BigTV English

Cutting Board: మీరు వాడుతున్న వెజిటేబుల్ కట్టింగ్ బోర్డ్.. ఎంత డేంజరో తెలుసా?

Cutting Board: మీరు వాడుతున్న వెజిటేబుల్ కట్టింగ్ బోర్డ్.. ఎంత డేంజరో తెలుసా?

Big Tv Live Originals: వంటగదిలో కట్టింగ్ బోర్డ్ అనేది చాలా ముఖ్యమైనది. కూరగాయలు కోయడం నుంచి మాంసం ముక్కలను కట్ చేయడం వరకు అన్నింటికీ దీన్ని వాడతాం. దీన్ని వాడినప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసే చెడు బ్యాక్టీరియా తయారయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


ఈ కట్టింగ్ బోర్డ్‌ను సరిగ్గా శుభ్రం చేయకపోతే, సాల్మొనెల్లా, ఇ. కోలై వంటి హానికరమైన క్రిములు వచ్చే అవకాశం ఉందట. ఇవి ఆహారాన్ని కలుషితం చేసి, ఆరోగ్యానికి పెద్ద ముప్పు తెచ్చిపెడతాయంటున్నారు. అందుకే, కట్టింగ్ బోర్డ్‌ను సురక్షితంగా ఉంచడం ఎలాగో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

కట్టింగ్ బోర్డ్‌లో బ్యాక్టీరియా..!
కట్టింగ్ బోర్డ్‌లు కోడి, మాంసం, చేపలు, కూరగాయలు వంటి వివిధ ఆహారాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ ఆహారాలు కొన్నిసార్లు క్రిములను తమతో తీసుకొస్తాయి. కోడి లేదా గొడ్డు మాంసంలో సాల్మొనెల్లా, ఇ. కోలై వంటి బ్యాక్టీరియా ఉండొచ్చు. బోర్డును సరిగ్గా కడగకపోతే, ఈ క్రిములు బోర్డు మీదే ఉండిపోతాయి. అంతేకాదు, కత్తితో పడిన గీతలు, గాట్లు ఆహారానికి సంబంధించిన కొన్ని ముక్కలు, తడిని దాచుకుంటాయి. దీని వల్ల క్రిములు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. అధ్యయనాల ప్రకారం, ఈ బ్యాక్టీరియా గంటలు, రోజుల పాటు బోర్డు మీద బతకగలవు.


చికెన్ కోసిన బోర్డును శుభ్రం చేయకుండా దానితోనే కూరగాయలు కోస్తే, అందులో ఉండే క్రిములు కూరగాయలకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలా ఆహారం కలుషితం అయితే, తిన్నవారికి జ్వరం, వాంతులు, డయేరియా వంటి సమస్యలు రావచ్చు. అమెరికాలో సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (CDC) లెక్కల ప్రకారం, సాల్మొనెల్లా సంవత్సరానికి 13.5 లక్షల మందిని ఇన్ఫెక్ట్ చేస్తుంది. 420 మరణాలకు కారణమవుతుంది.

చెక్క, ప్లాస్టిక్, స్టీల్: ఏది బెటర్?
కట్టింగ్ బోర్డ్‌లు చెక్క, ప్లాస్టిక్, స్టెయిన్‌లెస్ స్టీల్ వంటి వివిధ మెటీరియల్స్‌తో వస్తాయి. ఒక్కొక్కటి దాని లాభాలు, నష్టాలు కలిగి ఉంటాయి.

చెక్క బోర్డ్‌లు: ఇవి సహజంగా కొంత బ్యాక్టీరియాను చంపే గుణం కలిగి ఉంటాయి. చెక్కలోని సూక్ష్మ రంధ్రాలు బ్యాక్టీరియాను లోపలికి లాగి చంపేస్తాయి. కానీ, ఇవి సరిగ్గా శుభ్రం చేయకపోతే పగుళ్లు, వంగడం వంటి సమస్యలు వస్తాయి.

