్న సమస్యలు తలెత్తాయి. ఆ తర్వాత మరింత పెద్దవి అయ్యాయి. రోజు రోజుకూ భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఫలితంగా రాజ్ భార్య సిమ్రాన్ పుట్టింటికి వెళ్లిపోయింది. కొద్దిరోజుల తర్వాత ఈ దంపతులు ఓ మ్యారేజ్ కు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రాజ్ ఆర్య.. షాజహాన్ పూర్‌లోని అత్తింటికి వెళ్లాడు. తల్లిదండ్రులకు సిమ్రాన్ ఏం చెప్పిందో తెలీదు. రాజ్‌తో సిమ్రాన్‌ను పంపించడానికి ససేమిరా అన్నారు.
పంతాలకు పోయారు.. ఆపై ఆగ్రహానికి లోనయ్యారు. ఫలితంగా సిమ్రాన్ సోదరులు, రాజ్, ఆయన తండ్రిపై దాడికి పాల్పడ్డారు. చివరకు తండ్రీ కొడుకు బరేలికి వచ్చేశారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే రాజ్ ఫ్యామిలీని ఇదొక అవమానం. ఆ తర్వాత రాజ్ విడాకులకు అప్లై చేసినా బాగుండేది. చివరకు ఈ వ్యవహారంపై పోలీసు స్టేషన్‌కు చేరింది.
ALSO READ: కూతుర్ని గొంతు కోసి చంపి, శవాన్ని బాత్రూంలో దాచిన తండ్రి
స్టేషన్‌లో ఏం జరిగింది?
ఇంటికి వచ్చి తన కుటుంబ సభ్యులపై భర్త, ఆయన తండ్రి దాడి చేశారంటూ కోడలు సిమ్రాన్ కేసు పెట్టింది. ఈ క్రమంలో బుధవారం విచారణ నిమిత్తం రాజ్‌ను పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. స్టేషన్‌లో ఏం జరిగిందో తెలీదు. గురువారం ఇంటికి వచ్చిన రాజ్, నిద్ర వస్తుందని చెప్పి గదిలోని వెళ్లాడు. సిమ్రాన్ ఇన్‌స్టాలో స్టేటస్ చూశాడు రాజ్. ఈ రోజే రాజ్‌ని జైలుకి పంపుతానని పెట్టుకుంది. దీనిపై కలత చెందాడు భర్త రాజ్.
ఇంకోవైపు స్టేషన్‌లో జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకున్నాడు. మళ్లీ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుందన్న భయంతో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజ్ ఆత్మహత్య విషయం తెలియగానే పోలీసులు ఇంటికి చేరుకున్నారు. అక్కడ లభించిన సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని అన్నారు పోలీసులు. ఈ ఘటనపై ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు. మరోవైపు సిమ్రాన్ బ్రదర్ పోలీసు అధికారి. ఈ కారణంగా స్టేషన్‌లో సిమ్రాన్ తన భర్తను కొట్టించిందని, దాన్ని అవమానం తట్టుకోలేక రాజ్ మృతి చెందాడని ఆయన కుటుంబసభ్యులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.
తన సోదరుడు మృతి వెనుక సిమ్రాన్ వివాహేతర సంబంధమే కారణమని రాజ్ సోదరి చెబుతోంది. రాజ్‌పై ఫిర్యాదుకు ముందు ఇక ఊచలు లెక్కపెట్టు అంటూ ఇన్‌స్టాలో సిమ్రాన్ చేసిన పోస్టును బయటపెట్టింది. మరి పోలీసులు అసలు నిజాలను బయటపెడతారా? లేదో చూడాలి.