E-Paper
Advertisement

మీ రైలు టికెట్ వెయిటింగ్‌లో ఉందా? అదే ధరకు ఫ్లైట్‌లో వెళ్లే ఛాన్స్!

మీ రైలు టికెట్ వెయిటింగ్‌లో ఉందా? అదే ధరకు ఫ్లైట్‌లో వెళ్లే ఛాన్స్!
Advertisement

Vikalp Scheme: రైలు టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉందని ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆగండి! ఇండియన్ రైల్వేస్ ‘వికల్ప్’ (VIKALP) స్కీమ్‌తో విమానంలో ప్రయాణించే ఛాన్స్ కొట్టేయొచ్చు. అదెలా అనుకుంటున్నారా? ఈ స్కీమ్ ద్వారా మీ వెయిటింగ్ లిస్ట్ టికెట్.. వేరే రైలులో కన్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందులో కూడా కన్ఫార్మ్ కాకపోతే.. నేరుగా విమానంలో సీట్ దొరుకుతుంది. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా.. ఐఆర్‌సిటిసి (IRCTC) ప్రయాణికులకు అందిస్తున్న ఒక అద్భుతమైన అవకాశం.

IRCTC కొత్త సర్ప్రైజ్

Advertisement

అసలు ఇది ఎలా పనిచేస్తుందంటే.. మీరు ప్రయాణించాల్సిన రైలులో రద్దీ వల్ల సీటు దొరకనప్పుడు, అదే రూట్‌లో వెళ్లే ఇతర రైళ్లలో (అవి రాజధాని లేదా శతాబ్ది వంటి హై-స్పీడ్ రైళ్లైనా సరే) ఖాళీగా ఉన్న సీట్లను మీకు కేటాయిస్తారు. దీనికోసం మీరు పైసా అదనంగా కట్టక్కర్లేదు. ఇక విమాన ప్రయాణం విషయానికి వస్తే.. కొన్ని ప్రత్యేక రూట్లలో రైల్వే శాఖ ఎయిర్‌లైన్స్‌తో ఒప్పందాలు చేసుకుంది. రైలులో సీటు దొరికే అవకాశం లేనప్పుడు, ప్రయాణికులకు విమానంలో ప్రత్యామ్నాయం చూపిస్తారు. అయితే ఇది అన్నిసార్లు జరగకపోవచ్చు, కానీ ఆ అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.

ఒక్క క్లిక్‌తో రైలు నుంచి ఫ్లైట్

Advertisement

ఈ సదుపాయం పొందాలంటే మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఐఆర్‌సిటిసి వెబ్‌సైట్ లేదా యాప్‌లో టికెట్ బుక్ చేసేటప్పుడు అక్కడ కనిపించే ‘Vikalp’ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే చాలు. ఒకసారి చార్ట్ తయారయ్యాక మీకు వేరే రైలులో లేదా విమానంలో సీటు కేటాయిస్తే.. వెంటనే మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. కాబట్టి, ఇకపై టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ఆప్షన్‌ను క్లిక్ చేయడం మర్చిపోకండి. రైలు టికెట్ ధరకే.. విమానంలో ప్రయాణించే ఛాన్స్ మిస్ కాకండి.

Related News

ఢిల్లీలో రైళ్లకు బ్రేక్.. ఏకంగా 110 సర్వీసులపై ఎఫెక్ట్.. కారణం ఏంటంటే?

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓలా, ఉబర్‌లోనే.. సిటీ బస్సుల లైవ్ లొకేషన్!

నీళ్లు తాగకుండానే.. జీవితాంతం బతికేసే 6 వింత జంతువులు.. ఇదేం విచిత్రం సామీ!

రైలులో చైన్ ఎప్పుడు లాగాలి? చట్టం ఏం చెబుతోంది? దుర్వినియోగం చేస్తే పరిస్థితేంటి!

ట్రైన్ కాదు.. నడిచే 5-స్టార్ హోటల్.. ఈ రష్యా రైలును చూస్తే షాక్ అవ్వాల్సిందే!

టోకెన్ ఉన్నా లేకపోయినా రూ. 10 లక్షల ఇన్సూరెన్స్.. టీటీడీ సంచలన నిర్ణయం!

మళ్లీ పట్టాలెక్కనున్న భారత్-బంగ్లాదేశ్ రైళ్లు.. 2 ఏళ్ల తర్వాత ఇరు దేశాల కీలక నిర్ణయం!

నల్లగొండలో హైటెక్ బస్టాండ్.. ఏకంగా రూ. 54 కోట్లతో నిర్మాణం!

Big Stories

Advertisement
×