Naveen Polishetty: కోవిడ్ తర్వాత ఎంతోమంది యంగ్ హీరోలు పెళ్లిపీటలెక్కారు. ఇప్పటికీ టాలీవుడ్‌లో పెళ్లి కాని హీరోలు చాలా తక్కువమందే ఉన్నారు. అందులో మోస్ట్ టాలెంటెడ్ నవీన్ పోలిశెట్టి కూడా ఒకడు. నవీల్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడంటే దానికి ముందుగా పెద్దగా హైప్ ఉండకపోవచ్చు. కానీ ప్రమోషన్స్ బాధ్యతలు అన్నీ తానే తీసుకొని సినమాను కొద్దిరోజుల్లోనే అందరికీ రీచ్ అయ్యేలా చేస్తాడు ఈ యంగ్ హీరో. అందుకే తనంటే ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. తాజాగా నవీన్ పోలిశెట్టి పెళ్లికి సిద్ధంగా ఉండండి అంటూ ప్రీ వెడ్డింగ్ టీజర్ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయ్యిందంటూ చేసిన పోస్ట్.. ఒక్కసారిగా వైరల్ అయ్యింది.
సందేహంలో ఫ్యాన్స్
నవీన్ పోలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ అనే మూవీతో హీరోగా మారాడు. అప్పటివరకు తను పలు షార్ట్ ఫిల్మ్స్‌లో, వెబ్ సిరీస్‌లో నటించాడు. కానీ వెండితెరపై తనకు మొదటిగా హీరోగా గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ఆ మూవీ సూపర్ సక్సెస్ అయిన తర్వాత వెంటనే ‘జాతిరత్నాలు’తో మరో సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు నవీన్. ఆ తర్వాత తనకు వరుసగా పెద్ద నిర్మాతలతో పనిచేసే అవకాశం దొరికింది. ఒకేసారి దాదాపుగా అరడజను సినిమాలు ఓకే చేశారు. అందులో ‘అనగనగా ఒక రాజు’ కూడా ఒకటి. ఇన్నాళ్లు అసలు ఈ సినిమా ఉందా లేదా అని సందేహంలో ఉన్న ప్రేక్షకులకు ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చేశాడు నవీన్.
Also Read: టాలీవుడ్‌లో అలా కాదు, వాళ్లకు అదే కావాలి.. అదేంటి అనుపమ అంత మాట అనేసింది!
ప్రేక్షకులు మర్చిపోయారు
నవీన్ పోలిశెట్టి నటించాల్సిన అప్‌కమింగ్ సినిమాల్లో ‘అనగనగా ఒక రాజు’ కూడా ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను చాలాకాలం క్రితమే విడుదల చేశారు మేకర్స్. కానీ అప్పటినుండి ఇప్పటివరకు ఈ మూవీ గురించి ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో ఈ సినిమా అటకెక్కింది అనే వార్తలు కూడా వచ్చాయి. దాదాపు ఈ మూవీని ప్రేక్షకులంతా మర్చిపోయే సమయంలో ఒక ప్రీ వెడ్డింగ్ టీజర్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ మేకర్స్ పిలుపునిచ్చారు. దీంతో నవీన్ పోలిశెట్టి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. ‘అనగనగా ఒక రాజు’గా నవీన్ ఎంటర్‌టైన్ చేసి హిట్ కొడతాడని నమ్ముతున్నారు.
మరో గ్లింప్స్
రాజుగారి పెళ్లి సందడి మొదలు అంటూ ‘అనగనగా ఒక రాజు’ (Anaganaga Oka Raju) మూవీ నుండి మరొక ఫన్నీ గ్లింప్స్ విడుదలయ్యింది. అయితే ఈ గ్లింప్స్‌లో రాజుగారు అలియాస్ నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) ఫేస్‌ను రివీల్ చేయలేదు. డిసెంబర్ 26న ప్రీ వెడ్డింగ్ టీజర్ వచ్చేస్తుంది అంటూ ఈ వీడియో చివర్లో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇప్పటివరకు ఎంతోమంది యంగ్ హీరోలకు మంచి కథలతో హిట్ అందించిన సితార ఎంటర్‌టైన్మెంట్స్.. ‘అనగనగా ఒక రాజు’ను కూడా నిర్మించడానికి సిద్ధమయ్యింది. కానీ ఈ మూవీకి దర్శకుడు ఎవరు అని మాత్రం ఇంకా రివీల్ చేయలేదు.