Mohammad Amir: దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} పండుగ దగ్గర పడింది. ఈనెల 22వ తేదీ నుండి ఈ ఐపీఎల్ 18వ సీజన్ మెగా టోర్ని ప్రారంభం కాబోతోంది. ఈ మెగా ఈవెంట్ కి మొత్తం 13 వేదికలు సిద్ధం చేశారు. ఇక ఈ సీజన్ కోసం ఇప్పటికే అన్ని ప్రాంచైజీలు ప్రాక్టీస్ మొదలు పెట్టేసాయి. డొమెస్టిక్ ప్లేయర్లతోపాటు ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా ప్రిపరేషన్ లో పాల్గొంటున్నారు.
Also Read: Jonty Rhodes: 55 ఏళ్ల వయస్సులో జాంటీ రోడ్స్ అరాచకం.. గూస్ బంప్స్ రావాల్సిందే !
ఇక ఈ 18వ సీజన్ గురించి పక్కన పెడితే.. 2026 లో జరగబోయే ఐపీఎల్ 19వ సీజన్ లో పాకిస్తాన్ పేస్ బౌలర్ మహమ్మద్ అమీర్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఆమధ్య ఐపీఎల్ లో ఆడాలనే తన కోరికను వ్యక్తం చేస్తూ అమీర్.. 2026 లో జరిగే ఐపీఎల్ టోర్నీలో ఆడడానికి అర్హత సాధిస్తానని తెలిపాడు. అయితే పాకిస్తాన్ క్రికెటర్లకి ఐపీఎల్ లో పాల్గొనే అవకాశం లేనందున.. బ్రిటిష్ పౌరసత్వం నుండి అతడు ఐపిఎల్ లో పాల్గొనబోతున్నాడు. 2008లో జరిగిన ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ లో పాకిస్తాన్ కి చెందిన క్రికెటర్లు ఐపీఎల్ లోని వివిధ ఫ్రాంచైజీలలో భాగమయ్యారు.
ఆ తర్వాత 2009లో భారత్ – పాకిస్తాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల కారణంగా.. దాయాది ఆటగాళ్లు ఐపిఎల్ లో ఆడకుండా నిషేధించబడ్డారు. కానీ ఇప్పుడు మహమ్మద్ అమీర్ పాకిస్తాన్ ఆటగాడిగా కాకుండా.. బ్రిటన్ పౌరుడిగా ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. మహమ్మద్ అమీర్ 2009లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టాడు. కానీ 2010లో పాకిస్తాన్ ని కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితాన్ని గడిపాడు.
అయితే తన కేసును వాదించిన బ్రిటన్ కి చెందిన నజ్రీన్ ఖాటూన్ అనే అమ్మాయిని 2016లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈమె పూర్వీకులు గతంలో పాకిస్తాన్ నుండి బ్రిటన్ కి వలస వెళ్లారు. దీంతో నజ్రీన్ కి బ్రిటన్ పౌరసత్వం ఉంది. ఈ క్రమంలో మహమ్మద్ అమీర్ బ్రిటిష్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇంకా పాస్ పోర్ట్ పొందలేదు. ఇతడు 2020లో అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుండి ఇంగ్లాండ్ లోనే ఉంటున్నాడు.
ఈ నేపథ్యంలో మరొక సంవత్సరం గడిస్తే అతడికి బ్రిటిష్ పౌరసత్వం లభిస్తుంది. తద్వారా అతడు ఐపిఎల్ లో ఆడడానికి మార్గం సుగమం కానుంది. ఇక మహమ్మద్ అమీర్ 2020 లోని అంతర్జాతీయ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. 2024 టీ-20 వరల్డ్ కప్ ఆడేందుకు తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఇక ఆ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత మహమ్మద్ అమీర్ మరోసారి అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు. తన కెరీర్లో మొహమ్మద్ అమీర్ 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టి20 మ్యాచ్ లు ఆడాడు. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి 259 వికెట్లు పడగొట్టాడు.
Mohammad Amir said – "I would like to play for RCB. RCB is my favourite IPL team". (Harna Mana hai). pic.twitter.com/68x9m6L3uE
— Tanuj Singh (@ImTanujSingh) March 8, 2025