Railways Tickets Booking: చాలా మంది రైల్వే టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు డెబిట్ కార్డు లేదంటే క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్స్ చేస్తారు. అయితే, ఆయా క్రెడిట్ కార్డులతో రైల్వే టికెట్ బుకింగ్ చేసే వారికి IRCTC పలు డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తోందనే విషయం చాలా మందికి తెలియదు. ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు, కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ సహా పలు ప్రయోజనాలను కల్పిస్తోంది. నిర్దిష్ట ఆఫర్లు బ్యాంక్, కార్డ్ రకాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇంతకీ ఏ కార్డు ద్వారా టికెట్స్ బుక్ చేసుకుంటే ఏ లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
IRCTC ఆఫర్లు అందించే క్రెడిట్ కార్డులు ఇవే!
⦿ IRCTC HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్: ఈ కార్డు ద్వారా టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణీకులకు ప్రతి రూ.100కి 5 రివార్డ్ పాయింట్లు, ఇతర ఖర్చులపై రూ. 100కి 1 పాయింట్ లభిస్తుంది. IRCTC బుకింగ్‌లపై 1% లావాదేవీ ఛార్జీ మినహాయింపు అందిస్తుంది. ఏడాదికి 8 సార్లు కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ పొందే అవకాశం ఉంటుంది. HDFC బ్యాంక్ స్మార్ట్ బై ద్వారా బుకింగ్ లపై అదనంగా 5% క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
⦿ IRCTC SBI క్రెడిట్ కార్డ్‌లు (ప్రీమియర్, ప్లాటినం): IRCTC SBI ప్రీమియర్ కార్డుతో రైల్వే టికెట్లు కొనుగోలు చేయడం ద్వారా రూ. 100కి 10 రివార్డ్ పాయింట్లు, విమాన టిక్కెట్లు, ఇ- క్యాటరింగ్‌పై 5 పాయింట్లు అందిస్తోంది. ఇక IRCTC SBI ప్లాటినం కార్డుపై రైలు టికెట్లు కొనుగోలు చేస్తే రూ. 100 కు 10 రివార్డ్ పాయింట్లు, 1% లావాదేవీ ఛార్జ్ మినహాయింపుతో పాటు లాంజ్ యాక్సెస్ లభిస్తుంది.
⦿ IRCTC BOBCARD: ఈ కార్డు ద్వారా రైలు టికెట్లు కొనుగోలు చేసే వారికి ప్రతి రూ. 100కు 2 రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఇంధన సర్ ఛార్జ్ మినహాయింపు, స్మార్ట్ EMI ఎంపికలు, ఉచిత యాడ్ ఆన్ కార్డులు లభిస్తాయి.
రివార్డ్ పాయింట్లను ఎలా రీడీమ్ చేయాలంటే?
ఇక ఆయా కార్డుల ద్వారా జమచేసిన రివార్డ్ పాయింట్లను స్టేట్ మెంట్ లో క్యాష్ బ్యాక్ గా రీడీమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని కార్డులు లాంజ్ యాక్సెస్ లాంటి ఇతర ప్రయోజనాల కోసం రిడీమ్ ను అనుమతిస్తాయి. సో, ఇకపై మీరు రైల్వే టికెట్లు బుక్ చేసేటప్పుడు ఆయా కార్డులను ఉపయోగించి IRCTC అందించే పలు ప్రయోజనాలను పొందే ప్రయత్నం చేయండి.
Read Also: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిర్మిస్తున్నవి ఇవే.. మీరు అస్సలు నమ్మలేరు!
ముఖ్య గమనిక: ఇక ఆయా కార్డులకు సంబంధించిన నిర్దిష్ట ఆఫర్లు, ప్రయోజనాలు తరచుగా మారుతూ ఉంటాయి. సో, తరచుగా మీరు IRCTC వెబ్ సైట్ లో లేదంటే సంబంధిత బ్యాంకుతో తాజా వివరాలను తనిఖీ చేసుకోవడం మంచిది. అలా చేయడం వల్ల తాజా వివరాలు, కొత్త ఆఫర్ల గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.
Read Also: ఏపీకి టూర్ ప్లాన్ చేస్తున్నారా? 24 సమ్మర్ స్పెషల్ రైళ్లు ప్రకటించిన సౌత్ సెంట్రల్ రైల్వే!