BigTV English

IRCTC Super App: అన్ని రైల్వే సేవలు ఒకే చోట, ఇండియన్ రైల్వేస్ సూపర్ యాప్ వచ్చేస్తోంది!

IRCTC Super App: అన్ని రైల్వే సేవలు ఒకే చోట, ఇండియన్ రైల్వేస్ సూపర్ యాప్ వచ్చేస్తోంది!

Indian Railways ‘Super-App’: భారతీయ రైల్వే సంస్థ ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కలిపించేందుకు ఎప్పటికప్పు ప్రయత్నిస్తూనే ఉంటుంది. రైల్వే సేవలు మరింత సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నది. అందులో భాగంగానే సరికొత్త ‘సూపర్ యాప్’ను ప్రారంభించబోతున్నది. ఇండియన్ రైల్వేస్ కు సంబంధించిన అన్ని సేవలు ఒకే చోట పొందే అవకాశం కల్పిస్తోంది. ఈ అప్లికేషన్ ద్వారా టికెట్ల బుకింగ్, ఫ్లాట్ ఫారమ్ టికెట్ల కొనుగోలు, రైలు షెడ్యూళ్లను తెలుసుకోవడం సహా అన్నీ రైల్వే సేవలను పొందవచ్చు.


తుది దశకు చేరుకున్న సూపర్ యాప్ తయారీ

భారతీయ రైల్వే సంస్థ తీసుకొస్తున్న ఈ సూపర్ యాప్ ను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్(CRIS) IRCTC  ప్రస్తుత సిస్టమ్‌ ను కలిపి ఒకటిగా తయారు చేస్తున్నారు. CRIS టిక్కెట్లు కొనుగోలు చేసే ప్రయాణీకుల మధ్య ఇంటర్‌ ఫేస్‌ గా IRCT ఇప్పటికీ పని చేస్తుంది. ఇకపై సూపర్ యాప్ లోనే IRCTCకు సంబంధించి అన్ని సదుపాయాలు ఉండబోతున్నాయి. ఇప్పటి వరకు టిక్కెట్ లావాదేవీల కోసం IRCTC రైల్ కనెక్ట్, ఫుడ్ డెలివరీ కోసం IRCTC eCatering ఫుడ్ ఆన్ ట్రాక్, ఫీడ్‌ బ్యాక్ కోసం Rail Madad, అన్‌ రిజర్వ్‌డ్ టిక్కెట్ల కోసం UTS, రైలు ట్రాకింగ్ కోసం నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్ లాంటి వేర్వేరు అప్లికేషన్లు వినియోగిస్తున్నారు. లేదంటే ఆయా వెబ్ సైట్లలో ట్రాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సేవలన్నీ సూపర్ యాప్ లో పొందవచ్చు.


IRCTC రైల్ కనెక్ట్ కు 100 మిలియన్ల డౌన్‌లోడ్స్

ప్రస్తుతం IRCTC రైల్ కనెక్ట్ అప్లికేషన్ 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్లను కలిగి ఉంది. దేశ వ్యాప్తంగా రైల్వే ప్రయాణీకులు అత్యధికంగా ఉపయోగిస్తున్న రైల్వే అప్లికేషన్లలో ఒకటిగా కొనసాగుతోంది. దీనిని రిజర్వు చేయబడిన టికెట్ బుకింగ్ కోసం ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇకపై ఈ సేవలు సూపర్ యాప్ లో కొనసాగనున్నాయి.

గత ఆర్థిక సంవత్సరంలో 453 మిలియన్ బుకింగ్‌లు

IRCTC 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ. 1,111.26 కోట్ల నికర లాభాన్ని,  రూ. 4,270.18 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. భారతీయ రైల్వే వార్షిక నివేదిక ప్రకారం, దాదాపు 453 మిలియన్ల రైలు టికెట్లు బుక్ అయ్యాయి. బుకింగ్‌లను ప్రాసెస్ చేసిన టిక్కెట్ల విక్రయాలు మొత్తం ఆదాయంలో 30.33 శాతం ఉన్నాయి. ప్లాట్‌ ఫారమ్ టిక్కెట్లు, సీజన్ పాస్ డౌన్‌లోడ్ చేసుకునే UTS యాప్ 10 మిలియన్లకు పైగా డౌన్‌ లోడ్లను అందుకుంది. మొత్తంగా త్వరలో లాంఛ్ కాబోయే సూపర్ యాప్ గొడుగు కిందికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని రైల్వే యాప్స్ సేవలు రానున్నాయి. ప్రయాణీకులు ఈజీగా రైల్వే పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ సూపర్ యాప్ కోసం CRIS ఇండియన్ రైల్వేస్ కార్యకలాపాలు, సేవల కోసం అవసరమైన సాఫ్ట్‌ వేర్ సిస్టమ్ లను అభివృద్ధి చేస్తున్నది.

Read Also: రైల్వే టిక్కెట్లు ఇన్ని రకాలా? ఒక్కోదాని మధ్య తేడా ఏంటి? వాటిని ఎలా బుక్ చేసుకోవాలంటే?

Related News

Hidden Waterfall Temple: బయట జలపాతం.. లోపల ఆలయం.. ఆహా ఎంత అద్భుతమో!

Bharat Gaurav Tourist Train: జస్ట్ రూ. 22 వేలకే 4 పుణ్యక్షేత్రాల దర్శనం, IRCTC క్రేజీ ప్యాకేజీ!

US Govt Shutdown: అమెరికా షట్ డౌన్, విమానాలు, వీసాలపై ఎఫెక్ట్ ఉంటుందా?

Etihad Rail: గంటలో దుబాయ్‌కు ప్రయాణం.. ఎతిహాద్ హైస్పీడ్ రైల్ వచ్చేస్తోంది!

Special Trains: పండుగకు 1,450 ప్రత్యేక రైళ్లు, సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్!

Amrit Bharat Express: డ్రోన్ సాయంతో రైలు మొత్తాన్ని కడిగేశారు.. జస్ట్ అరగంటలోనే!

Power Bank ban: విమానంలో పవర్ బ్యాంక్ బ్యాన్.. కారణం ఇదే..

Umbrella: వామ్మో.. రైల్వే ట్రాక్‌ దగ్గర గొడుగు పట్టుకుంటే ఇంత డేంజరా? మీరు అస్సలు ఇలా చేయకండి!

Big Stories

×