ప్లాస్టిక్ బోర్డ్‌లు: ఇవి డిష్‌వాషర్‌లో కడగడానికి సులభం. కానీ, కత్తి గీతల వల్ల చిన్న చిన్న ప్లాస్టిక్ కణాలు (మైక్రోప్లాస్టిక్స్) ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది. ఈ మైక్రోప్లాస్టిక్స్ ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.

స్టెయిన్‌లెస్ స్టీల్ బోర్డ్‌లు: ఇవి బ్యాక్టీరియా, మైక్రోప్లాస్టిక్స్ రెండు నుంచి సురక్షితం. స్టీల్ ఉపరితలం రంధ్రాలు లేనిది కాబట్టి క్రిములు దాగలేవు. ఇవి మన్నికైనవి, సబ్బు నీటితో లేదా డిష్‌వాషర్‌లో సులభంగా శుభ్రం చేయవచ్చు. కానీ, కత్తుల అంచులకు కొంచెం హాని చేయొచ్చు మరియు కొందరికి జారే ఉపరితలం అసౌకర్యంగా అనిపించవచ్చు.

ఏ బోర్డైనా సరిగ్గా శుభ్రం చేస్తే సురక్షితమే. అయితే, క్రిములు, మైక్రోప్లాస్టిక్స్ గురించి ఆందోళన ఉన్నవారికి స్టెయిన్‌లెస్ స్టీల్ బోర్డ్ మంచి ఎంపిక.

కట్టింగ్ బోర్డ్‌ను సురక్షితంగా ఉంచడం ఎలా?
కట్టింగ్ బోర్డ్‌ను క్రిముల రహితంగా ఉంచడం కోసం కొన్ని సులభమైన అలవాట్లు పాటిస్తే సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బోర్డును వాడిన ప్రతిసారీ వేడి నీటితో, డిష్ సోప్‌తో బాగా కడగాలి. అదనపు రక్షణ కోసం, ఒక గ్యాలన్ నీటికి 1 టేబుల్ స్పూన్ బ్లీచ్ కలిపి శుభ్రం చేసి, ఒక నిమిషం అలాగే ఉంచి, ఆ తర్వాత కడగండి.

కోడి, మాంసం, చేపలకు ఒక బోర్డు, కూరగాయలు, పండ్లు, వండిన ఆహారాలకు మరో బోర్డు వాడండి. ఇలా చేస్తే క్రాస్-కంటామినేషన్ తగ్గుతుంది.

క్రిములు తడిలో వృద్ధి చెందుతాయి. కాబట్టి, బోర్డును కడిగిన తర్వాత పూర్తిగా ఆరనివ్వాలి.

బోర్డు మీద లోతైన గాట్లు, పగుళ్లు వస్తే వాటిని శుభ్రం చేయడం కష్టం. అలాంటి బోర్డ్‌లను వెంటనే మార్చేయాలి.

ప్లాస్టిక్, స్టీల్ బోర్డ్‌లు డిష్‌వాషర్‌లో వేడి సైకిల్‌లో కడగడం మంచిది.

చెక్క బోర్డ్‌లకు అప్పుడప్పుడూ ఫుడ్-గ్రేడ్ మినరల్ ఆయిల్ రాస్తే అవి పొడిబారకుండా ఉంటాయి.

ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి?
చిన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారి కోసం ఆహారం తయారు చేస్తున్నప్పుడు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. వీరికి ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాలు తీవ్రంగా ఉండొచ్చు. కాబట్టి, బోర్డును శుభ్రంగా ఉంచడంతో పాటు, ఆహారాన్ని సరిగ్గా వండడం, కడగడం కూడా ముఖ్యం.

హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.

Related News

Phone screen time: మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? ఈ టైమ్ గుర్తు పెట్టుకోండి.. లేకుంటే?

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Big Stories

×