Indian Railways Electric Locomotive: అత్యంత వేగవంతమైన ప్రజా, సరుకు రవాణా కోసం భారతీయ రైల్వే సరికొత్త లోకోమోటివ్ లను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా 9000 HP సామర్ధ్యంతో కూడిన ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ను ఆవిష్కరించింది. గుజరాత్ దాహోద్ లోని సిమెన్స్ మొబిలిటీ, ఇండియన్ రైల్వే సంయుక్తంగా EF-9K ఎలక్ట్రిక్ ఫ్రైట్ లోకోమోటివ్ ను పరిచయం చేసింది. ఇప్పటికే కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఈ లోకో మోటివ్ ను పరిశీలించి, ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అయిన సిబ్బందిని అభినందించారు.
వేగవంతమైన రవాణా కోసం
ఇక ఈ పవర్ ఫుల్ ఎలక్ట్రిక్ EF-9K లోకో మోటివ్ లు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లలో 4 500 టన్నుల డబుల్-స్టాక్ కంటైనర్ ను గంటకు గరిష్టంగా 120 కి.మీ వేగంతో తీసుకెళ్లడానికి రూపొందించబడింది. సరుకు రవాణా రైళ్ల సగటు వేగం ప్రస్తుతం గంటకు 20 నుంచి 25 కి.మీ ఉండగా, ఈ లోకోమోటివ్ తో 50 నుంచి 60 కి.మీ పెరగనుంది. వేగవంతమైన ప్రజా, సరుకు రవాణాలో ఈ ఎలక్ట్రిక్ లోకో మోటివ్ లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇప్పటికే ఈ రైలు ఇంజిన్ పరీక్షలు పూర్తి చేసుకుంది. త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది.
India's most powerful single-unit locomotive, the 9000 HP-rated "EF-9K," has been successfully rolled out by Siemens at their Dahod Locomotive Factory in Gujarat.
A total of 1,200 units of this locomotive will be manufactured over the next 11 years as part of the contract.… pic.twitter.com/koTitZJJIR
— Trains of India (@trainwalebhaiya) March 7, 2025
దహోద్ ఇండియన్ రైల్వేస్ ఫ్యాక్టరీలో తయారీ
ఇక ఈ పవర్ ఫుల్ ఎలక్ట్రికల్ రైల్వే లోకోమోటివ్ లను దహోద్ ఇండియన్ రైల్వేస్ ఫ్యాక్టరీలో అసెంబుల్ చేస్తున్నారు. ఇందులో 89 శాత స్వదేశీ వస్తువులను వినియోగిస్తున్నారు. విశాఖపట్నం, రాయ్ పూర్, ఖరగ్ పూర్, పూణేలోని ఇండియన్ రైల్వేస్ డిపోలలో మెయింటెనెన్స్ పనులు నిర్వహించనున్నారు. IGBT ట్రాక్షన్ పరికరాలను మనదేశంలోని సిమెన్స్ మొబిలిటీ ఫ్యాక్టరీలలో ఉత్పత్తి చేస్తారు. తమిళనాడు హోసూర్ ప్లాంట్ నుండి ILS సిరీస్ బ్రేకింగ్ సిస్టమ్‌లను సరఫరా చేయడంతో పాటు నిర్వహణ సేవలను అందించడానికి వాబ్టెక్ భారత ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందం చేసుకుంది.
ప్రపంచంలోనే పవర్ ఫుల్ హైడ్రోజన్ లోకోమోటివ్
ఇక ఇప్పటికే ప్రపంచంలోనే అత్యాధునిక హైడ్రోజన్ రైలును భారతీయ రైల్వే సంస్థ రూపొందిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో తయారవుతున్న హైడ్రోజన్ రైలు ఇంజిన్లతో పోల్చితే, భారత హైడ్రోజన్ రైలు ఇంజిన్ అత్యంత పవర్ ఫుల్ గా తయారవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు దేశాలు హైడ్రోజన్ రైలు ఇంజిన్లను తయారు చేస్తున్నాయి. వాటి సామర్థ్యం 500 నుంచి 600 HP ఉంటుంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో భారత్ తయారు చేస్తున్న ఒక్కో ఇంజిన్ 1,200 HP సామర్థ్యాన్ని కలిగి ఉండబోతోంది. త్వరలో హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో ఈ రైలు ట్రయల్ రన్ కొనసాగనుంది.
Read Also: ఇండియాకు జపాన్ అదిరిపోయే గిఫ్ట్, రెండు బుల్లెట్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!
దేశ వ్యాప్తంగా 35 హైడ్రోజన్ రైళ్ల సేవలు
ఇక కాలుష్య రహిత రైల్వే వ్యవస్థను రూపొందించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. దేశ వ్యాప్తంగా 35 హైడ్రోజన్ రైళ్లను నడిపించాలని ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే హైడ్రోజన్ ప్యూయల్ సెల్స్, సపోర్టింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ల ఇన్ స్టాలేషన్ మొదలయ్యింది. హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ల డిజైన్లు ఇప్పడికే ఆమోదించబడ్డాయి. ఒక్కో హైడ్రోజన్ రైలు అంచనా వ్యయం రూ. 80 కోట్ల వరకు ఉంటుందని రైల్వే సంస్థ వెల్లడించింది.
Read Also: భారతీయ రైల్వే మరో అద్భుతం, అత్యంత పొడవైన రైల్వే టన్నెల్ పూర్తి!