E-Paper
Advertisement

New Amrit Bharat Trains : చర్లపల్లి నుంచి 2 అమృత్ భారత్ రైళ్లు, ఎక్కడి వరకు వెళ్తాయంటే?

New Amrit Bharat Trains : చర్లపల్లి నుంచి 2 అమృత్ భారత్ రైళ్లు, ఎక్కడి వరకు వెళ్తాయంటే?
Advertisement

Amrit Bharat Express Expansion: హైదరాబాదీయులకు ఇండియన్ రైల్వే  సౌత్ సెంట్రల్ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. భాగ్యనగరంలో నూతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి రెండు అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు రైళ్లలో ఒకటి చర్లపల్లిని తమిళనాడులోని నాగర్‌కోయిల్‌తో కలుపుతుంది. మరొకటి చర్లపల్లిని ఈశాన్యంలోని ప్రధాన పుణ్యక్షేత్రమైన అస్సాం కామాఖ్యతో కలుపుతుంది. కొత్త అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ సేవలు సుదూర కనెక్టివిటీని మెరుగుపరచడంతో పాటు ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అవకాశాలను కల్పించాలని భావిస్తోంది.

చర్లపల్లి-నాగర్‌ కోయిల్ అమృత్ భారత్ రైలు గురించి..  

నాగర్‌ కోయిల్-చర్లపల్లి వీక్లీ అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ (రైలు నం. 06357) ప్రారంభోత్సవం ఇవాళ(మార్చి 11) జరిగింది. ఈ రైలు సాయంత్రం 5.30 గంటలకు నాగర్‌ కోయిల్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు అంటే గురువారం 11.45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ సర్వీస్ కు సంబంధించి రెగ్యులర్ షెడ్యూల్ త్వరలో రైల్వే అధికారులు ప్రకటించనున్నారు.

ఈ రైలు ఏ స్టేషన్లను కలుపుతుందంటే?

Advertisement

ఈ అమృత్ భారత్ రైలు మార్గం మధ్యలో నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, చెన్నై ఎగ్మూర్, తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం, తిరుప్పాదిరి పులియూర్,   చిదంబరం, తంజావూరు, తిరుచ్చిరాపల్లి, దిండిగల్, మధురై, విరుదునగర్, సాతుర్, కోవిల్‌ పట్టి, తిరునెల్వేలి, వల్లీయూర్ స్టేషన్ల మీదుగా వెళ్తుంది.

చర్లపల్లి–కామాఖ్య అమృత్ భారత్ రైలు గురించి..  

కామాఖ్య-చర్లపల్లి మధ్య నడిచే రెండవ అమృత్ భారత్ ఎక్స్‌ ప్రెస్ శుక్రవారం (మార్చి 13) ప్రారంభం అవుతుంది. ఈ రైలు స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌ లతో నడుస్తుంది. ఈ కొత్త సర్వీసు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలను ఈశాన్యానికి ప్రవేశ ద్వారంగా పరిగణించే అస్సాంతో కలుపుతుంది. ఈ రైలు ఈశాన్య రాష్ట్రాలకు ప్రయాణించే వారికి సరసమైన, సౌకర్యవంతమైన సుదూర ప్రయాణ అవకాశాన్ని అందిస్తుంది.

Advertisement

Read Also: ఫుడ్ సర్వీసెస్ పై ఎల్పీజీ క్రైసిస్ ఎఫెక్ట్, క్లారిటీ ఇచ్చిన ఇండియన్ రైల్వే!

ఈ రైలు ఏ స్టేషన్లను కలుపుతుందంటే?

ఈ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు మార్గం మధ్యలో శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్లగొండ లాంటి స్టేషన్లలో రెండు దిశలలో ఆగుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ సర్వీస్ కు సంబంధించి రెగ్యులర్ షెడ్యూల్ త్వరలో రైల్వే అధికారులు ప్రకటించనున్నారు.

Read Also:  వందే భారత్ రైల్ కోచ్‌లను ఎలా తయారు చేస్తారో చూడాలని ఉందా? ఇదిగో వీడియో!

 

Related News

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

మాన్సూన్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ క్రేజీ రివర్‌ సైడ్ స్పాట్స్ అస్సలు మిస్ అవ్వకండి!

Big Stories

Advertisement
×