Budget Flight Travel: చాలా మందికి జీవితంలో ఒక్కసారి అయిన విమాన ప్రయాణం చేయాలనే కోరిక ఉంటుంది. అయితే, చాలా మందిలో విమాన ప్రయాణం అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహార అనే భావన ఉంది. కానీ, అసలు విషయం ఏంటంటే.. బస్సు టికెట్ ఛార్జీతో విమాన ప్రయాణం చెయ్యొచ్చు. అయితే, కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.
తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేసే చిట్కాలు
⦿ ముందుగా టికెట్ బుక్ చేయండి: దేశీయ విమాన ప్రయాణం కోసం 1-3 నెలల ముందు, అంతర్జాతీయ విమానాల కోసం 2-8 నెలల ముందు టికెట్లు బుక్ చేయడం వల్ల ధరలకు పొందవచ్చు. చివరి నిమిషంలో బుక్ చేయడం వల్ల ధరలు ఎక్కువగా ఉంటాయి.
⦿ రద్దీ రోజులు వద్దు: మంగళవారం, బుధవారం, శనివారం వంటి రద్దీ తక్కువగా ఉండే రోజుల్లో ప్రయాణించడం ద్వారా తక్కువ ధరలకే విమాన టికెట్లు పొందే అవకాశం ఉంటుంది. పీక్ సీజన్ డిసెంబర్, ఆగస్టు కాకుండా ఆఫ్ సీజన్ జనవరి, ఫిబ్రవరి, నవంబర్ లో తక్కువ ధరలకు టికెట్లు లభిస్తాయి.
⦿ లో-కాస్ట్ ఎయిర్‌లైన్స్: మన దేశంలో ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, గోఎయిర్ లాంటి బడ్జెట్ ఎయిర్ లైన్స్ తక్కువ ధరలో టికెట్లు అందిస్తాయి.
⦿ ఫ్లైట్ సెర్చ్ ఇంజన్లను ఉపయోగించండి: Skyscanner, Google Flights, Momondo, EaseMyTrip లాంటి సైట్లు పలు విమాన సంస్థల ధరలను సరిపోల్చి చూపిస్తాయి. Skyscannerలో వోల్ మంత్ టూల్ ద్వారా చౌకైన విమాన టికెట్లను కనుగొనే అవకాశం ఉంటుంది.
⦿ అలర్ట్స్ నోటిఫికేషన్ సెట్ చేయండి: Google Flights, Skyscanner లాంటి సైట్లలో ధర అలర్ట్స్ సెట్ చేస్తే ధరలు తగ్గినప్పుడు నోటిఫికేషన్లు వస్తాయి. అప్పడు తక్కువ ధరలో టకెట్లు బుక్ చేసుకోవచ్చు.
⦿ ట్రావెల్ క్రెడిట్ కార్డులు ఉపయోగించండి: ట్రావెల్ క్రెడిట్ కార్డులు పాయింట్లు, మైల్స్ ఇస్తాయి. వీటిని ఉచిత ఫ్లైట్స్ లేదంటే డిస్కౌంట్ల కోసం రీడీమ్ చేయవచ్చు. ఫారిన్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ లేని కార్డును సెలెక్ట్ చేసుకోవడం మంచిది.
⦿ సమీప విమానాశ్రయాలను ఎంచుకోండి: ప్రధాన విమానాశ్రయాలకు బదులు సమీపంలోని చిన్న విమానాశ్రయాల నుంచి ఫ్లైట్స్ చౌకగా ఉంటాయి. హైదరాబాద్‌కు బదులు విజయవాడ, రాజమండ్రి నుంచి ఫ్లైట్స్ ఎంచుకోవడం మంచిది.
⦿ బ్యాగేజీని తగ్గించండి: బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌లో బ్యాగేజీకి అదనపు ఫీజులు ఉంటాయి. హ్యాండ్ లగేజీతో ప్రయాణించడం ద్వారా ఖర్చులను తగ్గించవచ్చు.
⦿ సేల్స్, ఆఫర్లు ఉపయోగించుకోండి: ఎయిర్ లైన్స్ తరచూ సేల్స్, ప్రమోషన్లను అందిస్తాయి. ఇండిగో ఇటీవల రూ. 1,199 నుండి టికెట్లను అందించింది. ఎయిర్ లైన్స్ సోషల్ మీడియా అకౌంట్స్ ను ఫాలో చేయడం ద్వారా ఈ ఆఫర్ల గురించి తెలుసుకోవచ్చు.
⦿ రౌండ్-ట్రిప్ టికెట్స్ బుక్ చేసుకోండి: సాధారణంగా రౌండ్-ట్రిప్ టికెట్లు చౌకగా ఉంటాయి. కానీ, కొన్నిసార్లు రెండు వేర్వేరు ఎయిర్ లైన్స్‌తో వన్-వే టికెట్లు బుక్ చేయడం ద్వారా డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
⦿ ట్రావెల్ ఏజెన్సీలను వాడుకోండి: EaseMyTrip, Yatra, MakeMyTrip ఎజెన్సీలు డిస్కౌంట్లు, ప్యాకేజీ డీల్స్ అందిస్తాయి. ఫ్లైట్ + హోటల్ కాంబోలు కూడా అందిస్తాయి.
Read Also: ఫ్లైట్ జర్నీ చేస్తున్నారా? కొత్త రూల్స్ గురించి తెలియకపోతే బుక్కైపోతారు!