Indian Railways: సౌత్ ఇండియాలో పలు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రయాణీకులకు సేవలను అందిస్తున్నాయి. వీటిలో పలు సుదూర ప్రయాణాలు చేసే రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్లలో మూడు సూపర్ ఫాస్ట్ రైళ్లకు సంబంధించి టైమింగ్స్ మారినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మార్పులు జూలై 11, 2025 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. చెన్నై- పాలక్కాడ్, చెన్నై- బోడినాయకనూర్, మైసూర్- టుటికోరిన్ మధ్య నడిచే రైళ్లు కొత్త టైమింగ్స్ ను ఫాలో అవుతాయని వెల్లడించారు.
⦿ చెన్నై–పాలక్కాడ్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22651)
ఈ రైలు గతంలో కంటే ఇప్పుడు ముందుగానే గమ్యస్థానానికి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. చెన్నైలో బయల్దేరే ఈ ఎక్స్ ప్రెస్ రైలు గతంతో పోల్చితే 25 నిమిషాలకు ముందే దిండిగల్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఉదయం 5.30 గంటలకు స్టేషన్ కు వస్తుంది. 5.35 గంటలకు బయలుదేరుతుంది. ఒద్దంచతిరం ఉదయం 6.01 గంటలకు చేరుకుంటుంది. 6.03 గంటలకు బయల్దేరుతుంది. పళనికి ఉదయం 6.25 గంటలకు చేరుకుని.. 6.30 గంటలకు బయల్దేరుతుంది. ఉడుమలైపేటకు ఉదయం 6.58 గంటలకు చేరుకుని, 7.00 గంటలకు బయల్దేరుతుంది. పొల్లాచికి ఉదయం 7.35 గంటలకు చేరుకుని, 7.40 గంటలకు బయల్దేరుతుంది. పాలక్కాడ్ కు ఉదయం 8.40 గంటలకు చేరుకుని 8.45 గంటలకు బయల్దేరుతుంది. పాలక్కాడ్ జంక్షన్ కు ఉదయం 9.15 గంటలకు చేరుకుంటుంది. గతంలో పోల్చితే 15 నిమిషాల ముందుగా గమ్యస్థానానికి చేరుకుంటుంది.
⦿ చెన్నై–బోడినాయకనూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (20601)
ఈ రైలుకు సంబంధించి దిండిగల్- బోడి మధ్య వేగాన్ని పెంచారు. చెన్నై నుంచి బయల్దేరే ఈ రైలు 10 నిమిషాల ముందుగానే అంటే ఉదయం 5.47 గంటలకు దిండిగల్ స్టేషన్ కు చేరుకుంటుంది. 5.50 గంటలకు బయల్దేరుతుంది. మధురైకి ఉదయం 6.40కి చేరుకుని 6.45కి బయల్దేరుతుంది. ఉసిలంపట్టికి ఉదయం 7.28 గంటలకు చేరుకుంటుంది. 7.30కి బయల్దేరుతుంది. అండిపట్టికి ఉదయం 7.48కి చేరుకుంటుంది. 7.50 బయల్దేరుతుంది. థేనికి ఉదయం 8.03 గంటలకు చేరుకుంటుంది. 8.05 గంటలకు బయల్దేరుతుంది. గతంలో పోల్చితే 15 నిమిషాల ముందుగా అంటే ఉదయం 8.55 గంటలకు బోడినాయకనూర్ కు చేరుకుంటుంది.
⦿ మైసూర్–ట్యూటికోరిన్ ఎక్స్‌ప్రెస్ (16236)
ఈ రైలుకు సంబంధించి దిండిగల్- ట్యూటికోరిన్ మధ్య వేగాన్ని పెంచారు. మైసూర్ నుంచి బయల్దేరే ఈ రైలు 14 నిమిషాల ముందుగా అంటే, ఉదయం 6.03 గంటలకు దిండిగల్ కు చేరుకుంటుంది. ఉదయం 6.05కు బయల్దేరుతుంది. కొడైకెనాల్ రోడ్డుకు ఉదయం 6.13కు చేరుకుంటుంది. 6.15 గంటలకు బయల్దేరుతుంది. షోలవంతన్ కు ఉదయం 6.30కు చేరుకుంటుంది. 6.32 గంటలకు బయల్దేరుతుంది. మధురైకి ఉదయం 7.25కి చేరుకుంటుంది. 7.35కి బయల్దేరుతుంది. తిరుపరంకుండ్రంకు ఉదయం 7.46కి చేరుకుంటుంది. 7.47కి బయల్దేరుతుంది. విరుధునగర్ కు ఉదయం 8.18 గంటలకు చేరుకుంటుంది. 8.20 గంటలకు బయల్దేరుతుంది. సత్తూర్ కు ఉదయం 8.38కి చేరుకుంటుంది. 8.40కి బయల్దేరుతుంది. కోవిల్పట్టికి ఉదయం 8.58కి చేరుకుంటుంది. 9.00 గంటలకు బయల్దేరుతుంది. మానియాచికి ఉదయం 9.18 గంటలకు చేరుకుంటుంది. 9.20 గంటలకు బల్దేరుతుంది. గమ్యస్థానానికి 20 నిమిషాల ముందు చేరుకుంటుంది. ఉదయం 10.15 గంటలకు ట్యుటికోరన్ కు చేరుకుంటుంది. సవరించిన సమయాలు నిర్దిష్ట స్టేషన్లకు మాత్రమే వర్తిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. ఆ మార్గాల్లోని ఇతర రైళ్లకు సంబంధించి షెడ్యూల్ లో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించారు.
Read Also: 2 టికెట్స్ కన్ఫార్మ్, మరో 2 వెయిటింగ్ లిస్ట్, నలుగురూ జర్నీ చెయ్యొచ్చా?